From Wikipedia, the free encyclopedia
సంతపురి రఘువీరరావు 1969 ప్రత్యేక తెలంగాణ పోరాట యోధుడు, తెలంగాణ తొలిదశ ఉద్యమ నిర్మాత, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, కవి, జర్నలిస్టు.
అతను స్వస్థలం మెదక్ జిల్లా ములుగు మండలంలోని బండ నర్సింహపల్లి గ్రామం. 1969లో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. రాష్ట్రంలోఅనేక ప్రాంతాల్లో పర్యటించి ఉద్యమవ్యాప్తికి కృషి చేశారు. మర్రి చెన్నారెడ్డితో కలిసి జైలుకెళ్లారు. జన్‌సంఘ్‌లో పనిచేస్తూ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని పాతబస్తీ నుంచి శాసనసభకు పోటీ చేశారు. జర్నలిస్టుగా సంతపురి రఘువీర్‌రావు నవశక్తి, ఆంధ్రభూమి, ఈనాడు, ఆంధ్రప్రభ వంటి పత్రికల్లో సంపాదక సభ్యుడిగా పనిచేశారు. సనాతన సారథికి సంపాదకుడిగా వ్యవహరించారు. వేదమాత పత్రికను నడిపారు. కవిగా అన్వేషణ పేరుతో కవితా సంపుటిని విడుదల చేశారు. విద్యార్థి దశలోనే భారత స్వాతంత్ర్య సమరంలో చురుకుగా పాల్గొని జైలు జీవితం సైతం గడిపారు. మలిదశ ఉద్యమంలో టీఆర్‌ఎస్ పార్టీ అవిర్భావ సమయంలో అండదండలు అందించారు.[1]
1948 మార్చి 8న అరెస్ట్ అయ్యి 1948 అక్టోబర్ 9న విడుదలైన హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ విద్యార్థి సత్యాగ్రహీల గ్రూప్ ఫోటోలో సంతపురి రఘువీర రావు
1972లో చార్మినార్ శాసనసభ నియోజకవర్గంలో మొత్తం 70614 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం చెల్లుబాటయ్యే ఓట్ల సంఖ్య 36107. ఈ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థి సయ్యద్ హసన్ గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. మొత్తం 15341 ఓట్లు సాధించారు. సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థి ఎస్ రఘువీర్ రావు మొత్తం 5591 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 9750 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
1993-1999 మధ్య కాలంలో శాసనసభ స్పీకర్‌గా ఉన్న జి. నారాయణరావు ఆయ నను సభ అనువాదకుడుగా నియమించారు.[2]
2001 లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్బావ సమయంలో సంతపురి రఘువీర్ రావు గారు వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు,ఉద్యమ సమయం లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గార్కి అండదండగా నిలిచార. 2002-2004 లో కొంత కాలం తెలంగాణ_రాష్ట్ర_సమితి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వాహిస్తు ఉద్యమ స్పూర్తిని ముందుకు సాగించారు
సైదాబాదులో నివసిస్తున్న అతను ఫిబ్రవరి 5 2015 న కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రిలో మరణించారు.
అతనుకు భార్య రమాదేవి, కుమారుడు వంశీకృష్ణ ఉన్నారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.