Remove ads
మహారాష్ట్ర లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
మహారాష్ట్ర రాష్ట్ర 38 జిల్లాలలో జిల్లా (హిందీ:बुलढाणा जिल्हा) ఒకటి. బుల్ఢానా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. బుల్ఢానా జిల్లా విదర్భ భూభాగంలో భాగంగా ఉంది. మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబయి నగరానికి 500 కి.మీ దూరంలో ఉంది.
బుల్ఢానా జిల్లా | |
---|---|
బుల్ఢానా జిల్లా
बुलढाणा जिल्हा | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
డివిజను | అమరావతి |
ముఖ్య పట్టణం | Buldhana |
మండలాలు | Buldhana, Chikhli, Deulgaon Raja, Khamgaon, Shegaon, Malkapur, Motala, Nandura, Mehkar, Lonar, Sindkhed Raja, Jalgaon Jamod, Sangrampur |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Buldhana (MH-5), Raver (MH-4)( shared with Jalgaon district ) [1] |
• శాసనసభ నియోజకవర్గాలు | Malkapur, Buldhana, Chikhli, Sindkhed Raja, Mehkar, Khamgaon, Jalgaon Jamod |
విస్తీర్ణం | |
• మొత్తం | 9,640 కి.మీ2 (3,720 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 25,88,039 |
• జనసాంద్రత | 270/కి.మీ2 (700/చ. మై.) |
• Urban | 21.2 |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 82.09% |
• లింగ నిష్పత్తి | 928 |
ప్రధాన రహదార్లు | NH-6 |
సగటు వార్షిక వర్షపాతం | 946 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
సరిహద్దు వివరణ | జిల్లా |
---|---|
ఉత్తర సరిహద్దు | మధ్యప్రదేశ్ రాష్ట్రం |
తూర్పు సరిహద్దు | అంకోలా, వాశిమ్, అమరావతి |
దక్షిణ సరిహద్దు | జల్నా |
పశ్చిమ సరిహద్దు | జలగావ్, ఔరంగాబాద్ |
బుల్ఢానా జిల్లా పేరుకు " భిల్ థానా " (భిల్లు గిరిజన తెగకు చెందిన ప్రాంతం) మూలం అని భావిస్తున్నారు..[2]
బుల్ఢానా జిల్లా ప్రాంతం బేరర్ ప్రొవింస్‌లో భాగంగా ఉంది. ఇది విదర్భ రాజ్యంలో భాగంగా ఉండేది. మహాభారతంలో ఈ ప్రాంతప్రస్తావన ఉంది. అశోకుడు పాలించిన కాలంలో (క్రీ.పూ 272) మౌర్య సామ్రాజ్యంలో భాగంగా బేరర్ రూపొందించబడింది. బేరర్ ప్రాంతం శాతవాహనులు (క్రీ.పూ 2వ శతాబ్దం), ఒకతక రాజవంశం (3-6వ శతాబ్దం), చాళుఖ్యులు (6-8 వ శతాబ్దం), రాష్ట్రకూటులు (8-10 వ శతాబ్దం), చాళుఖ్యులు (10-12వ శతాబ్దం), చివరగా దేవగిరికి చెందిన యాదవ్ రాజవంశం (12-14వ శతాబ్దం) పాలనలోఉంది.
జిల్లాలో అల్లాఉద్ధీన్ ఖిల్జీ ప్రవేశంతో ముస్లిముల పాలన మొదలైంది. ఢిల్లీ సుల్తానులు 14వ శతాబ్దం ప్రారంభంలో ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. 15వ శతాబ్దం చివరి వరకు ఈ ప్రాంతం బహమనీ సుల్తానుల పాలనలో ఉంది. 1572లో ఈ ప్రాంతాన్ని నిజాం నవాబు వశపరుచుకున్నాడు. నిజాం సుల్తానేట్ 1595లో ఈ ప్రాంతాన్ని మొగల్ పాలకులల స్వాధీనం చేసాడు. 18 వశతాబ్దం వరకు మొగలుల పాలన కొనసాగింది. తరువాత మొదటి నిజం సుల్తానేటుకు చెందిన అజం జా ఈ ప్రంతన్ని వశపరచుకున్నాడు. 1772 నాటికి బేరర్ స్వతంత్ర రాజ్యంగా అవరరించింది.
1853 లో జిల్లా బేరర్ ప్రాంతంతో చేర్చి బ్రిటిష్ పాలనకు మారింది. బేరర్ తూర్పు, పశ్చిమ జిల్లాలుగా విభజించబడింది. బుల్ఢానా జిల్లా పశ్చిమ బేరర్ జిల్లాలో భాగంగా ఉండేది. 1903లో బ్రిటిష్ ప్రభుత్వం బేరర్ ప్రాంతాన్ని హైదరాబాద్ నవాబు నిజాముకు లీజుకు ఇచ్చింది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,588,039,[3] |
ఇది దాదాపు. | కువైత్ దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | నెవాడా నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 159వ స్థానంలో ఉంది..[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 268 .[3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 15.93%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 928:1000 [3] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 82.09%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. |
జిల్లాలో సాధారణంగా మరాఠీ భాష వాడుకలో ఉంది. ఇండో ఆర్యన్ భాషలలో ఒకటైన అంధ్ భాష 1,00,000 మంది ప్రజలలో వాడుకలో ఉంది. [6]
బుల్ఢానా జిల్లాలో ఉన్న లోనార్ క్రేకర్ సరసు ప్రపంచంలోని బసాలిక్ రాళ్ళలో ఏర్పడిన క్రేటర్ సరసులలో వైశాల్యపరంగా రెండవ స్థానంలో ఉంది. ఇది 60,000 సంవత్సరాల పూర్వం ఏర్పడిందని భావిస్తున్నారు. ఇందులోని నీరు అత్యధిక ఆల్కలైన్ మిశ్రిత జలమని భావిస్తున్నారు. లోనర్ సరసు సమీపంలో ప్రత్యేకమైన వృక్షజాలం, జంతుజాలం కనిపిస్తాయి.
సరిహద్దు వివరణ | జిల్లా |
---|---|
ఉత్తర సరిహద్దు | మధ్యప్రదేశ్ రాష్ట్రం |
తూర్పు సరిహద్దు | అంకోల,వాశిమ్, అమరావతి |
దక్షిణ సరిహద్దు | జల్నా |
పశ్చిమ సరిహద్దు | జల్గావ్, ఔరంగాబాద్ |
ఉత్తర అక్షాంశం | 19.51° నుండి 21.17 ° |
తూర్పు రేఖంశం | 75.57° నుండి 76.59° |
జిల్లాసరిహద్దులలో పలుమార్లు మార్పులు జరిగాయి. 1480లో బేరర్ ప్రొవింస్‌లో భాగంగా ఉంది. బహమనీ సుల్తానేట్,చిఖ్లి, మేఖర్ మహూర్ డివిషన్లో భాగంగా ఉండేవి. ఖాంగావ్, గవి డివిషన్లో భాగంగా ఉండేది. అక్బర్ (1542-1605) పాలనలో ఈ ప్రాంతం నర్నాలా, బైతల్వాద్, మృఖర్ సర్కారులలో భాగంగా ఉండేది. 1634లో ఈప్రాంతం పయన్ఘాట్ సుబాహ్లో (దిగువభూములు) భాగంగా ఉండేది. చిఖ్లి, మేఖర్ బాలాఘాట్ సుబాహ్లో (ఎగువభూభాగం) భాగంగా ఉండేది. 1636లో బేరర్ దక్కన్ ప్రొవింస్‌లో భాగంగా ఉండేది. మల్కాపూర్, జల్గావ్, బద్నర్ భోల్జి, పింపల్గావ్, జెపూర్, రాజ్పూర్లు ప్రధాన పరగణాలుగా ఉన్నాయి. (ఢిల్లీ సుల్తానేట్ పాలనా విభాగాలు) [7]
1853లో బేరర్ భూభాగం నుండి బుల్ఢానా కేంద్రంగా ఉత్తర బేరర్ జిల్లా ఏర్పాటు చేయబడింది. హింగోలీ కేంద్రంగా దక్షిణ బేరర్ జిల్లా ఏర్పాటు చేయబడ్డాయి. [8] ఉత్తర బేర జిల్లాలో ప్రస్తుత అమరావతి జిల్లా భూభాగం, అంకోలా జిల్లా ఉత్తర భూభాగం, బుల్ఢానా జిల్లా భూభాగం చేర్చబడింది. 1857 తిరుగుబాటు తరువాత హింగోలి పొరుగు గ్రామాలు నిజాం తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. బేరర్ భూభాగం అమరావతి తూర్పు బేరర్ జిల్లా ఏర్పాటు, అంకోలా కేంద్రంగా పశ్చిమ బేరర్ జిల్లా ఏర్పాటు చేయబడ్డాయి.[9] 1857 తరువాత చిఖ్లి, మల్కాపూర్ పశ్చిమ బేరర్ జిల్లాలో భాగంగా ఉండేవి. 1864లో నైరుతీ బేరర్ జిల్లాలోని 3 తాలూకాలను వేరుచేసి 1865లో మేకర్ జిల్లా ఏర్పాటు చేయబడింది.
1867లో ఉత్తర బేరర్, మేకర్ జిల్లా భూభాలను కలుపుకుని బుల్ఢానా జిల్లా ఉనికిలోకి వచ్చింది. 1903లో బేరర్ భూభాగం సెంట్రల్ ప్రొవింస్‌లో విలీనం చేయబడిన తరువాత బుల్ఢానా జిల్లా సెంట్రల్ ప్రొవింస్ ఆఫ్ బేరర్ భూభాగంలోని జిల్లాగా మారింది. 1905 ఆగస్టు అంకోలా జిల్లాలోని ఖాంగావ్, జల్గావ్ తాలూకాలు, బేరర్ కలిపి బుల్ఢానా జిల్లా ఏర్పాటు చేయబడింది.[8] 1950లో ఇది నాగ్‌పూర్ కేంద్రంగా మధ్యప్రదేశ్ భాగంగా ఉంది. 1956లో విదర్భలోని మరాఠీ మాట్లాడే భూభాగాలతో ఈ ప్రాంతం బొంబాయి రాష్ట్రంలో భాగంగా మారింది. 1960లో మహారాష్ట్ర రాష్ట్రంలో భాగంగా మారింది.
జిల్లాలో ప్రధానంగా తపి నది, గోదావరి బేసిన్ ఉన్నాయి. జిల్లాలో అదనంగా తపి నదికి ఉపనది అయిన పూర్నియా నది, గోదావరి నది ఉపనదులు అయిన పెన్‌గంగా, కదక్పూర్నా నదులు ప్రవహిస్తున్నాయి.
జిల్లాలో ప్రధానంగా పత్తి, జొన్న, ఇతర చిరు ధాన్యాలు, పొద్దుతిరుగుడు, వేరిచనగ వంటి నూనె గింజలు పండించబడుతున్నాయి. జిల్లాలోని ఖామ్గావ్, మాల్కర్ ప్రాంతాలలో ప్రధానంగా పత్తి వ్యాపారకేంద్రాలుగా ఉన్నాయి. జిల్లాలో పలు చిన్నా పెద్దా నీటిపారుదల సౌకర్యాలు ప్రణాళికలు (నల్గంగా, వాన్) ఉన్నాయి. జిల్లాలో 13 వ్యవసాయ ఆధారిత మార్కెట్ ప్రాంతాలు ఉన్నాయి. ఒక్కొక తాలూకాలో ఒక్కొక మార్కెట్ ఉంది. జిల్లాలో అదనంగా ఉప మార్కెట్లు ఉన్నాయి. [10]" ఇండియన్ కౌంసిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ " 1994లో జిల్లాలో " కృషి విఙాన్ కేంద్ర (జల్గావ్, జమోద్) " పేరిట విఙాన్ కేంద్రాన్ని స్థాపించింది.[11] జిల్లాలో మల్కాపూర్, ఖామ్గావ్ వద్ద ప్రధాన పారిశ్రామిక కేంద్రాలు ఉన్నాయి. చిక్లి, బుల్ఢానా, దాసర్ఖేద్, డియోల్గావ్, మెకర్, సంగ్రామపూర్, లోనార్ లలో చిన్నతరహా పారిశ్రామిక కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి.
జిల్లాలో ఒక పార్లమెంటు నియోజక వర్గం (బుల్ఢానా పార్లమెంటు నియోజక వర్గం ) ఉంది.
జిల్లాలో 6 ఉపవిభాగాలు ఉన్నాయి:- బుల్దానా, మెహ్కర్, ఖంగఒన్, మల్కపుర్, జలగావ్-జమొద్, సింద్ఖెద్రజ
2011 గణాంకాలను అనుసరించి బుల్ఢానా జిల్లాలో 13 తాలూకాలు ఉన్నాయి :- బుల్దానా, కలేవాడి (మహారాష్ట్ర), దెవుల్గావ్, మల్కాపూర్ (బుల్దానా) మొతాలా ( బుల్దానా), నందురా, మెహ్కర్, సింద్కెడ్ రాజా, లోనార్, ఖాంగావ్, షెగావ్,జల్గావ్ (జమోద్), సంగ్రాంపూర్ (భారతదేశం) .
ప్రతి తాలూకా పాలన తాసిల్దార్, రెవెన్యూ ఇంస్పెక్టర్, తలాయీస్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. జిల్లాలోని రెవెన్యూ సర్కిల్స్ :- ధద్ (బుల్దానా), రాయ్‌పూర్ (బుల్దానా), మసల,పదలి, బుల్దానా గ్రామీణ, బుల్దానా నగరం, మేరా (బుల్దానా),ఉంది (బుల్దానా), అందపుర్,ఎక్లర, హత్ని,కొలర, ఖైరవొ, కలేవాడి గ్రామీణ, కలేవాడి టౌన్, బీబీ (బుల్దానా), సుల్తాన్పూర్ (బుల్దానా) తితవి, లోనార్ గ్రామీణ, లోనార్ టౌన్, జలంబ్, మతర్గఒన్,పహుర్జిర, మనస్గవొన్,షెగవొన్ గ్రామీణ, షెగావ్ పట్టణం. [12]
జిల్లాలోని ఒక్కొక్క తాలూకాలో పలు మండలాలు ఉన్నాయి. అవి వరుసగా ధద్ (బుల్దానా), షెలపుర్,ధమంగవొన్,మొతల, షెల్సుర్,అందపుర్, కలేవాడి, ధరంగఒన్ (బుల్దానా), మల్కపుర్, జనెఫల్, ంఎహ్కర్, బీబీ (బుల్దానా), లోనార్,సఖర్ఖెర్ద, సింద్ఖెద్ రాజా, మేరా ఖుర్దు (బుల్దానా),దెఉల్గఒన్ మహి, దెఉల్గావ్ రాజా,గణేష్ (బుల్దానా), పింపల్గఒన్ రాజా, (ఖంగఒన్),నందుర, షెగఒన్, జలగావ్ హమొద్, వర్వత్ ఖందెరఒ, సంగ్రంపుర్. [13]
హేమద్పంతి ఆలయాలు మేకర్- సొనాతి,సింధ్ఖెద్ రాజా (నిల్కంఠేశ్వర్), షెక్గావ్ చిఖ్లి - ధాద్ రహదారి మార్గంలో ఉన్నాయి. దుల్గావ్రాజా- చిఖ్లి రహారిలో ఉన్న ధోత్రా (నందియా) గ్రామం వద్ద మూడు శివాలయాలు ఉన్నాయి. మొతలా సమీపంలో కొతలి (జైపూర్) వద్ద రెండు శివాలయాలు ఉన్నాయి. వార్వండ్ వద్ద హేమత్పంతి (శివాలయం) ఉంది.
జిల్లాలో 5 పోలీస్ సబ్డివిషన్లు, 29 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. [14]
జిల్లాకేంద్రం బుల్ఢానా వద్ద ఒక డెఫ్యూటీ రీజనల్ ట్రాంస్పోర్ట్ ఆఫీస్ ఉంది. ఇది మోటర్ వాహనాల చట్టం అమలు, మోటర్ వాహనాల రిజిస్ట్రేషన్, నంబర్ వంటి బాధ్యతలను నిర్వహిస్తుంది. జిల్లా కోడ్ - ఎం.హెచ్ 28.
జిల్లాలో ఎలెక్ట్రికల్ జనరేటింగ్ స్టేషను లేనప్పటికీ చక్కని ఎలెక్ట్రిసిటీ ట్రాంస్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. బుల్దానా, చిక్లి వద్ద రెండు 22O కి.వా సబ్‌స్టేషను ఉన్నాయి. జిల్లాలో అదనంగా అకోలా - చిక్లి 220 కి.వా లైన్, బుల్దానా, దుసర్బిద్, ఖంగఒన్, మల్కపుర్, మెహ్కర్, మొతల, వర్వత్ బకల్ల వద్ద 132 కి.వా సబ్‌స్టేషను ఉన్నాయి. చిక్లి-దుసర్బిద్, బుల్దానా టాప్, ఖంగఒన్-మల్కపుర్, ఖంగవొన్-జలంబ్ రిలే, ఖంగవొన్ టాప్, చిక్లి-మెహ్కర్, మెఖర్-మాలేగావ్ (వాషిం), వర్వత్ బకల్ పంపుల వద్ద 132 కి.వా లైన్ పయనిస్తుంది. 685 కి.మీ పొడవైన 400 కి.వా కొరాడి - భుసవల్ ట్రాంస్మిషన్ లైన్ వర్వత్ బక వద్ద జిల్లాను దాటుతూ పోతుంది. [15] డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో అమరావతి జోన్, బుల్ఢానా సర్కిల్ బుల్ఢానా, ఖాంగావ్, మల్కాపూర్ డివిషన్లు భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఒక్కొక సబ్డివిషన్ ఆధ్వర్యంలో 33కె.వి డిస్ట్రిబ్యూషన్ సబ్డివిషన్ పనిచేస్తూ ఉంది. ఒక్కొక సబ్‌డివిషన్‌లో 2 తాలూకాలు ఉన్నాయి. [16]
జిల్లా అంకోలా, వాశిమ్ జిల్లాలతో బుల్ఢానా నీటిపారుదల ప్రాజెక్ట్ సర్కిల్లో ఉంది. ఈ సర్కిల్లోనే విదర్భా ఇరిగేషన్ డెవెలెప్మెంటు కార్పొరేషన్ (నాగపూర్) పనిచేస్తూ ఉంది. ఈ ప్రాజెక్ట్ డివిషన్లు కదక్పూర్నా (డియోల్గావ్ రాజా) వద్ద ఉన్న షెగావ్, ఖాంగావ్ వద్ద మున్ ప్రాజెక్టు, చిక్లి, అకోలా వద్ద మైనర్ ఇరిగేషన్ డివిషన్ ఉన్నాయి. [17] మొతలా వద్ద నల్గంగా ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణపు పని పూర్తి అయింది. వాన్లో ప్రధాన ప్రాజెక్టు ప్రయోజనాలు అకోలా జిల్లాకు చేరుతున్నాయి. జిల్లాలో అదనంగా పలు ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మాణదశలో, ప్లానింగ్ దశలో ఉన్నాయి.[18]
జిల్లా అంరావతి పబ్లిక్ వర్క్ రీజియన్, అకోలా పబ్లిక్ వర్క్స్ సర్కిల్ విభాగంలో ఉంది. దీనికి బుల్ఢానాలో ఉన్న మొదటి పబ్లిక్ వర్క్ డివిషన్ బుల్ఢానా, చిక్లి, మెకర్, డియోల్గవ్ రాజా ల వద్ద సబ్డివిషన్లు ఉంది. రెండవ పబ్లిక్ వర్క్ డివిషన్‌కు ఖంగవొన్, జలగావ్ జమొద్, మల్కపుర్ వద్ద ఉపవిభాగాలు ఖంగవొన్ డివిజన్, బుల్దానా జిల్లా మెకానికల్ వద్ద సబ్డివిజన్లు ఉన్నాయి.
బుల్డానా వద్ద అంకోలా రోడ్ ప్రాజెక్ట్ డివిషన్‌కు చెందిన రోడ్ ప్రాజెక్ట్ సబ్డివిషన్ ఉంది. బుల్డానా వద్ద జిల్లాలో ప్రత్యేకంగా జిల్లా పరిషద్ వర్క్స్ డివిషన్ ఉంది.దీనికి బుల్దానా, కహంగఒన్, మెహ్కర్, మల్కపుర్ వద్ద సబ్డివిషన్లు ఉన్నాయి.[19] డిపార్ట్మెంటుకు బుల్ఢానా, ఖామ్గావ్, షెగావ్, మల్కాపూర్, మొతల, జల్గావ్, జమొద్, సంగ్రాంపూర్, చిక్లి, అందాపూర్, లవ్‌హల (మెకర్), డాంగావ్, డియోల్గావ్ రాజా, డియోల్గావ్ మహి, సింద్ఖెడ్ రాజా, లోనార్, నందురా వద్ద రెస్ట్ హౌసులు ఉన్నాయి.[20]
విద్యుదీకరణ చేయబడిన బ్రాడ్ - గేజ్ రైల్వే మార్గం మలక్‌పూర్, నందురా, షెగావ్ తాలూకాల మీదుగా పయనిస్తుంది. ఇది సెంట్రల్ రైల్వేకు చెందిన భుసవల్ డివిషన్ లోని భుసవల్ - బదనెరా సెక్షన్లో ఉంది. ప్రధాన రైలు మార్గం గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వేలో ఉంది. జలాబ్ - ఖామ్గావ్ బ్రాంచ్ లైన్ ఖామ్గావ్ స్టేట్ రైల్వేకు చెందినది.
జాతీయ రహదారి -6 :- జిల్లాలోని ఖామ్గావ్, నందురా, మలక్‌పూర్ పట్టణాల మీదుగా పయనిస్తుంది.
జిల్లాలోని రాష్ట్రీయ రహదార్లు జిల్లాలోని పలు తాకూకాలను, పట్టాణాలను అనుసంధానిస్తున్నాయి.
జిల్లాలోని కొన్ని ముఖ్యమైన రహదారులు:
సమీపంలోని విమానాశ్రయం " ఔరంగాబాద్ (మహారాష్ట్ర) "లో ఉంది. ఇది జిల్లా కేంద్రం బుల్ఢానా నుండి 150కి.మీ దూరంలో ఉంది.
జిల్లాలో పలు పాఠశాలలు ప్రాథమిక, మాధ్యమిక విద్యను అందిస్తున్నాయి. పాఠశాలలు మహారాష్ట్ర రాష్ట్ర ఎస్.ఎస్.సి విద్యావిధానం అనుసరిస్తున్నాయి. జిల్లాలోని కాళాశాలలన్నీ అమరావతి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.