పెద్దింటి అశోక్ కుమార్
నవలా మరియు కథా రచయిత. From Wikipedia, the free encyclopedia
పెద్దింటి అశోక్ కుమార్ ( జననం: ఫిబ్రవరి 6, 1968 ) తెలంగాణా ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ తెలుగు నవల,నాటక, సినిమా , కథా రచయిత.
జీవిత విశేషాలు
పెద్దింటి అశోక్ కుమార్ 1968 , ఫిబ్రవరి 6 న రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండలం, భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో జన్మించాడు. మల్లవ్వ, అంజయ్య ఇతని తల్లిదండ్రులు. ఇతడు ఇంటర్మీడియట్ గంభీరావుపేటలోను, బి.యస్సీ సిద్ధిపేటలోను ఎం.ఏ తెలుగు కాకతీయ విశ్వవిద్యాలయంలోను ఎం.ఎస్సీ గణితం నాగార్జున విశ్వవిద్యాల్యం లో చదివాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం, కిష్టంపేట గ్రామంలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కథ, నవలా రచయితగానే కాకుండా సినిమాలకు కథలు, మాటలు, పాటలు రాస్తూ సినిమా నటుడిగా, రచయితగా రాణిస్తున్నారు.
రచనలు
ఇతడు 1999లో రచనా వ్యాసంగం మొదలు పెట్టాడు. మొట్టమొదటి కథ "ఆశ- నిరాశ -ఆశ ". ఇంతవరకు 250కు పైగా కథలు, 7 నవలలు, 10 కథా సంపుటాలు ప్రకటించాడు. ఇతని నవల జిగిరి హింది,ఇంగ్లీష్,మరాటీ,ఒరియా,పంజాబీ,కన్నడ,మైథిలి,బెంగాలి, తమిల్ మొదలగు తొమ్మిది భారతీయ భాషలలోనికి అనువదించబడింది. దాగుడుమూత దండాకోర్ సినిమాకు మాటలు, మల్లేశం సినిమాకు పాటలు, మాటలు వ్రాశాడు. దొరసాని, వేదం మరికొన్ని సినిమాలకి రచనా సహకారం చేసారు.ఎనిమిది చిన్నసినిమాలకు కథలు మాటలు అందించారు.5 నాటికలు వంద వరకు వ్యాసాలు రాసారు.ఇతని తెగారం నాటకం నటనా విభాగంలో నంది బహుమతి తో పాటు పాతిక అవార్డులను గెలుచుకుంది.
- జిగిరి
- ఎడారి మంటలు
- దాడి
- ఊరికి ఉప్పులం
- సంచారి
- లాంగ్ మార్చ్
- ఇంకెంత దూరం
కథాసంపుటాలు
- ఊటబాయి
- భూమడు
- మాఊరి బాగోతం
- మాయి ముంత
- వలస బతుకులు
- పోరుగడ్డ (కథలు, వ్యాసాలు)
- జుమ్మేకి రాత్ మే
- గుండెలో వాన
- పెద్దింటి అశోక్ కుమార్ కథలు
- విత్తనం
నాటకాలు
1. ఎండమావి. (2005) ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం.
2.పోరుగడ్డ. (2016) రవీంద్ర భారతిలో ప్రదర్శన. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో SHEKSPIAR నాటకానికి adaption.
3.తెగారం. (2018) నటనలో నందితో పాటు పాతిక అవార్డులు పొందిన నాటకం.
4. నెనరు (2019) ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం
5.మినిష్టరత్తాండు. (2022) ఆకెళ్ల వారి నాటక పోటీల్లో బహుమతి పొందింది. అజోవిపో కథానాటిక పోటీల్లో ప్రదర్శన.
అనువాదాలు
25 కథలు హిందీలోకి అనువాదం అయ్యాయి. శాంతాసుందరి గారు చేసారు. 2013లో ఏ ఆక్రమన్ కబ్ కా వోచుకా పేరుతో 11 కథలతో హిందీలో సంకలనం వచ్చింది.
11 కథలు మరాఠీ లోకి అనువాదమయ్యాయి. సాయినాథ్ పచారే గారు అనువాదం చేసారు. 2013లో ఓ గర్ బంద్ డాలియా పేరుతో మరాఠీలో సంకలనం వచ్చింది.
12 కథలు కన్నడలోకి అనువాదం అయ్యాయి. MG శుభమంగల గారు అనువదించారు. 2022లో జాల పేరుతో కన్నడలో సంకలనం వచ్చింది.
12 కథలు ఆంగ్లంలోకి అనువాదమయ్యాయి. ఆంగ్లంలో కథల సంపుటి రాబోతుంది.
కొన్ని కథలు
- అతడు ఆకలిని జయిస్తున్నాడు
- అనగనగా ఒక పేద బడి కథ
- ఆ ఇల్లు మూత వడ్డది
- ఆకుపచ్చ నవ్వు
- ఆశ నిరాశ ఆశ
- ఇగ వీడు తొవ్వకు రాడు
- ఇసం మింగిన మనిషి
- ఊటబాయి
- ఎండమావి
- ఎజెండా
- ఎడారి
- ఎదురు చేప
- ఏడిండ్ల పిల్లికూన
- కంగ్రాట్స్
- కథ మల్లా మొదటకొచ్చింది
- కన్నతల్లి
- కన్నీళ్ళు
- కాగుబొత్త
- కీలుబొమ్మలు
- కొత్త జీతగాడు
- గద్దలు
- గురిజ గింజలు
- గూడు చెదిరిన పక్షి
- గ్లాసియర్
- చెత్తలచెడుగు
- జిద్దు
- తడిగొంతు
- తెగిన బంధాలు
- నువ్వూ నేనూ ఆ వెన్నెలరాత్రి
- నెనరు
- పడగ నీడ
- పిల్లజలగ
- పీడ
- పెద్దోడు
- బందీలు
- భూముడు
- మాయిముంత
- ములాఖత్
- మూడు నా (ము)ళ్ళ బంధం
- యుద్ధనాదం
- రక్తం మరకలున్న వందనోట్లు
- రణనినాదం
- రెండు దుకాణాలు
- రెండుకోతులు
- రేపు మాపు అను ఒక విడాకుల కథ
- రైతక్క
- వర్గమూలాలు
- వలయం
- వెలి
- సావుడప్పు
- సివంగి
సినిమారంగం
- 2010: వేదం (రచనా సహకారం )
- 2015: దాగుడుమూత దండాకోర్ (మాటలు )
- 2018: మల్లేశం (మాటలు - పాట)
- 2019: దొరసాని (రచనా సహకారం )
- 2021:తమసోమా జ్యోతిర్గమయా (పాటలు)
- 2022 ; సాచి (మాటలు )
- 2023 : 8 AM Metro (Hindi movie ) రచనా సహకారం
- 2024 : షరతులు వర్తిస్తాయి (2024) (నటుడు.మాటలు. పెండ్లి పాట )
పురస్కారాలు
- తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2015 అవార్డు - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2015 జూన్ 2
- మాయి ముంత కథలకు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2011
- భారతీయ భాషా పరిషత్ యువ పురస్కారం కలకత్తా 2008
- 2015లో తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2012 (జిగిరి పుస్తకానికి)[1]
- ఉత్తమ నాటక రచయిత - తెగారం నాటకం (పంతం పద్మనాభ కళా పరిషత్, కాకినాడ) అక్టోబరు 28, 2018.
మూలాలు
ఇతర లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.