మల్లేశం 2019 లో విడుదలైన తెలుగు సినిమా. చేనేత కళాకారుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడినది.[2]

త్వరిత వాస్తవాలు మల్లేశం, దర్శకత్వం ...
మల్లేశం
Thumb
మల్లేశం సినిమా పోస్టర్
దర్శకత్వంరాజ్ రాచకొండ
రచనరాజ్ రాచకొండ
నిర్మాతరాజ్ రాచకొండ
శ్రీ అధికారి
తారాగణంప్రియదర్శి పులికొండ
అనన్య నాగళ్ల
ఝాన్సీ
ఆనంద చక్రపాణి
ఛాయాగ్రహణంబాలు సాండిల్యాస
కూర్పురాఘవేందర్ వి
సంగీతంమార్క్ కె రాబిన్
నిర్మాణ
సంస్థ
స్టూడియో 99
పంపిణీదార్లుసురేష్
విడుదల తేదీ
21 జూన్ 2019 (2019-06-21)
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్రూ. 2.5 కోట్లు[1]
బాక్సాఫీసురూ. 5 కోట్లు (అంచనా)[1]
మూసివేయి

కథ

ఈ చిత్ర కథ 1980-1990 ల మధ్య కాలం లోనిది. నల్గొండ జిల్లాలోని ఓ కుగ్రామం. ఆ గ్రామస్తుల్లో మల్లేశం కుటుంబం నేతపని చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇంకా ఆ గ్రామంలో చాలా మంది ఇదే వృత్తిలో జీవనం సాగిస్తూ అప్పుల్లో కూరుకుపోతారు. అయితే మల్లేశం చిన్నతనం నుంచి అమ్మ లక్ష్మీ (ఝాన్సీ (నటి)) ఆసు పనిచేయడంతో చేయి నొప్పిలేస్తుంటుంది. భుజం కూడా పడిపోయేస్థితికి వస్తుంది. ఆ ఊర్లో చాలా మందిది అదే పరిస్థితి. అమ్మ పడే కష్టాలు ఎలాగైనా దూరం చేయాలని చిన్నప్పటీ నుంచే ఏదో ఒకటి ప్రయత్నిస్తుంటారు. మల్లేశం పెద్దయ్యాక ఒక్కొక్క ఆలోచనతో ఆసుయంత్రం వైపు అడుగులు వేస్తాడు. ఆ యంత్రాన్ని తయారుచేయడానికి ఊర్లో అప్పులు చేస్తాడు. ఆసు యంత్రం చేస్తున్న మల్లేశంను ఊర్లో అందరూ ఎగతాళి చేస్తారు. పిచ్చొడు అంటూ గెలీచేస్తారు.


మల్లేశంను ఇలాగే వదిలేస్తే.. నిజంగానే పిచ్చొడు అయిపోతాడేమో అని తల్లిదండ్రులు భయపడి పెళ్లి చేస్తే అయినా బాగుపడతాడని భావిస్తారు. ముందు పెళ్లి వద్దని వారించినా.. తను ప్రేమిస్తున్న మరదలు పద్మ(అనన్య) పెళ్లి కూతురు అనే సరికి మల్లేశం పెళ్లికి ఒప్పుకుంటాడు. ఇక పెళ్లి అయినాసరే ఆసుయంత్రం తయారు చేయాలన్న ప్రయత్నాలను కొనసాగిస్తాడు. పద్మ కూడా ఆసుయంత్రం చేయమని ప్రోత్సహిస్తుంది. అయితే ఓసారి ఆసుయంత్రాన్ని పరీక్షించబోతే మోటార్‌ పేలిపోతుంది. ఇక ఆ విషయం తెలిసి అప్పులోల్లు అందరూ ఇంటి మీదకు వస్తారు. ఈ విషయంపై మొదటిసారి మల్లేశం అమ్మ కూడా మందలిస్తుంది. అయినా సరే ఆసుయంత్రం చేయాల్సిందేనని, అందుకు డబ్బు కావాలని భార్య పద్మను గాజులు, నగలు ఇవ్వమని అడుగుతాడు. అవి తన పుట్టింటి వారు ఇచ్చినవి, తనకు ఇవొక్కటే మిగిలాయని అంటుంది. మాటామాటా పెరిగి గొడవ పెద్దదవుతుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మల్లేశం.. అప్పుల బాధలు తట్టుకోలేక, తల్లి కూడా మందలించడం, భార్య కూడా సాయం చేయకపోవడంతో ఆత్మహత్యయత్నం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మల్లేశం అసలు ఆసు యంత్రాన్ని ఎలా తయారుచేశాడు? అనేది మిగతా కథ.[3]

తారాగణం

పాటల జాబితా

  • ధన ధన థన్ , రచన: గోరేటి వెంకన్న , గానం . అనురాగ్ కులకర్ణి
  • నాకు నువ్వని, రచన: చంద్రబోస్, గానం. శ్రీకృష్ణ, రమ్య బెహరా
  • ఓహో జాంబియా, రచన: గోరేటి వెంకన్న , గానం. గోరేటి వెంకన్న, రాహూల్ సింప్లీ గంజ్
  • ఆ చల్లని, రచన: దాశరథి, గానం. అనురాగ్ కులకర్ణి
  • కొత్త కొత్తగా , రచన: గోరేటి వెంకన్న , గానం.శ్రీకృష్ణ , రమ్య బెహరా
  • అమ్మ దీవెన , రచన: చంద్రబోస్ , గానం.శ్రీకృష్ణ
  • ఎంత మాయ , రచన: అశోక్ పెద్దినేని, గానం. రమ్య బెహరా
  • చేతి కొచ్చిన బిడ్డే, రచన: చంద్రబోస్, గానం.అనురాగ్ కులకర్ణి .

సాంకేతికవర్గం

సంగీతం : మార్క్‌ కె.రాబిన్‌

దర్శకత్వం : రాజ్‌ ఆర్‌

నిర్మాత : రాజ్‌ ఆర్, శ్రీ అధికారి

మూలాలు

బయటి లంకెలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.