Remove ads
తెలంగాణ, సిద్దిపేట జిల్లాలోని పట్టణం From Wikipedia, the free encyclopedia
సిద్దిపేట, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన పట్టణం. సిద్దిపేట జిల్లా పరిపాలన, రెవెన్యూ డివిజన్ కేంద్రం. ఈ పట్టణానికి పూర్వం సిద్దిక్ పేట అని పేరు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 అవార్డుకు జాతీయస్థాయిలో సిద్ధిపేట పట్టణం ఎంపికైంది. తడి, పొడి, హానికరమైన చెత్త సేకరణలో వాహనాల నిర్వహణ, వీటి ప్రక్రియ, పారిశుద్ధ్య కార్మికుల పనితీరు, సర్టిఫికేషన్ విధానం, ప్రజల భాగస్వామ్యం, చైతన్యం, స్వచ్ యాప్ ఉపయోగించడం వంటి కార్యక్రమాలను సంపూర్ణంగా అమలు చేయడంతో సిద్ధిపేటకు ఈ అవార్డు వచ్చింది. 2021 నవంబరు 20న ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, కమిషనర్ రమణాచారి ఈ అవార్డును అందుకున్నారు.[3]
?సిద్ధిపేట తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 18.38°N 78.83°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 36.03 కి.మీ² (14 చ.మై)[1] |
జిల్లా (లు) | సిద్దిపేట జిల్లా |
జనాభా • జనసాంద్రత |
1,13,358[1][2] (2011 నాటికి) • 3,146/కి.మీ² (8,148/చ.మై) |
పురపాలక సంఘం | సిద్ధిపేట పురపాలకసంఘం |
2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని సిద్దిపేట మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన సిద్ధిపేట పట్టణ మండలంలోకి చేర్చారు.[4]
2001 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,52,365 - పురుషులు 76,696 - స్త్రీలు 75,669
లోక్ సభ | వ్యవధి | M.P. పేరు | పార్టీ అనుబంధం |
---|---|---|---|
నాల్గవ | 1967–71 | జి. వెంకటస్వామి | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
ఐదవ | 1971–77 | జి. వెంకటస్వామి | తెలంగాణ ప్రజా సమితి |
ఆరవ | 1977–80 | నంది యెల్లయ్య | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
ఏడవ | 1980–84 | నంది యెల్లయ్య | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
ఎనిమిదవ | 1984–89 | జి. విజయ రామారావు | తెలుగు దేశం పార్టీ |
తొమ్మిదవ | 1989–91 | నంది యెల్లయ్య | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
పదో | 1991–96 | నంది యెల్లయ్య | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
పదకొండవ | 1996–98 | నంది యెల్లయ్య | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
పన్నెండవ | 1998–99 | మల్యాల రాజయ్య | తెలుగు దేశం పార్టీ |
పదమూడవ | 1999-04 | మల్యాల రాజయ్య | తెలుగు దేశం పార్టీ |
పద్నాల్గవ | 2004-09 | సర్వే సత్యనారాయణ | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
BRS | తన్నీరు హరీశ్ రావు | 1,05,514 | 58.17 | ||
INC | పూజల హరి కృష్ణ | 23,206 | 12.79 | ||
BJP | దూది శ్రీకాంత్ రెడ్డి | 23,201 | 12.79 | ||
BSP | గాధగోని చక్రధర్ గౌడ్ | 16,610 | 9.16 | ||
స్వతంత్ర | పిల్లి సాయి కుమార్ | 4,970 | 2.74 | ||
స్వతంత్ర | ఇతరులు | 6,602 | 3.64 | ||
నోటా | పై వ్యక్తులలో ఎవరూ కారు | 1,300 | 0.72 | ||
మెజారిటీ | 82,308 | 100.00 | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,81,403 | ||||
BRS hold | Swing |
ఫలితాలు వివరముగా
క్ర.సంఖ్య | అభ్యర్థి | పార్టీ | మొత్తం ఓట్లు | % ఓట్లు |
---|---|---|---|---|
1 | గాధగోని చక్రధర్ గౌడ్ | బహుజన్ సమాజ్ పార్టీ | 16,610 | 9.16 |
2 | తన్నీరు హరీశ్ రావు | భారత రాష్ట్ర సమితి | 1,05,514 | 58.17 |
3 | దూది శ్రీకాంత్ రెడ్డి | భారతీయ జనతా పార్టీ | 23,201 | 12.79 |
4 | పూజల హరి కృష్ణ | భారత జాతీయ కాంగ్రెస్ | 23,206 | 12.79 |
5 | నర్సింహారెడ్డి అదుల్లా | భరత చైతన్య యువజన పార్టీ | 206 | 0.11 |
6 | బాబు కర్రోల్ల | ధర్మ సమాజ్ పార్టీ | 218 | 0.12 |
7 | రొమాలా బాబు దుర్గయ్య | భారత ప్రజా బంధు పార్టీ | 164 | 0.09 |
8 | వతరికరి నగరాని | ఆబాద్ పార్టీ | 478 | 0.26 |
9 | ఎక్కల్దేవి లింగం | స్వతంత్ర | 358 | 0.2 |
10 | ఏటీ ఆంజనేయులు | స్వతంత్ర | 675 | 0.37 |
11 | గుమ్మడి శ్రీశైలం | స్వతంత్ర | 443 | 0.24 |
12 | గువ్వల సంతోష్ కుమార్ | స్వతంత్ర | 291 | 0.16 |
13 | ధర్మాజీపేట ప్రతాప్ రెడ్డి | స్వతంత్ర | 227 | 0.13 |
14 | పశికాంతి శంకర్ | స్వతంత్ర | 543 | 0.3 |
15 | పిల్లి సాయి కుమార్ | స్వతంత్ర | 4,970 | 2.74 |
16 | పైసా రామకృష్ణ | స్వతంత్ర | 881 | 0.49 |
17 | పోతుగంటి నర్సింహారెడ్డి | స్వతంత్ర | 504 | 0.28 |
18 | బర్రె మల్లయ్య | స్వతంత్ర | 928 | 0.51 |
19 | రజినీకర్ చడా | స్వతంత్ర | 152 | 0.08 |
20 | వరికోలు శ్రీనివాస్ | స్వతంత్ర | 338 | 0.19 |
21 | శ్రీకాంత్ పెద్దసాయిగారి | స్వతంత్ర | 196 | 0.11 |
22 | నోటా | పైవేవీ లేవు | 1,300 | 0.72 |
మొత్తం | 1,81,403 |
జిల్లాస్థాయి శాఖల అధికారులు ఉండేలా జిల్లా కేంద్రానికి సమీపంలోని దుద్దాడలోని 50 ఎకరాలలో 63.6 కోట్ల రూపాయలతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించబడింది. 2021, జూన్ 20న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్ నూతన భవన సముదాయాన్ని (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం) ప్రారంభించాడు.[6] కార్యాలయానికి చేరుకున్న కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించాడు. ఆ తర్వాత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాడు. అనంతరం ఛాంబర్‌లో కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని కుర్చీలో కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు టి. హరీశ్‌రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లతోపాటు స్థానిక ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[7]
సిద్ధిపేటలో ఒక చెరువు ఉంది. దీనిని కోమటి చెరువు అంటారు. దీనినే మిని టాంక్ బండ్ అందరు సిద్ధిపేటలో మరిన్ని చెరువు కలవు వాటిలో ఎర్ర చెరువు నర్సాపూర్ చెరువు చింతల్ చెరువు కలవు
2018లో సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటయింది.[8]
సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒకే కాంప్లెక్స్‌లో రూ.48.69 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సఖి వన్ స్టాప్ సెంటర్ భవనం, సికింద్రాబాద్‌కు చెందిన గౌరా పెట్రో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు కోటి రూపాయలతో నూతనంగా నిర్మించనున్న మహిళలు, బాలల భరోసా సెంటర్ భవనానికి 2022 మార్చి 17న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీశ్ రావు శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో ఇతర ప్రజాపతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[9]
భారతదేశంలోనే తొలిసారిగా సిద్ధిపేట పట్టణంలో నిర్మించిన భూగర్భ మురుగునీటి సేకరణ కేంద్రాన్ని 2022 ఏప్రిల్ 20న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. 300కోట్ల రూపాయలతో ఏర్పాటుచేసిన ఎస్టీపీ ద్వారా శుద్ధి చేసిన నీటిని నర్సాపూర్ చెరువులోకి విడుదల చేస్తారు.[10][11]
డబుల్ బెడ్‌రూం కేసీఆర్ నగర్‌లో ఏర్పాటుచేసిన బస్తీ దవాఖాన నూతన భవనాన్ని 2022 జూన్ 10న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీశ్ రావు ప్రారంభించాడు. తాత్కాలిక భవనంలో బస్తీ దవాఖాన సేవలు అందిస్తుండగా, 18 లక్షల రూపాయలతో పక్కా భవనం నిర్మించారు. ఈ దవాఖానాలో అవుట్ పేషెంట్ సేవలు అందించడంపాటు బీపీ, షుగర్‌తో సహా 57 రకాల వైద్య పరీక్షలను చేస్తున్నారు. సుమారు 150 రకాల మందులను ఉచితంగా అందిస్తున్నారు. స్వల్పంగా అనారోగ్యం బారిన పడిన వారికి తక్షణ వైద్య చికిత్స అందించడంతో పాటు టీకాలు, కుటుంబ నియంత్రణ, వైద్య పరమైన కౌన్సిలింగ్ ఇస్తున్నారు.[12]
రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ సేవలు విస్తరించాలన్న ఉద్దేశంతో సిద్దిపేట పట్టణంలో 1,72,645 చదరపు అడుగుల విస్తీర్ణంలో 63 కోట్ల వ్యయంతో 718 సీటింగ్ కెపాసిటీతో జీప్లస్ 4 అంతస్తులతో తెలంగాణ ప్రభుత్వం సిద్దిపేట ఐటీ టవర్‌ను నిర్మించింది. ఈ ఐటీ టవర్‌ను 2023, జూన్ 15న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు కలిసి ప్రారంభించి, అందులోని వివిధ కంపెనీల్లో ఎంపికైనవారికి నియామక పత్రాలు అందజేశారు.[13][14] 2020, డిసెంబరు 10న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ ఐటీ టవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాడు.[15]
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ అనేది సిద్దిపేట పట్టణంలో చట్టాన్ని అమలుచేయడానికి, నేర దర్యాప్తులో ప్రాథమిక బాధ్యతలను కలిగి ఉన్న నగర పోలీసు విభాగం. దసరా పండుగ సందర్భంగా 2016 అక్టోబరు 11న రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించబడిన 21 జిల్లాలు, 4 కొత్త కమిషనరేట్‌లతోపాటు సిద్దిపేట కమిషనరేట్ కూడా అధికారికంగా ఏర్పాటుచేయబడింది.
సిద్ధిపేట పట్టణానికి జాతీయ, రాష్ట్రస్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి.[3]
ఇది కరీంనగర్, హైదరాబాదు ప్రధాన మార్గంలో ఉండుట వలన నిజామాబాద్, మెదక్ ల నుండి అన్ని బస్సులకు ఇది కూడలిగా ఉంది.ఇక్కడ బస్టాండ్ కూడా అన్ని సౌకర్యములతో ఉంది. సిద్ధిపేటలో రెండు బస్సు స్టాండులు ఉన్నాయి. ఒకటి పాతది. దీనిని పాత బస్సు స్టాండు అని అంటారు. కేవలం చుట్టు ప్రక్కల గ్రామాలకు వెళ్ళే ఆర్డినరీ బస్సులు మాత్రమే ఈ బస్సు స్టాండులో దొరుకుతాయి. ఎక్స్‌ప్రెస్ బస్సులు మాత్రం కొత్త బస్సు స్టాండులో ఆగుతాయి. పాత బస్సు స్టాండు ఊరికి నడిబొడ్డులో ఉంది.
పట్టణంలోని కోమటి చెరువు ప్రాంతం బైపాస్ రోడ్డులో 25 కోట్ల రూపాయలతో సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడేలా సిద్దిపేట శిల్పారామం పేరిట పర్యాటక కేంద్రం నిర్మించబడుతోంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.