బిగ్‌బాస్ (సినిమా)

విజయబాపినీడు దర్శకత్వంలో 1995లో విడుదలైన తెలుగు చలనచిత్రం. From Wikipedia, the free encyclopedia

బిగ్‌బాస్ (సినిమా)

బిగ్‌బాస్ 1995, జూన్ 15న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] శ్యాంప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాణ సారథ్యంలో విజయబాపినీడు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, రోజా, కోట శ్రీనివాసరావు, విజయ్ చందర్, మాధవి ప్రధాన పాత్రల్లో నటించగా, బప్పీలహరి సంగీతం అందించాడు.[2]

త్వరిత వాస్తవాలు బిగ్‌బాస్, దర్శకత్వం ...
బిగ్‌బాస్
Thumb
బిగ్‌బాస్ సినిమా పోస్టర్
దర్శకత్వంవిజయబాపినీడు
నిర్మాతమాగంటి రవీంద్రనాథ్ చౌదరి
తారాగణంచిరంజీవి,
రోజా
కోట శ్రీనివాసరావు
విజయ్ చందర్
మాధవి
సంగీతంబప్పీలహరి
నిర్మాణ
సంస్థ
శ్యాంప్రసాద్ ఆర్ట్స్
పంపిణీదార్లుగీతా ఆర్ట్స్
విడుదల తేదీ
జూన్ 15, 1995
సినిమా నిడివి
153 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
మూసివేయి

కథ

సురేంద్ర (చిరంజీవి) అనే యువకుడు ఉద్యోగం కోసం ఒక పట్టణంలో దిగడంతో సినిమా మొదలవుతుంది. ఆ ప్రాంతంలో ఇద్దరు మాఫియా ముఠాల మధ్య శత్రుత్వాన్ని సురేంద్ర చూస్తాడు. వీధి గూండాతో పోరాడిన తరువాత, అతన్ని ఒక ముఠా సంప్రదించి, డాన్ కావాలని ప్రోత్సహిస్తుంది. సురేంద్ర మాధవి ఇంట్లో ఒక గదిని అద్దెకు తీసుకుంటాడు, ఆమె సోదరి రోజా, గ్రానీ (నిర్మలమ్మ) తో కలిసి నివసిస్తుంది. రోజా, సురేంద్రతో ప్రేమలోపడి తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. కానీ సురేంద్ర తన భవిష్యత్తు గురించి ఆలోచించి రోజా ప్రతిపాదనను తిరస్కరించి, ఆమె కోసం పెళ్ళి సంబంధాలు వెతకడం ప్రారంభిస్తాడు. ఇంతలో, సురేంద్ర తల్లి (సుజాత), తమ్ముడు, సోదరి కూడా పట్టణానికి వస్తారు. అప్పుడు ప్రత్యర్థి ముఠా నాయకుడైన కోట శ్రీనివాసరావు తన కుటుంబాన్ని నాశనం చేసిన విషయం సురేంద్రకు తల్లి చెబుతుంది. సురేంద్ర కుటుంబాన్ని కోట శ్రీనివాసరావు కిడ్నాప్ చేయగా, సురేంద్ర వారిని ఎలా రక్షించాడన్నది ఈ సినిమా క్లైమాక్స్.

నటవర్గం

సాంకేతికవర్గం

పాటలు

ఈ చిత్రానికి బప్పీలహరి సంగీతం అందించగా, భువనచంద్ర పాటు రాశాడు.[3][4][5]

  1. మావ మావ: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
  2. కూతకొస్తుందండీ: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రేణుక చౌహాన్
  3. ఉరుమొచ్చేసిందోయ్: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
  4. నీలాటి రేవులోనా:: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
  5. నంబరు 1 నంబరు 2 బిగ్ బాస్: మనో
  6. సూదికి దూరం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర

మూలాలు

ఇతర లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.