Remove ads
బీహార్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
బీహారు రాష్ట్రం లోని జిల్లాల్లో బంకా జిల్లా ఒకటి.
బంకా జిల్లా
बाँका जिला,ضلع بانکا | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | భాగల్పూర్ |
ముఖ్య పట్టణం | బంకా |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | బంకా |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,019 కి.మీ2 (1,166 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 20,29,339 |
• జనసాంద్రత | 670/కి.మీ2 (1,700/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 60.12 % |
• లింగ నిష్పత్తి | 907 |
సగటు వార్షిక వర్షపాతం | 1200 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
బంకా స్వాతంత్ర్య సమరయోధుడు సతీష్ ప్రసాద్ ఝా స్వస్థలం. ఆయన 1942 ఆగస్టు 11 తేదీన సెక్రెరటియరట్ భవనంలో ఝంఢాను ఎగురవేసాడు. ఆయన ధకమోద్ సమీపంలోని సోషలిస్ట్ పార్టీకి బంకా ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఉండేది. మధులిమాయే ఇక్కడి నుండు రెండుమార్లు ఎన్నిక అయ్యాడు. జార్జ్‌ఫెర్నాండెజ్, రాజనారాయణ్ కూడా పార్లమెంటరీకి ప్రాతినిధ్యం చేసారు. ఈ జిల్లాలో ప్రముఖ రాజకీయనాయకులు అనేక మంది ఉన్నారు. భారత జాతీయ కాంగ్రెస్: విన్ధ్యాచల్ దేవి, శాసన సభ్యులు (1957-1967), శకుంతల దేవి మాజీ ఎంపీ, మాజీ [బీహార్ [ముఖ్యమంత్రి | బీహార్ ముఖ్యమంత్రి, చంద్రశేఖర్ సింగ్, చతుర్భుజ్ సింగ్ ఎక్స్. శాసన సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యుడు కామాఖ్య ప్రసాద్ సింగ్, మాజీ ఎంపి మనోరమ సింగ్,, మాజీ శాసన సభ్యులు జై ప్రకాష్ మిశ్రా. దిగ్విజయ్ సింగ్ (1955 నవంబరు 14 - 2010 జూన్ 24) స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంటు ప్రాతినిధ్యం వహించాడు. స్వాతంత్ర్య సమరంలో బంకా ప్రముఖ పాత్ర వహించింది. ప్రస్తుతం జయప్రకాష్యాదవ్ కూడా బంకా పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికయ్యడు.
దిగ్విజయ సింగ్ పార్లమెంటు సభ్యుడుగా 5 మార్లు ఎన్నికయ్యాడు. 3 మార్లు లోక్‌సభకు (1998, 1999, 2009) 2 మార్లు రాజ్యసభకు (1990, 2004) ఎన్నికయ్యడు. ఆయన అటల్‌బిహారీ వాజ్పయ్ నాయకత్వంలో యూనియన్ మంత్రిగా (1999–2004) పనిచేసాడు. చంద్రశేఖర్ ప్రభుత్వంలో (1990–1991) లో పనిచేసాడు. " నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా " 1999 నుండి అధ్యక్షుడుగా ఉన్నాడు. ఆయన మంచి క్రీడల నిర్వాహకుడు. సమత పార్టీ సంస్థాపకులు (జార్జ్‌ఫెర్నాండెజ్, దిగ్విజయ్ సింగ్, నితీష్‌కుమార్) లలో ఆయన ఒకడు.
జిల్లా భాగల్పూర్ డివిజన్లో భాగం. బంకా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 3020చ.కి.మీ., [1] ఇది కెనడాలోని అకిమిస్కి ద్వీపం వైశాల్యానికి సమానం.[2]
బంకా క్రమంగా హిదూ, జైన మతయాత్రా కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. పురాణాలలో వర్ణించబడిన మంధరపర్వతం (మంద్రాచల పర్వతం) ఉంది. విష్ణాలయానికి సమీపంలో జైన ఆలయం ఉంది. జనవరి మాసంలో ప్రతొసంవత్సరం బౌంసి ఉత్సవం నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవం మందర్ ప్రాతపు గ్రామీణ సంస్కృతిని పరిచయం చేస్తుంది. పూరీ జగన్నాధునికి రథయాత్ర నిర్వహించబడుతున్న అదే రోజు ప్రతిసంవత్సరం మధుసూదనునికి రథయాత్ర నిర్వహించబడుతుంది. 14వ శతాబ్ధానికి చెందిన వైష్ణవ సంప్రదాయానికి చెందిన చైతన్యమహాప్రభు మందరకు వచ్చినప్పుడు ఈ రథయాత్రను ప్రారంభించారు.
బంకాజిల్లా ఆర్థికంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. జిల్లా వరి, గోధుమ, మొక్కజొన్న, మెంతులు పండినబడుతున్నాయి. బంకా జిల్లాలో అమర్పూర్ జసాంధ్రత అధికంగా కలిగిన మండలంగా గుర్తించబడుతుంది. అమర్పూర్లో చక్కెర అధికంగా ఉత్పత్తి చేయబడుతుంది.
బీహార్ గ్రామీణ చిన్నతరహా పరుశ్రమలకు బ్రాండింగ్ సమస్య ఉంది. ప్రాంతీయంగా ఉత్పత్తి చేయబడుతున్న ఉత్పత్తులు నాణ్యమైనవి. తక్కువ ఆదాయంతో అధిక మొత్తంలో ఉతపత్తి చేయబడుతున్నాయి. బంకా జిల్లాలో బృహత్తర పరిశ్రమలకు అవసరమైన వనరులు ఉన్నాయి. ఇది జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన దేవ్‌ఘర్, దుంకా, గొడ్డా జిల్లాలకు సమీపంలో ఉంది. చందన్ నది బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి పరిశ్రమలకు, ఇతర బృహత్తర పరిశ్రమలకు అనుకూలంగా ఉంది.
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బంకా జిల్లా ఒకటి అని గుర్తించింది.[3] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి. .[3]
విషయాలు | వివరణలు |
---|---|
ఉపవిభాగాలు | 1 బంకా |
మండలాలు | 11 బంకా, అమర్పుర్, షంభుగంజ్, బెళర్, ఫుల్లిదుమర్, కతొరీ, చందన్, బౌన్సి, బరహత్, ధొరైయ, రజౌన్ |
నక్సలైట్ బాధిత ప్రాంతాలు | 9 మండలాలు |
బంకా రైల్వే స్టేషను భాగల్పూర్- బౌంసి రైలు మార్గంలో ఉంది. ఈమార్గం సుల్తాన్పూర్ - జైసిధ్ లను బంకాద్వారా అనుసంధానం చేస్తుంది. బంకా రైల్వే స్టేషను జగత్పూర్ గ్రామంలో ఉంది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,029,339, [4] |
2001 జనసంఖ్య | 1,608,773 |
హిందువులు | 1,409,352 |
ముస్లిములు | 190,051 (11.81%). |
ఇది దాదాపు. | దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | న్యూ మెక్సికో నగర జనసంఖ్యకు సమం.[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 228 వ స్థానంలో ఉంది.[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | 672 [4] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 26.14%.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 907:1000 [4] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 60.12%.[4] |
జాతియ సరాసరి (72%) కంటే. |
జిల్లాలో ఇండోఆర్యన్ భాషాకుటుంబానికి చెందిన ఆంగిక భాష వాడుకలో ఉంది. దీనిని వ్రాయడానికి దేవనాగరి లిపిని ఉపయోగిస్తారు. ఈ భాషను 725 000 మంది మాట్లాడుతున్నారు. [7]
బంకా జిల్లాలో ప్రవహిస్తున్న ప్రధాన నది చన్నన్.
కర్హరియాలో, కుష్మహ, కర్హరియా, కునౌని, లక్ష్మీపూర్ ధాం, బంకా, బభంగమ దుర్గాదేవి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలకు దేశం అంతటి నుండి భక్తులు వస్తుంటారు. జిల్లాలో నరసింహాలయం, దిగంబరజైన్ తీర్ధంకర్ ఆలయం (మందరపర్వతశిఖరం మీద సముద్రమట్టానికి 500 మీ ఎత్తున) ఉన్నాయి. ఏకశిలాలయం అయిన నరసింహాలయ నిర్వహణ ట్రస్టు మూలంగా జరుగుతుంది. జిల్లాలో పురాతనమైన అవంతిక నాథ్ ఆలయం ఉంది. ఇది మందరపర్వతం మధ్యభాగంలో ఉంది. అవంతికనాథ్ ఆలయ ట్రస్ట్ సబల్‌పూర్ గ్రామానికి చెందిన బాబు బిరో సింగ్ చేత స్థాపించబడింది. చనన్ నదీతీరంలో ఉన్న జెథోర్లో పురతానమైన శివాలయం ఉంది. జెథోర్ అంటే జ్యేష్ఠ అని అర్ధం. కమలాపూర్ గ్రామంలో ప్రఖ్యాతి చెందిన కాళిమందిరం ఉంది. పాఫర్ని కోనేరు వద్ద మహాలక్ష్మీ ఆలయం ఉంది. ప్రాంతీయ ప్రజల నిధిసేకరణతో కోనేరు మధ్యన లక్ష్మీనృసింహ ఆలయం ఉంది. దీనిని గత సమల్పూర్ రాజాస్థానానికి చెందిన ఫతేహ్ బహదూర్ ట్రస్ట్ నిర్వహిస్తుంది. జిల్లా గిరిజన సంప్రదాయానికి, చేనేతకు ప్రసిద్ధి చెందింది. కుటీరపరిశ్రమగా సాగుతున్న ఖాది, పట్టు ఈ ప్రాంతంలో ప్రజాదరణ కలిగి ఉంది. పట్టు అధికంగా కటోరియాలో ఉత్పత్తి చేయబడుతుంది. భాగల్పూర్ పట్టు పరిశ్రమకు అవసరమైన పట్టు కటోరియా నుండి లభిస్తుంది.
జిల్లాలో కొంత అరణ్య భూభాగం ఉంది. బంకా, బౌంసి, కటోరియా అరణ్యప్రాంతం. బంకా అరణ్యంలోని చెట్లు కొండ వాలు ప్రాంతంలో ఉంటాయి. మిగిలిన రెండు ప్రాంతాలు ఎగుడుదిగుడు భూభాగంలో ఉంటాయి. అరణ్యప్రాంతంలో సాల వృక్షాలు అధికంగా కనిపిస్తుంటాయి. అసన్, కెందు, మహుయా చెట్లు విస్తారంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో బహెరా, కదం, అమల్తాస్ చెట్లు కూడా ఉంటాయి. కసికంద చెట్లు, అకేసియా బాబుల్, శిరీష్,, సైన్ చెట్లు ఉంటాయి. మామిడి,, జామ చెట్లు అధికంగా ఉంటాయి. ఖర్జూరం, ప్లంస్, జమూన్ చెట్లు కూడా ఉంటయి.
బంకా జిల్లా అరణ్యాలలో సాధారణంగా కోతులు అధికంగా ఉంటాయి. జాకల్, జింకలు, ఎలుగుబంటు, ఏనుగులు, చిరుతపులులు కూడా కొన్ని సమయాలలో కనిపిస్త్ంటాయి. బరిసింగ, సాంబార్ జింకలు కూడా కనిపిస్తుంటాయి. అడవి బాతులు, బాతు, లీల్, క్వైల్ వంటి పకులు కూడా ఉంటాయి. నెమలి, చిలుకలు, హాక్స్, పావురాళ్ళు వంటి ఇతర పక్షులు కూడా కటోరియా, చందన్ అరణ్యాలలో కనిపిస్తుంటాయి. ఉడుతలు, మరొయు రాబందులు, కూడా సాధారణంగా కనిపిస్తుంటాయి.
రొకు, కటియా, తెంగ్ర, బెచ్వ, ఝింగ, పొతి వంటి జాతులు కూడా ఉన్నాయి.
బంకాలో 1945లో గుజరాత్ విద్యాపీఠ్, మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠం, బీహార్ విద్యాపీఠం స్ఫూర్తితో స్వతంత్ర పోరాటయోధులు మందర్ విద్యాపీఠం (జాతీయ విశ్వవిద్యాలయం) స్థాపించారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.