From Wikipedia, the free encyclopedia
ఆచార్య డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి (1966, సెప్టెంబరు 5 – 2023, ఏప్రిల్ 24) తెలంగాణకు చెందిన సాహితీవేత్త, పరిశోధకుడు, పత్రిక సంపాదకుడు. తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేశాడు.[1]
ఆచార్య గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి | |
---|---|
జననం | 1966, సెప్టెంబరు 5 పొతారెడ్డిపేట్, అక్బర్పేట-భూంపల్లి మండలం, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ |
మరణం | 2023 ఏప్రిల్ 24 56) హైదరాబాదు, తెలంగాణ | (వయసు
వృత్తి | అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ |
ప్రసిద్ధి | సాహితీవేత్త, పరిశోధకుడు, పత్రిక సంపాదకుడు |
తండ్రి | గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ |
తల్లి | పద్మావతి |
బాలశ్రీనివాసమూర్తి 1966, సెప్టెంబరు 5న మెదక్ జిల్లాలోని పోతారెడ్డిపేటలో జన్మించాడు.[2] ఇతని తండ్రి గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ కవి, అవధాని. తల్లి పద్మావతి.
హైదరాబాదు విశ్వవిద్యాలయంలో చలం రాసిన 'సుధ గీతాల' మీద ఎం.ఫిల్., 'తెలుగులో తాత్త్విక కావ్యాలు' అనే అంశంమీద పిహెచ్.డి. చేసాడు.
తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పడిన తొలినాళ్ళ నుంచి బోధన విధుల్లో ఉన్న బాలశ్రీనివాసమూర్తి విశ్వవిద్యాలయంలోని వివిధ పరిపాలన పదవులు నిర్వహించాడు.[3]
జాగృతి వార పత్రికలో సాహిత్య వ్యాసాలను, జాతీయ-అంతర్జాతీయ సదస్సులలో పరిశోధన పత్రాలు సమర్పించాడు. దాదాపు పది పుస్తకాలను వెలువరించాడు. తెలంగాణ సాహిత్య అకాడమీ రూపొందించిన 'సమగ్ర తెలంగాణ సాహిత్య చరిత్ర' పుస్తక సంపాదక బృందంలో సభ్యునిగా పనిచేశాడు.
ఆచార్య బాలశ్రీనివాసమూర్తి 2023, ఏప్రిల్ 24న హఠాత్తుగా గుండెపోటుతో హైదరాబాదు సుచిత్రలోని తన స్వగృహాంలో మరణించాడు.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.