ప్రస్తుత భారత ఉప ముఖ్యమంత్రుల జాబితా
భారత రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు From Wikipedia, the free encyclopedia
ఉపముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ సభ్యుడు. సాధారణంగా వారి రాష్ట్ర మంత్రి మండలిలో రెండవ అత్యున్నత స్థాయి కార్యనిర్వాహక అధికారి. ప్రత్వేక రాజ్యాంగ కార్యాలయం కానప్పటికీ, ఇది చాలా అరుదుగా నిర్దిష్ట అధికారాలను కలిగి ఉంటుంది.[1] ఉప ముఖ్యమంత్రి సాధారణంగా హోం మంత్రి లేదా ఆర్థిక మంత్రి వంటి క్యాబినెట్ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంటారు. పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థలో, ముఖ్యమంత్రిని మంత్రివర్గంలో "సమానులలో మొదటి వ్యక్తి"గా పరిగణిస్తారు. సంకీర్ణ ప్రభుత్వంలో రాజకీయ స్థిరత్వం, బలాన్నిపొందటానికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఉపయోగిస్తారు.
ఉపముఖ్యమంత్రి | |
---|---|
విధం |
|
రకం | రాష్ట్ర ప్రభుత్వ ఉప అధిపతి |
సంక్షిప్త పదం | డిప్యూటీ సి.ఎం |
సభ్యుడు |
|
నామినేట్ చేసేవారు | భారతదేశంలోని సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నరు |
ప్రస్తుతం, 15 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతం (25 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో) మాత్రమే ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. వీటిలో బీహార్, ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, నాగాలాండ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్‌లకు ఇద్దరు చొప్పున ఉపముఖ్యమంత్రులు ఉన్నారు. మరే ఇతర రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఒకటి కంటే ఎక్కువ మంది ఉప ముఖ్యమంత్రులు పదవిలో లేరు.
భారతీయ జనతా పార్టీకి పదిహేను మంది, భారత జాతీయ కాంగ్రెస్‌కు ముగ్గురు, నేషనల్ పీపుల్స్ పార్టీకి ఇద్దరు, జనసేన పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, ద్రవిడ మున్నేట్ర కజగం, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. మొత్తం 25 మందిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఒడిశాలోని ప్రవతి పరిదా, రాజస్థాన్‌లోని దియా కుమారి. 2016 జులై 17 నుండి (8 సంవత్సరాలు, 127 రోజులు) అరుణాచల్ ప్రదేశ్‌కు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన చౌనా మెయిన్, ఎక్కువ కాలం పనిచేసిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రులు. 2024 నవంబరు 21 నాటికి, మూడు రాష్ట్రాలు (అసోం, సిక్కిం, ఉత్తరాఖండ్) ఒక కేంద్రపాలిత ప్రాంతం (పుదుచ్చేరి)కి ఎప్పుడూ ఉప ముఖ్యమంత్రి పదవిలో ఎవరూ లేరు.

ప్రస్తుత ఉప ముఖ్యమంత్రులు జాబితా
ప్రస్తుత ఉప ముఖ్యమంత్రులు జాబితా
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.