తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2015

From Wikipedia, the free encyclopedia

తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం నిర్వహిస్తుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృషి చేసినవారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు పేరిట పురస్కారాలను అందించడం జరుగుతుంది.


2015లో రాష్ట్ర స్థాయిలో 32 విభాగాల్లో 52 మందికి ఆవార్డు కింద ఒక్కొక్కరికి లక్షా నూటా పదహారు రూపాయలతో మండల స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు 5,780 మందిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. ఈ పురస్కారాల కింద 7 కోట్ల 52 లక్షల 70 వేలు అందజేసింది.[1]

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 2015, జూన్‌ 2న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతులమీదుగా జ్ఞాపిక, లక్షా 116 రూపాయల నగదు పురస్కార గ్రహీతలకు లక్షా 116 రూపాయల నగదుతో పాటు జ్ఞాపిక, ధ్రువీకరణ పత్ర ప్రదానం జరిగింది.

ఉత్తమ గ్రామ పంచాయతీగా కరీంనగర్‌ జిల్లా లోని చందుర్తి, ఉత్తమ మండలంగా మెదక్‌ జిల్లా లోని సిద్దిపేట, ఉత్తమ మున్సిపాలిటీగా ఆదిలాబాద్‌ జిల్లా లోని మంచిర్యాలను అవార్డుల కమిటీ ఎంపిక చేయడం జరిగింది.[2]

పురస్కార గ్రహీతలు

మరింత సమాచారం క్రమసంఖ్య, పేరు ...
క్రమసంఖ్యపేరురంగంస్వస్థలం
1కె. పాండురంగాచార్యవేపండితుడుహైదరాబాదు
2ముదిగొండ వీరభద్రయ్యసాహితీవేత్తహైదరాబాదు
3గూడ అంజయ్యసాహితీవేత్తహైదరాబాదు
4సలావుద్దీన్‌ సయ్యద్‌సాహితీవేత్తహైదరాబాదు
5సుంకిరెడ్డి నారాయణరెడ్డిసాహితీవేత్తనల్లగొండ జిల్లా
6పోల్కంపల్లి శాంతాదేవిసాహితీవేత్తవనపర్తి
7పెద్దింటి అశోక్ కుమార్సాహితీవేత్తకరీంనగర్‌
8ఆర్చ్‌ బిషప్‌ తుమ్మబాలఆధ్యాత్మిక వేత్త
9మహమ్మద్‌ ఉస్మాన్‌మక్కా మసీదు ఇమాం జనాబ్‌
10ఏలె లక్ష్మణ్రాష్ట్ర ప్రభుత్వ లోగో రూపకర్త
11ఎక్కా యాదగిరిరావుఅమరవీరుల స్థూప నిర్మాత
12కె. లక్ష్మాగౌడ్‌చిత్రకారుడు
13కళాకృష్ణకళాకారులుహైదరాబాదు
14అలేఖ్య పుంజాలశాస్త్రీయ నృత్యంహైదరాబాదు
15టంకశాల అశోక్‌జర్నలిస్ట్‌హైదరాబాదు
16డాక్టర్‌ పసునూరి రవీందర్ఉత్తమ ఎలక్ట్రానిక్‌ విూడియా జర్నలిస్ట్‌హైదరాబాదు
17హైదరాబాద్ బ్రదర్స్సంగీతకారులుహైదరాబాదు
18విఠల్‌ రావుగజల్‌ గాయకుడు
19జి.ఎల్‌. నామ్‌దేవ్‌ఉద్యమ సంగీతంకరీంనగర్
20ఆచార్య నల్లాన్‌ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామిసంస్కృత పండితుడువరంగల్ జిల్లా
21చుక్కా సత్తయ్యజానపద కళలుజనగాం
22వంగీపురం నీరజాదేవికూచిపూడి నృత్యంవనపర్తి
23గోపన్నగారి శంకరయ్యఅర్చకులుహైదరాబాదు
23సుధాకర్‌రెడ్డిన్యాయకోవిదులుహైదరాబాదు
24చందుర్తిగ్రామ పంచాయతీకరీంనగర్ జిల్లా
25సిద్ధిపేట మండలంమండలంసిద్ధిపేట జిల్లా
26డా.సి.హెచ్.మోహన్‌రావుశాస్త్రవేత్త
27నర్రా రవిఎంటర్‌ప్రెన్యూర్
28ప్రొ. శ్రీధరస్వామివిద్యావేత్తవరంగల్ జిల్లా
29ముఖేశ్క్రీడాకారుడురంగారెడ్డి జిల్లా
30ముళినీరెడ్డిక్రీడాకారుడుహైదరాబాద్
31డా. రాజారెడ్డివైద్యుడుహైదరాబాద్
32డా. ఆర్. లక్ష్మణమూర్తివైద్యుడువరంగల్
33దేవనార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్ఎన్‌జీవోహైదరాబాద్
34భరత్ భూషణ్ఫొటోగ్రఫీహైదరాబాద్
35అయల అనంతాచారిహస్తకళలుపెంబర్తి, జనగాం జిల్లా
36కందకట్ల నర్సింహులుచేనేతహైదరాబాద్
37ఇ. పద్మఅంగన్‌వాడీకొత్తగూడెం అర్బన్ ప్రాజెక్టు
38మాటల తిరుపతిఉద్యమ గాయకుడు
39యోధన్ఉద్యమ గాయకుడుఆదిలాబాద్ జిల్లా
40భూక్యా సుశీలఉద్యమ గాయకురాలు
41ఎం.వి. రమణారెడ్డిశిల్పిమెదక్ జిల్లా
42ఎన్. విజయశ్రీఉపాధ్యాయురాలుజీపీహెచ్‌ఎస్ నాదర్‌గుల్, రంగారెడ్డి జిల్లా
43బండా ప్రతాపరెడ్డిఉపాధ్యాయుడుసీనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ మాసబ్‌ట్యాంక్
44బి. పద్మారావుప్రభుత్వ ఉద్యోగిఎస్‌ఈ, నీటిపారుదల శాఖ (వరంగల్)
45పి. అనూరాధారెడ్డివారసత్వ కట్టడాల పరిరక్షణహైదరాబాద్
46డా. ఎం.పాండురంగారావువారసత్వ కట్టడాల పరిరక్షణవరంగల్
47డా. జై శెట్టి రమణయ్యచరిత్ర పరిశోధనకరీంనగర్ జిల్లా
48కర్ర శశికళఉత్తమ రైతుదుగ్గేపల్లి, త్రిపురారం, నల్లగొండ జిల్లా
49వొల్లాల రమేశ్ఉత్తమ రైతుభీమదేవరపల్లి, కరీంనగర్ జిల్లా పాడిపరిశ్రమ
50మంచిర్యాలఉత్తమ మున్సిపాలిటీఆదిలాబాదు జిల్లా
మూసివేయి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.