Remove ads
ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి, లోక్‌సభ సభ్యుడు From Wikipedia, the free encyclopedia
అరుణ్ సావో (జననం: 1968 నవంబరు 25) ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్ లోని బిలాస్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభకు,[3] ఆ తరువాత 2023లో శాసనసభ ఎన్నికల్లో లోర్మి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, 2023 డిసెంబరు 13న ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[4]
Arun Sao | |
---|---|
2nd Deputy Chief Minister of Chhattisgarh | |
Incumbent | |
Assumed office 13 December 2023 Serving with Vijay Sharma | |
గవర్నర్ | B. Harichandan Ramen Deka |
Chief Minister | Vishnudeo Sai |
అంతకు ముందు వారు | T. S. Singh Deo |
Minister of Public Works Department Government of Chhattisgarh | |
Incumbent | |
Assumed office 22 December 2023 | |
Chief Minister | Vishnu Deo Sai |
అంతకు ముందు వారు | Tamradhwaj Sahu |
Minister of Public Health Engineering Government of Chhattisgarh | |
Incumbent | |
Assumed office 22 December 2023 | |
Chief Minister | Vishnu Deo Sai |
అంతకు ముందు వారు | Guru Rudra Kumar |
Minister of Law & Legislative Affairs Government of Chhattisgarh | |
Incumbent | |
Assumed office 22 December 2023 | |
Chief Minister | Vishnu Deo Sai |
అంతకు ముందు వారు | Ravindra Choubey |
Minister of Urban Administration Government of Chhattisgarh | |
Incumbent | |
Assumed office 22 December 2023 | |
Chief Minister | Vishnu Deo Sai |
అంతకు ముందు వారు | Shiv Kumar Dahariya |
Member of the Chhattisgarh Legislative Assembly | |
Incumbent | |
Assumed office 3 December 2023 | |
అంతకు ముందు వారు | Dharmjeet Singh Thakur |
నియోజకవర్గం | Lormi |
President of Bharatiya Janata Party, Chhattisgarh | |
In office 9 August 2022 – 6 December 2023 [1][2] | |
అంతకు ముందు వారు | Vishnudeo Sai |
తరువాత వారు | Kiran Singh Deo |
Member of Parliament, Lok Sabha | |
In office 23 May 2019 – 07 December 2023 | |
అంతకు ముందు వారు | Lakhan Lal Sahu |
తరువాత వారు | Tokhan Sahu |
నియోజకవర్గం | Bilaspur |
వ్యక్తిగత వివరాలు | |
జననం | Jarhagaon, Chhattisgarh, India | 1968 నవంబరు 25
జాతీయత | Indian |
రాజకీయ పార్టీ | Bharatiya Janata Party |
జీవిత భాగస్వామి | Meena Sao |
సంతానం | Amish sao |
కళాశాల | Guru Ghasidas Vishwavidyalaya (BCom), (LL.B) |
అరుణ్ సావో ముంగేలిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, బిలాస్‌పూర్‌లోని కేఆర్ లా కాలేజీలో న్యాయశాస్త్ర పట్టా అందుకున్నాడు. ఆయన 2001లో హైకోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టి, 2004లో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి, 2005 నుండి 2013 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్యానెల్ లాయర్‌గా, 2013 నుండి 2018 వరకు ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు డిప్యూటీ అడ్వకేట్ జనరల్‌గా పనిచేశాడు.
అరుణ్ సావో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కి వాలంటీర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 1990 నుండి 1995 వరకు ABVP ముంగేలి యూనిట్‌కు అధ్యక్షుడిగా, బూత్ స్థాయి కార్యకర్తగా, బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర సహ కార్యదర్శిగా, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పనిచేశాడు. అరుణ్ సావో 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిలాస్‌పూర్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అటల్ శ్రీవాస్తవ్ పై 141763 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన 2023లో జరిగిన ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో లోర్మి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై[5], 2023 డిసెంబరు 13న ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[6]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.