తెలంగాణ ఉప ముఖ్యమంత్రుల జాబితా From Wikipedia, the free encyclopedia
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వం అధిపతి అయిన తెలంగాణ ముఖ్యమంత్రికి డిప్యూటి ముఖ్యమంత్రి. తెలంగాణ మంత్రి మండలిలో ఉప ముఖ్యమంత్రి రెండో అత్యున్నత స్థాయి సభ్యుడిగా,[1] రాష్ట్ర మంత్రిత్వ శాఖలో క్యాబినెట్ పోర్ట్‌ఫోలియోను కూడా కలిగి ఉంటాడు. ఒకే పార్టీ సభ్యుని మద్దతుతో రాష్ట్రాన్ని పరిపాలించడానికి లేదా సంకీర్ణ ప్రభుత్వంలో రాజకీయ స్థిరత్వాన్ని, బలాన్ని తీసుకురావడానికి లేదా రాష్ట్ర అత్యవసర సమయాల్లో సరైన కమాండ్ అవసరమైనప్పుడు ఉపముఖ్యమంత్రి పదవి ఉపయోగించబడుతుంది.
(తెలంగాణ ప్రభుత్వం) తెలంగాణ ఉపముఖ్యమంత్రి
Telaṅgāṇa Upa Mukhyamantri | |
---|---|
Nominator | ముఖ్యమంత్రి |
నియామకం | గవర్నరు |
ప్రారంభ హోల్డర్ | ఎం. మొహమూద్ అలీ |
నిర్మాణం | 2 జూన్ 2014 |
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014, జూన్ 2న ఎం. మొహమూద్ అలీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. 2014–2018 మధ్యకాలంలో స్టాంప్స్, రిజిస్ట్రేషన్, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ శాఖలకు కూడా మంత్రిగా ఉన్నాడు.[2] రెండవ ఉపముఖ్యమంత్రిగా టి. రాజయ్య[3] బాధ్యతలు చేపట్టి, ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా కూడా పనిచేశాడు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో రాజయ్యను 2015, జనవరి 25న తొలగించగా, తరువాతి రాజయ్య స్థానంలో ఉపముఖ్యమంత్రిగా కడియం శ్రీహరి 2018 డిసెంబరు 12 వరకు మూడవ ఉప ముఖ్యమంత్రిగా పవిచేసాడు.[4] 2018, డిసెంబరు 13 నుండి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి 2023 డిసెంబరు 6 వరకు ఖాళీగా ఉంది.
2023లో తెలంగాణ శాససభకు జరిగిన ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరుపున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 2023 డిసెంబరు 7న నియమితుడయ్యాడు.మధిర నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలిచిన మల్లు భట్టి విక్రమార్క డిసెంబరు 7న రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుచున్నాడు.[5]
సంఖ్య | ఫోటో | పేరు | ఎన్నికైన నియోజకవర్గం | రాజకీయ పార్టీ | పదవీకాలం [6] | ముఖ్యమంత్రి | ద్వారా నియమించబడ్డారు | ||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | ఎం. మొహమూద్ అలీ (1952–) |
రాష్ట్ర శాసన మండలి సభ్యుడు | తెలంగాణ రాష్ట్ర సమితి | 2014 జూన్ 2 | 2018 డిసెంబరు 12 | 4 సంవత్సరాలు, 193 రోజులు | కె. చంద్రశేఖర రావు | ఈ.ఎస్.ఎల్.నరసింహన్ | |||
2 | టి.రాజయ్య (1965–) |
ఘన్పూర్ (స్టేషన్) | తెలంగాణ రాష్ట్ర సమితి | 2014 జూన్ 2 | 2015 జనవరి 25 | 237 రోజులు | |||||
3 | కడియం శ్రీహరి (1952–) |
రాష్ట్ర శాసన మండలి సభ్యుడు | తెలంగాణ రాష్ట్ర సమితి | 2015 జనవరి 25 | 2018 డిసెంబరు 12 | 3 సంవత్సరాలు, 321 రోజులు | |||||
2018 డిసెంబరు 13 నుండి ఖాళీ | |||||||||||
4 | మల్లు భట్టి విక్రమార్క | మధిర | భారత జాతీయ కాంగ్రెస్ | 2023 డిసెంబరు 7 | పదవిలో ఉన్న వ్యక్తి | 297 రోజులు | ఎనుమల రేవంత్ రెడ్డి | తమిళిసై సౌందరరాజన్ |
పదవీకాలం వారీగా ఉప ముఖ్యమంత్రుల జాబితా
పేరు | పార్టీ | పదవీకాలం | ||
---|---|---|---|---|
పదవీకాలం | పదవీకాల మొత్తం సంవత్సరాలు | |||
1 | ఎం. మొహమూద్ అలీ | టీఆర్ఎస్ | 4 సంవత్సరాలు, 193 రోజులు | 4 సంవత్సరాలు, 193 రోజులు |
2 | టి. రాజయ్య | టీఆర్ఎస్ | 237 రోజులు | 237 రోజులు |
3 | కడియం శ్రీహరి | టీఆర్ఎస్ | 3 సంవత్సరాలు, 321 రోజులు | 3 సంవత్సరాలు, 321 రోజులు |
రాజకీయ పార్టీ | ఉప ముఖ్యమంత్రుల సంఖ్య | డిప్యూటీ సీఎంఓని కలిగి ఉన్న మొత్తం రోజులు | |
---|---|---|---|
1 | తెలంగాణ రాష్ట్ర సమితి | 3 | 1654 రోజులు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.