జి. విజయ రామారావు

తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి From Wikipedia, the free encyclopedia

జి. విజయ రామారావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి.అతను ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు.

త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
జి. విజయ రామారావు

మాజీ ఎమ్మెల్యే
పదవీ కాలం
2004 - 2008
ముందు కడియం శ్రీహరి
తరువాత కడియం శ్రీహరి
నియోజకవర్గం స్టేషన్‌ ఘన్‌పూర్‌

ఎమ్మెల్యే
పదవీ కాలం
1994 - 1999
నియోజకవర్గం గజ్వేల్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
1984 - 1989
నియోజకవర్గం సిద్ధిపేట్ లోక్‌సభ

వ్యక్తిగత వివరాలు

జననం (1954-06-02)1954 జూన్ 2 [1]
కమ్మరిపేట , వేలేర్ మండలం , హన్మకొండ జిల్లా
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ , తెలంగాణ రాష్ట్ర సమితి , కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు చంద్రయ్య
జీవిత భాగస్వామి రామదేవి
సంతానం 1 కూతురు
నివాసం షాపూర్ నగర్, జీడీమెట్ల , హైదరాబాదు
మతం హిందూ
మూసివేయి

జననం, విద్యాభాస్యం

జి. విజయ రామారావు 1954 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా, వేలేరు మండలం, కమ్మరిపేట గ్రామంలో జన్మించాడు. అతను 10వ తరగతి వరకు వేలేర్ లోని జిల్లా పరిషత్ పాఠశాలలో పూర్తి చేసి, హన్మకొండ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. విజయ రామారావు హైదరాబాద్ లోని గాంధీ మెడికల్ కాలేజీ నుండి ఎంబిబిఎస్ పూర్తి చేశాడు.[2]

రాజకీయ జీవితం

జి. విజయ రామారావు 1984లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలోకి వచ్చాడు. అతను 1984లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ తరపున సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నంది ఎల్లయ్య పై 14201 ఓట్ల మెజారిటీతో గెలిచి 8వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యాడు.[3] అతను 1989లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నంది ఎల్లయ్య చేతిలో 86837 ఓట్లతో, 1991లో 115262 ఓట్లతో, 1996లో 87967 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు. ఆయన 1994లో టీడీపీ నుండి గజ్వేల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

విజయ రామారావు తెలంగాణ ఉద్యమ సమయంలో 2001లో హైదరాబాద్ జలదృశ్యంలో పార్టీ ఆవిర్భావం నాడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. అతను 2004లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుండి కాంగ్రెస్, టిఆర్ఎస్ పొత్తుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి పై ఓట్ల 19720 మెజారిటీతో గెలిచి, [4] వై.యస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశాడు.[5] అతను టిఆర్ఎస్ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశాడు. విజరామరావు 2013 ఆగస్టు 8న తెలంగాణ రాష్ట్ర సమితికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[6] అతను 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి టి.రాజయ్య చేతిలో 58829 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు.[7] అతను 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు.[8]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.