సత్య హరిశ్చంద్ర విజయా పతాకంపై కె.వి.రెడ్డి దర్శకత్వంలో ఎన్.టి.రామారావు, ఎస్.వరలక్ష్మి, నాగయ్య, ముక్కామల వంటి తారాగణంతో కూడిన 1965 నాటి పౌరాణిక చలనచిత్రం. సత్యం యొక్క గొప్పదనాన్ని సందేశంగా కలిగిన హరిశ్చంద్ర మహారాజు పౌరాణిక గాథను సినిమాగా మలిచారు. ఈ సినిమా ఆర్థికంగా పరాజయం పాలైంది.
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
సత్య హరిశ్చంద్ర (1965 తెలుగు సినిమా) |
|
---|
దర్శకత్వం | కె.వి.రెడ్డి |
---|
నిర్మాణం | కె.వి.రెడ్డి |
---|
తారాగణం | నందమూరి తారక రామారావు, ఎస్. వరలక్ష్మి, నాగయ్య, ముక్కామల, రమణారెడ్డి, రాజనాల, మాష్టర్ బాబు, రాజశ్రీ, మీనాకుమారి, రేలంగి, గిరిజ |
---|
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
---|
నిర్మాణ సంస్థ | విజయా ప్రొడక్షన్స్ |
---|
విడుదల తేదీ | ఏప్రిల్ 22, 1965 |
---|
భాష | తెలుగు |
మూసివేయి
సత్య హరిశ్చంద్ర సినిమా భారీ పరాజయాన్ని పొందింది. ఎన్.టి.రామారావు, నాగయ్య వంటి నటులతో కూడిన భారీతారాగణం, కె.వి.రెడ్డి లాంటి ప్రఖ్యాత దర్శకుడు, విజయ ప్రొడక్షన్స్ వంటి విజయవంతమైన నిర్మాణ సంస్థ ఉన్నా ఆర్థికంగా విజయవంతం కాలేదు.[1]
- అందాల తనయా ఆనంద నిలయా ఇనవంశమణి వీవెరా దినదినము - ఎస్. వరలక్ష్మి
- అదిగో భానుప్రభలు చిమ్ముచు కనులన్గ్రమ్మి అనర్ఘ (పద్యం) - ఘంటసాల
- ఆడనీవు ఈడనేను సూసుకుంటు కూసుంటే ఎన్నాళ్ళు - స్వర్ణలత,రాజనాల మాటలతో
- ఈశ్వరా జగదీశ్వరా ఏమి ఖర్మము పట్టెరా ఎవరి కోపమొ ఎవరి పాపమొ - ఘంటసాల
- కలలోననైన నవ్వులకైన ఏనాడు అనృతమంబు పలుకని - ఘంటసాల
- కాలకౌశికు ముందు తలయెత్త గలవాడు ఎవడు వాడెవడు - మాధవపెద్ది బృందం
- కులములో ఏముందిరా సోదరా మతములో ఏముందిరా - ఘంటసాల బృందం
- తద్దినంపు భోజనం తలచుకుంటె చాలురా నోరూరు చుండెరా - బి. గోపాలం బృందం
- తాళి కట్టిన చేత తరుణి కంఠము త్రుంచు వింత యోగము (పద్యం) - ఘంటసాల
- ధిల్లాన - పి.లీల,గాయకుడు ?
- హే చంద్రచూడ మదనాంతకా శూలపాణే సాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో, .. నమో భూతనాధ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజా - ఘంటసాల, ఎస్. వరలక్ష్మి
- నానా దేవ ధనంబులున్ ద్విజుల మాన్యంబుల్ వినా భురిసమస్త (పద్యం) - ఘంటసాల
- నీవు మాకు చిక్కినావులే రాజా మేము నీకు దక్కినాములే - సుశీల, పి.లీల
- భువిలోని మునులు .. అందాల తనయా ఆనంద ( విషాదం ) - ఎస్. వరలక్ష్మి
- భవవేద సారా సదా నిర్వికారా ..నమో భూతనాధ నమో దేవదేవ - ఘంటసాల, ఎస్. వరలక్ష్మి బృందం
- లొకబాంధవా సర్వలోకైక వంద్య నాకు వేవేల జన్మములయందు (పద్యం) - ఎస్. వరలక్ష్మి
- వందే సురాణాం సారంచ సురేశం నీల లోహితం (శ్లోకం) - ఘంటసాల
- వంశమును నిల్పుకొరకే వివాహమనుచు అగ్నిసాక్షిగ పరిణయ (పద్యం) - ఘంటసాల
- విధి విపరీతం విధి విడ్డూరం విధి విలాసమన ఇదేకదా - ఘంటసాల, ఎస్. వరలక్ష్మి,పి. లీల
- శ్రీమన్మహా దివ్యతేజో విరాజీ కృపాళూ జగజ్జాల రక్షా - ఎస్. వరలక్ష్మి
- సత్యమునకెందు భంగము జరుగువేళ నీవెకదా సర్వరక్ష (పద్యం) - ఎస్. వరలక్ష్మి
- సత్యంబు పాలింప సర్వరాజ్యము వీడి ఆలుబిడ్డలతోడ (పద్యం) - ఘంటసాల
- కులంలో ఏముందిరా సోదరా, మతంలో ఏముందిరా
- మట్టిలో కలిసేటి మడీసీ మడిసికి భేదం ఏముంది ఏముందిరా !
- నిలువు బొట్టుతో స్వరగం రాదురా, అడ్డ బొట్టుతో నరకం పోదురా
- జుట్టూ బొట్టూ కట్టూలన్నీ పాడెకట్టుతో ఎగిరిపోవురా
- జంగాలంతా శివుడే యంటరు దాసరులౌతే భవుడే యంటరు
- జంగము దాసరి జగడమాడుకొని వల్లకాటిలో ఒకటై పోదురు
- తలకో మతముగా నీతులు గీతులు బోధలు చేసే స్వాములు చివరకు
- కాటిరేడు ఈ వీరబాహుని చేతి మీదుగా బూడిదవుదురు
- ---పింగళి నాగేంద్రరావు,ఘంటసాల,పెండ్యాల నాగేశ్వర రావు, 1965 సత్యహరిశ్చ౦ద్ర,
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల' అనే పాటల సంకలనం నుంచి.
మరింత సమాచారం కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు ...
మూసివేయి