పశ్చిమ గారో హిల్స్ జిల్లా

మేఘాలయ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia

పశ్చిమ గారో హిల్స్ జిల్లా

పశ్చిమ గారో హిల్స్ జిల్లా, మేఘాలయ రాష్ట్ర జిల్లా. జిల్లానిర్వహణా కేంద్రంగా తుర ఉంది. జిల్లా వైశాల్యం 3,714 చ.కి.మీ ఉంటుంది. 2001 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 515,813. 2011 గణాంకాలు మేఘాలయ రాష్ట్రంలో ఈ జిల్లా జనసాంధ్రతలో రెండవ స్థానంలో ఉందని తెలుస్తుంది. మొదటి స్థానంలో తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా ఉంది. [1] పశ్చిమ గారో హిల్స్ జిల్లా మేఘాలయ రాష్ట్రం పశ్చిమ సరిహద్దులో ఉంది. జిల్లా తూర్పు సరిహద్దులో తూర్పు గారో హిల్స్ జిల్లా, ఆగ్నేయంలో దక్షిణ గారో హిల్స్ జిల్లా, ఉత్తర సరిహద్దులో అస్సాం రాష్ట్రంలోని గోల్‌పారా జిల్లా, దక్షిణ సరిహద్దులో బంగ్లాదేశ్ ఉంది.

త్వరిత వాస్తవాలు పశ్చిమ గారో హిల్స్ జిల్లా పశ్చిమ గారో, దేశం ...
పశ్చిమ గారో హిల్స్ జిల్లా
పశ్చిమ గారో
Thumb
మేఘాలయ పటంలో పశ్చిమ గారో హిల్స్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమేఘాలయ
ముఖ్య పట్టణంతుర
Government
  శాసనసభ నియోజకవర్గాలు7
విస్తీర్ణం
  మొత్తం3,714 కి.మీ2 (1,434 చ. మై)
జనాభా
 (2001)
  మొత్తం5,15,813
  జనసాంద్రత140/కి.మీ2 (360/చ. మై.)
జనాభా వివరాలు
  అక్షరాస్యత53%
Websiteఅధికారిక జాలస్థలి
మూసివేయి

చరిత్ర

1976, అక్టోబరులో గారో హిల్స్ జిల్లాను తూర్పు గారో హిల్స్ జిల్లా, పశ్చిమ గారో హిల్స్ జిల్లా అనే రెండు జిల్లాలుగా విభజించబడింది. అదనంగా పశ్చిమ గారో హిల్స్ జిల్లా, వెస్ట్ గారో హిల్స్, సౌత్ గారో హిల్స్ అనే మరో రెండు జిల్లాలుగా 1962 జూన్ లో విభజించబడింది.

ఆర్ధికం

2006లో " పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ " భారతదేశంలోని వెనుకబడిన 250 జిల్లాలలో వెస్ట్ గరో హిల్స్ జిల్లా ఒకటి.[2] బ్యాక్వర్డ్ రీజంస్ గ్రాంట్ ఫండ్ ప్రోగ్రాం నుండి నిధులు అందుకుంటున్న 3 మేఘాలయ జిల్లాలలో ఇది ఒకటి.[2]

విభాగాలు

నిర్వహణా విభాగాలు

నైరుతీ గరోహిల్స్ జిల్లా రూపుదిద్దుకున్న తరువాత పశ్చిమ గారో జిల్లా 6 బ్లాకులుగా విభజించబడింది.[3]

పేరు ప్రధానకాత్యాలయం జనసంఖ్య ప్రాంతం
దడెంగిరి Dadenggiriదడెంగిరి
Thumb
డాలుడాలు
Thumb
గంబెగ్రేగంబెగ్రే
Thumb
రొంగ్రంఅసనంగిరి
Thumb
సెల్సెల్లసెల్సెల్ల
Thumb
టిక్రికిల్లాల్టిక్రికిల్లాల్
Thumb

గణాంకాలు

మరింత సమాచారం విషయాలు, వివరణలు ...
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .. 642,923, [1]
ఇది దాదాపు... మాంటెంగ్రొ దేశ జనసంఖ్యకు సమం [4]
అమెరికాలోని వర్మోంట్ జనసంఖ్యకు సమం [5]
640 భారతదేశ జిల్లాలలో 514వ స్థానంలో ఉంది [1]
1చ.కి.మీ జనసాంద్రత 173 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 24.02%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి 979:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 68.38%.[1]
జాతియ సరాసరి (72%) కంటే అధికం
మూసివేయి

గారో లేక అచిక్స్,, బెంగాలీలు, నేపాలీ ప్రజలు, అస్సామీ ప్రజలు, హజాంక్ సంప్రదాయక ప్రజలు, రాభాలు, కోచెస్ ప్రజలు నివసిస్తున్నారు. వీరుకాక బోడోలు, దక్షిణ భారతీయులు అక్కడక్కడా ఉన్నారు. వీరు చర్చిలు, ఉపాధ్యాయ వృత్తి, పారామిలిటరీలో ఉన్నారు.

భాషలు

పశ్చిమ గారో హిల్స్ జిల్లాలో టాంగ్, టిబెటో- బర్మన్ భాషలు వాడుకలో ఉన్నాయి. ఈ భాషను భారతదేశం, బంగ్లాదేశ్ లలో 10,000 మంది మాట్లాడుతుంటారు. [6]

సంస్కృతి

పర్యాటక ఆకర్షణలు

గారో హిల్స్‌లో సిజు గుహ, నాక్రెక్ పీక్, సిజు బర్డ్ శాంచ్యురీ, లిమిల్సంగ్ డాం జలపాతాలు, సొసిబిబ్రా, రాంగ్‌డాంగ్ ఫాల్స్.

  • భైబరి/వడగొక్రే ఎక్స్కేవేషన్ సైట్.
  • పెల్గ జలపాతం.
  • తురా శీఖరావళి.
  • నాక్రెక్ శిఖరం.
  • నాక్పాంటే ఇంస్టిట్యూషన్.
  • టిపికల్ గారో విలేజ్, ఇతరాలు.

వృక్షజాలం , జంతుజాలం

1986 పశ్చిమ గారో హిల్స్ జిల్లా, దాని సోదర జిల్లాలైన సౌత్ గారో హిల్స్ జిల్లా, తూర్పు గారో హిల్స్ జిల్లాలలో కలిసి " నాక్రెక్ జాతీయ పార్క్ " పుట్టినిల్లైంది. ఈ పార్క్ వైశాల్యం 47 చ.కి.మీ.[7]

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.