Remove ads
మేఘాలయ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా, మేఘాలయ రాష్ట్ర జిల్లాలలో ఒక జిల్లా ఒకటి. షిల్లాంగ్ జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 2,752 కి.మీ, జనసంఖ్య 824,059.2011 గణాంకాలను అనుసరించి మేఘాలయ రాష్ట్ర జిల్లాలలో తూర్పు గారో హిల్స్ జిల్లా అత్యధిక జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తించబడింది.[2]
తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా
ఖాసీ హిల్స్ | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మేఘాలయ |
ముఖ్య పట్టణం | షిల్లాంగ్ |
Government | |
• శాసనసభ నియోజకవర్గాలు | 7 |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,752 కి.మీ2 (1,063 చ. మై) |
జనాభా (2011[1]) | |
• మొత్తం | 8,24,059 |
• జనసాంద్రత | 300/కి.మీ2 (780/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 63.31% |
• లింగ నిష్పత్తి | 1008 |
ప్రధాన రహదార్లు | 44వ జాతీయ రహదారి, 40వ జాతీయ రహదారి |
Website | అధికారిక జాలస్థలి |
ఖాసీ హిల్స్ జిల్లాలో కొంత భూభాగం విభజించి రూపుదిద్దబడింది. 1976 అక్టోబరు 28న ఖాసీ హిల్స్ జిల్లా తూర్పు ఖాసీ, పశ్చిమ ఖాసీ జిల్లాలుగా విభజించబడింది. తూర్పు ఖాసీ జిల్లా అదనంగా తూర్పు ఖాసీ, రి-భోయ్ జిల్లాలుగా విభజించబడ్డాయి.
తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాకు షిల్లాంగ్ కేంద్రంగా ఉంది. తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా మేఘాలయ రాష్ట్రానికి మద్యభాగంలో ఉంది. జిల్లా వైశాల్యం 2,748 చ.కి.మీ ఉంటుంది. జిల్లా 25°07” & 25°41” ఉత్తర అక్షాంశం, 91°21” & 92°09” తూర్పు రేఖాంశంలో ఉపస్థితమై ఉంది.
జిల్లా ఉత్తర సరిహద్దులో రి-భోయి మైదానాలు మొదలై క్రమంగా షిల్లాంగ్ పచ్చికబైళ్ళ వైపు సాగిపోతూ నదీ లోయలో కలిసిపోతుంది. తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా దక్షిణ ప్రాంతంలో అత్యధికంగా కొండలతో సన్నని దారులు, కనుమలతో నిండి ఉంటుంది. జిల్లా తూర్పు సరిహద్దులో జంతీ హిల్స్ జిల్లా, పడమర సరిహద్దులో పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా ఉన్నాయి.
జిల్లా నైసర్గిక పరిస్థితిలో నదీ లోయలతో కలిసిపోయిన షిల్లాంగ్ మైదానం ప్రధానమైనదిగా భావించవచ్చు. అలాగే షెల్లా భోలాగంజ్, కమ్యూనిటీ, రూరల్ డెవలెప్మెంటు బ్లాక్ బంగ్లాదేశ్ సరిహద్దులో ఉంటుంది. నగరానికి 10 కి.మీ దూరంలో షిల్లాంగ్ శిఖరం ఉంటుంది. పల్లెసీమల అందాలతో కూడిన ఎత్తైన పర్వతప్రాంతాలు ప్రకృతి సహజ సౌందర్యాన్ని ప్రతిబింబిస్తుంటాయి. ఈ దృశ్యాలు రాష్ట్రానికంతటికీ గుర్తింపు తీసుకువచ్చాయి.
జిల్లా వాతావరణం పీఠభూమి ప్రాంతంలోని సమశీతోష్ణ ప్రాంతం నుండి ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో వెచ్చని ఉష్ణమండల, ఉప-ఉష్ణమండల వాతావరణం మార్పులుతో ఉంటుంది. జిల్లా మొత్తం నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాధారణంగా మే నుండి ప్రారంభమై సెప్టెంబరు వరకు కొనసాగుతుంది. సాధారణంగా డిసెంబరు, మార్చి మధ్య పొడి వాతావరణఁ మినహా సంవత్సరంలో ఎక్కువ భాగం వాతావరణం తేమగా ఉంటుంది.
తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా 8 ఉపవిభాగాలుగా విభజించబడింది.[3]
పేరు | ప్రధానకార్యాలయం | జనసంఖ్య | ప్రాంతం |
ఖతర్షనంగ్ లైత్క్రొ | మాజ్రంగ్ | ||
మాకింర్యూ | మాకింర్యూ | ||
మాఫ్లాంగ్ | మాఫ్లాంగ్ | ||
మారింగ్క్నెంగ్ | మారింగ్క్నెంగ్ | ||
మాసింరం | మాసింరం | ||
మిల్లియం Mylliem | మిల్లియం | ||
పింసుర్స్ల | పింసుర్స్ల | ||
షెల్లా భోలఘని | చిరపుంజి |
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య .. | 824,059,[2] |
ఇది దాదాపు... | కొమరోస్ జనసంఖ్యకు [4] |
అమెరికాలోని | సౌత్ డకోటా [5] |
640 భారతదేశ జిల్లాలలో | 478 వ స్థానంలో ఉంది [2] |
1చ.కి.మీ జనసాంద్రత | 292 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | 24.68%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి | 1008:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే | అత్యధికం |
అక్షరాస్యత శాతం | 84.7%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
2013లో ఆసియాలో అత్యంత పరిశుద్ధమైన గ్రామంగా పేర్కొన్నారు. అలాగే 2005లో భారతదేశంలో అత్యంత పరిశుద్ధమైన గ్రామంగా కూడా గుర్తించబడింది. [6]
జిల్లా కేంద్రం, మేఘాలయ రాష్ట్ర రాజధాని అయిన షిల్లాంగ్ జాతీయ రహదారి 44 మర్గంలో గౌహతి, సిచార్ నగరాలతో అనుసంధానించబడి ఉంది. సమీపంలోని రైల్వే స్టేషను, విమానాశ్రయం గౌహతీ నగరంలో ఉన్నాయి. షిల్లాంగ్‌కు 35 కి.మీ దూరంలో ఉన్న ఉంరోయిలో చిన్న ఎయిర్‌క్రాఫ్ట్ నిలవడామికి అవసరమైన ఎయిర్‌స్ట్రిప్ ఉంది. వ్యవసాయ ఉత్పత్తులు ఇతర సామాగ్రి జీబులు, ట్రాక్టర్లు, ట్రక్కులలో రవాణాచేయబడుతుంటాయి. షిల్లాంగ్ రాష్ట్రంలోని ఇతర భూభాగాలతో ఆటో వాహనాల రాకపోకలకు అనువైన చక్కగా అనుసంధానించబడుతుంది. అలాగే జిల్లాలోని అన్ని బ్లాకుల కేద్రాలు కూడా రహదారి మార్గాలతో అనుసంధానించబడి ఉన్నాయి. అయినప్పటికీ సుదూరప్రాంతాలలో ఉన్న గ్రామాలకు రాకపోకల మార్గాలు దీనావస్థలో ఉన్నాయి. అలాగే చాలినంత రవాణా వసతులు కూడా లేవు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.