వికీసోర్స్ స్వేచ్ఛా నకలు హక్కుల రచనలను ప్రచురించుటకు సముదాయసభ్యులు సేకరించి, నిర్వహించుచున్న ఒక స్వేచ్ఛాయుత గ్రంథాలయము.[1] ఇది 2005 ఆగస్టు 19 న ప్రారంభమైంది. ప్రారంభంలో విశేషంగా కృషిచేసిన వాడుకరులు అన్వేషి, రాజ్ (Raaj 3), రాజశేఖర్ (Rajasekhar1961), మల్లిన నరసింహారావు, తాడేపల్లి (Tadepally), వైఙాసత్య, రాకేశ్వర, సురేష్ (Sureshkvolam), సుజాత. అన్వేషి 2007 ఏప్రిల్ నుండి డిసెంబరు మధ్య శతకాలు, భగవద్గీత, వాల్మీకి రామాయణం మొదలగునవి వికీసోర్స్ లో చేర్చాడు. తరువాత వికీసోర్స్ కి కావలసిన మూసలు తెలుగుసేత, డాక్యుమెంటేషన్ పేజీలు తయారుచేయడం, రచనలు చేర్చడం మొదలగు మెరుగులుచేశాడు. ఫ్రూఫ్ రీడ్ ఎక్స్టెన్షన్[2] వాడుటకు చేసిన ప్రయత్నం మధ్యలో ఆగిపోయింది. 2012 లో అది పూర్తి కావించబడింది. వైఙాసత్య దీనిలో తెలుగు నేరుగా టైపు చేసేసౌకర్యం కలిగించాడు, మొల్ల రామాయణం చేర్చటానికి కృషి చేసాడు.

Thumb
(PFS100) దింపుకొనదగిన పుస్తకాల ప్రదర్శన తెరపట్టు (పై బొమ్మపై నొక్కి పూర్తి జాబితా చూడండి)

Thumb
తెలుగు వికీసోర్స్ మొదటి పేజీ (2013 ఏప్రిల్ 1)

కంప్యూటర్ తో తయారైన పుస్తకాలను పాఠ్యీకరించడంలో 2018లో విడుదలైన మెరుగైన గూగుల్ ఒసిఆర్ సాయపడుతుంది. మార్చి 2019 నాటికి 34 దింపుకొనదగిన పుస్తకాలతో మొత్తంగా 371 పుస్తకాలున్నాయి.

గణాంకాలు

వనరులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.