నమాజ్, (అరబ్బీ : صلاة ) (పర్షియన్, ఉర్దూలో : نماز ) (అరబ్బీ:صلوة) ఇస్లాంలో భక్తులు అల్లాహ్ ముందు మోకరిల్లి చేసే ప్రార్థన. ప్రతిదినం 5 సమయాలలో చేసే నమాజ్ ప్రతి ముస్లిం కచ్చితంగా పాటించవలసిన నియమం. ఇస్లామీయ ఐదు మూలస్థంభాలలో ఇది ఒకటి. నమాజ్ ను అరబ్బీలో "సలాహ్" అని అంటారు. ఇదే పదాన్ని పర్షియనులు, ఉర్దూ మాట్లాడేవారు "సలాత్" అని పలుకుతారు. పర్షియన్ భాషలో "నమాజ్" అని అంటారు. పర్షియన్ భాషాపదమైన "నమాజ్"నే భారత ఉపఖండంలో కూడా వాడుతారు.

Thumb
ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ లో ప్రార్థనలు చేస్తున్న నమాజీలు.
త్వరిత వాస్తవాలు
వ్యాసముల క్రమము

Thumb

ఇస్లాం మతం

విశ్వాసాలు

అల్లాహ్ · ఏకేశ్వర విశ్వాసం దేవుడు
ముహమ్మద్ · ఇతర ప్రవక్తలు

ఆచరణీయాలు

మూల విశ్వాసం · నమాజ్
ఉపవాసం · దాన ధర్మాలు · తీర్థయాత్ర

గ్రంధాలు, చట్టాలు

ఖుర్'ఆన్ · సున్నహ్ · హదీస్
ఫిఖ॰ · షరియా · కలాం · సూఫీ తత్వం

చరిత్ర, ఖలీఫాలు

ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక
అహ్లె బైత్ · సహాబా
సున్నీ · షియా
రాషిదూన్ ఖలీఫాలు · ఇమామ్

సంస్కృతి, సమాజం

విద్య · జంతువులు · కళలు
కేలండరు · పిల్లలు
జనగణన · పండుగలు
మస్జిద్‌లు · తత్వము
శాస్త్రము · స్త్రీ
రాజకీయాలు · దావాహ్ · జిహాద్

ఇస్లాం, ఇతర మతములు

క్రైస్తవం · యూదమతము
హిందూ మతము · సిక్కు మతం · జైన మతము

విమర్శ ·  ముస్లింలలో అపవిశ్వాసాలు
ఇస్లామోఫోబియా
ఇస్లామీయ పదజాలము

భారతదేశంలో ఇస్లాం
ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం

మూసివేయి
Thumb
సలాహ్ ఆచరిస్తున్న ముస్లింలు

నమాజ్ ఎవరు ఆచరించవచ్చు

విధులు

Thumb
కైరూన్ మస్జిద్ లేదా ఉక్బా మస్జిద్ పశ్చిమ ముస్లిం ప్రపంచంలో అతిప్రాచీన మస్జిద్.[1] ప్రార్థనా హాలు యందు, మిహ్రాబ్, ఖిబ్లాను సూచిస్తోంది.

అల్లాహ్ యొక్క ఉపాసన కొరకు ఖచ్చితంగా పాటించవలసిన నమాజ్ కొరకు క్రింది మూడు విషయాలు దృష్టిలో వుంచుకోవాలి :[2]

  • ముస్లిం (విశ్వాసి) అయి వుంటే మంచిది.
  • మానసికంగా ఆరోగ్యవంతుడై వుండాలి
  • 10 సంవత్సరాలు నిండినవారై వుండాలి (7 సంవత్సరాలు కనీస వయస్సు వుండాలి).[3]

నమాజ్ ఆచరించడానికి ఆరు మూల విషయాలు గుర్తుంచుకోవాలి :[2]

  • నమాజు సమయపాలన వుండాలి.[4]
  • ఖిబ్లా వైపు ముఖం వుంచి, శరీరము కాబా వైపున వుంచి నమాజు ఆచరించాలి. అనారోగ్యులు, ముసలివారికి ఈ విషయంలో మినహాయింపు ఉంది.
  • శరీర భాగాలను బాగా కప్పుకోవాలి.[5]
  • దుస్తులు, శరీరం, సజ్దాచేయు ప్రదేశం పరిశుభ్రంగా వుండాలి.
  • ఆచార శుద్ధత, వజూ, తయమ్ముం, గుస్ల్,
  • ప్రార్థన ఆచరించే ముందు ప్రదేశం ద్వారా ఎవరూ నడిచేప్రదేశం లేకుండా వుంచడం, అనగా నమాజీ ముందు నుండి ఎవరూ రాకపోకలు చేయరాదు, అలా చేస్తే ప్రార్థనా నిష్ఠ భంగమౌతుంది.[6] .

ప్రార్థనా స్థలి పరిశుభ్రంగా వుండాలి. ఒకవేళ గాయాల కారణంగా శరీరం నుండి రక్తము ప్రవహిస్తూ వుంటే నమాజ్ ఆచరించరాదు. స్త్రీలు తమ ఋతుకాలములో నామాజ్ ఆచరించరాదు. అలాగే స్త్రీలు బిడ్డల ప్రసవించిన తరువాత ఒక నియమిత కాలం, ఉదాహరణ 40 రోజులవరకు నమాజ్ ఆచరించరాదు. ముహమ్మద్ ప్రవక్త ఈ విధంగా సెలవిచ్చారు "స్త్రీలు తమ ఋతుక్రమకాలంలోనూ, ప్రసవించిన తరువాత కొద్ది కాలం కొరకునూ నమాజు గాని ఉపవాసవ్రతంగానీ ఆచరించరాదు. "[7][8][9]

నమాజ్ లో ఆచరణీయాలు

పరిశుద్ధత

నమాజ్ ఆచరించదలచినవారు, శుచి శుభ్రత పాటిస్తూ, స్నానమాచరించి వుండవలెను.

వజూ

వజూ అంటే నమాజుకు ముందు ముఖం, చేతులు, కాళ్లు శుభ్రపరచుకోటం.

హజ్ వద్ద వజూ

కుళాయి వద్ద వజూ చేసేటప్పుడు నీరు వృథా కాకుండా నివారించేందుకు ఆటోమేటిక్‌ సెన్సర్లు, బేసిన్లతో ఒక యంత్రాన్ని కూడా రూపొందించారు. ఈ యంత్రంలో వజూ చేసే ముందు చదివే దువా (ప్రార్థన) కూడా రికార్డు చేసి ఉంచారు. వజూ చేసే ముందు ఈ యంత్రం నుంచి దువా వినిపిస్తుంది. ఈ యంత్రం ద్వారా ఒక్కొక్కరు వజూ చేయడానికి కేవలం 1.3 లీటర్ల నీరు సరిపోతుంది. హజ్ సమయంలో మక్కాలో 20 లక్షల మంది వజూ చేసుకోడానికి రోజుకు 5 కోట్ల లీటర్ల నీరు అవసరం. అదే ఈ యంత్రాన్ని వాడితే రోజుకు 4 కోట్ల లీటర్ల నీరు ఆదా అవుతుంది.[10]

ఇఖామా

ఇఖామా అంటే శ్రద్ధా భక్తులతో ప్రార్థనకోసం వరుసలుగా నిలబడటం అని అర్ధం. అజాన్ పలుకులు రెండు సార్లు ఇఖామా పలుకులు ఒకసారి పలకమని ప్రవక్త చెప్పారు (బుఖారీ 1:581) ఇఖామా విన్నప్పుడు తొందరపడకుండా ప్రశాంతంగా చేయగలిగినంత ప్రార్థన చేయండి (బుఖారీ 1:609) నుండి వెలికితీశారు.

రుకూ

సజ్దా

కాయిదా

సలామ్

దుఆ

రోజువారీ నమాజులు

Thumb
టర్కీ లోని ఒక మస్జిద్ లో నమాజు సమయాలను చూపెట్టే ఒక బోర్డు.
  • ఫజ్ర్  : ఫజ్ర్ అనగా సూర్యోదయం సమయం. సూర్యోదయాత్పూర్వం ఆచరించే నమాజ్ ని ఫజ్ర్ నమాజ్ లేదా " సలాతుల్ ఫజ్ర్ " (అరబ్బీ) గా వ్యవహరిస్తారు.
  • జుహర్  : జుహర్ అనగా మధ్యాహ్న సమయం. సూర్యుడు నడినెత్తినవచ్చి పడమట పయనించే సమయం. ఈ సమయంలో ఆచరించే నమాజ్ ని జుహర్ నమాజ్, లేదా నమాజ్ ఎ జుహర్, లేదా సలాతుల్ జుహర్ (అరబ్బీ) అని అంటారు.
  • అసర్  : అసర్ అనగా మధ్యాహ్నము, సూర్యాస్తమయ సమయానికి మధ్య గల సమయం, సాయంకాలం. ఈ సమయంలో ఆచరించే నమాజిని అసర్ నమాజ్, నమాజె అసర్, సలాతుల్ అసర్ (అరబ్బీ) అని అంటారు.
  • మగ్రిబ్  : మగ్రిబ్ అనగా సూర్యాస్తమయ సమయం. ఈ సమయంలో, సూర్యుడు అస్తమించిన వెనువెంటనే ఆచరించే నమాజ్. దీనిని మగ్రిబ్ నమాజ్, నమాజె మగ్రిబ్, సలాతుల్ మగ్రిబ్ (అరబ్బీ) అని అంటారు.
  • ఇషా : సూర్యాస్తమయ సమయం నుండి, అర్ధరాత్రి వరకు ఆచరించే నమాజుని ఇషా నమాజ్, నమాజె ఇషా, సలాతుల్ ఇషా (అరబ్బీ అని అంటారు.
    • నమాజులో ఆచరించు రకాతుల పట్టిక :
మరింత సమాచారం పేరు, సమయం (వక్త్) ...
పేరు సమయం (వక్త్) ఫర్జ్ కు ముందు ఐచ్ఛికం1 విధిగా ఆచరించు నమాజ్ ఫర్జ్ కు తరువాత ఐచ్ఛికం1
సున్నీ షియా సున్నీ షియా
ఫజ్ర్ (فجر) సూర్యోదయానికి 10-15 నిముషాలు
ముందు ఆచరించే నమాజ్
2 రకాత్‌లు
సున్నత్-ఎ-ముఅక్కదహ్2
2 రకాత్‌లు 2 2 రకాత్‌లు 1 2 రకాత్‌లు 1,3,7
జుహ్ర్ (ظهر) మధ్యాహ్న సమయం 4 రకాతులు
సున్నత్-ఎ-ముఅక్కదహ్2
4 రకాతులు 4 రకాతులు4 2 రకాతులు
సున్నత్-ఎ-ముఅక్కదహ్2
8 రకాతులు 1,3,7
అస్ర్ (عصر) సాయంకాల సమయం5&6 4 రకాత్‌లు
సున్నత్-ఎ-గైర్-ముఅక్కదహ్
4 రకాత్‌లు 4 రకాత్‌లు - 8 రకాత్‌లు 1,3,7
మగ్రిబ్ (مغرب) సూర్యాస్తమయ సమయం వెనువెంటనే 2 రకాత్‌లు
సున్నత్-ఎ-గైర్-ముఅక్కదహ్
3 రకాత్‌లు 3 రకాత్‌లు 2 రకాత్‌లు సున్నత్-ఎ-ముఅక్కదహ్2 2 రకాత్‌లు 1,3,7
ఇషా (عشاء) సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు

అర్ధరాత్రి తరువాత ఇషా నమాజ్ చదవడం 'మక్రూహ్'6

4 రకాత్‌లు
సున్నత్-ఎ-గైర్-ముఅక్కదహ్
4 రకాత్‌లు 4 రకాత్‌లు 2 రకాత్‌లు
సున్నత్-ఎ-ముఅక్కదహ్, 2
3 రకాత్‌లు విత్ర్
2 రకాత్‌లు 1,3,7
మూసివేయి
Thumb
నమాజు సమయాలు పగలు రాత్రుల వెలుగు చీకట్ల ఆధారంగా. I. ఫజ్ర్, II. జుహర్, III. అస్ర్, IV. మగ్రిబ్, V. ఇషా

నమాజుల రకాలు

ప్రత్యేక నమాజులు

  • ఇష్రాఖ్ : * చాష్త్  : సూర్యోదయ సమయాన ఆచరించే నమాజ్.
  • తస్ బీహ్ - (సలాతుత్-తస్బీహ్) : అల్లాహ్ ను స్తుతిస్తూ (తస్బీహ్) ఆచరించే ఇష్టపూరితమైన నమాజ్.
  • హాజత్  : జీవన అవసరాల పరిపూర్తికై, అల్లాహ్ ను వేడుకుంటూ ఆచరించే నమాజ్.
  • తహజ్జుద్  : అర్థరాత్రి దాటిన తరువాత ప్రశాంతతతో ఆచరించు నమాజ్.
  • ఖజా : ఏదైనా ఒక పూట నమాజ్ తప్పిపోతే, ఆతరువాత దానిని ఆచరించేదే "కజా నమాజ్"
  • జుమా : శుక్రవారం, జుహర్ నమాజు నే జుమా నమాజు అంటారు. ప్రతిదినం జుహర్ నమాజులో 4 రకాతుల ఫర్జ్ నమాజు ఆచరిస్తే, జుమా నమాజ్ లో 2 రకాత్ ల ఫర్జ్ నమాజ్ నే ఆచరిస్తారు. మిగతా 2 రకాతుల బదులు ఖుత్బా (ప్రవచనం-ప్రసంగం) ఆచరిస్తారు.
  • జనాజా నమాజ్ : ఎవరైనా చనిపోతే, ఖనన సంస్కారానికి ముందు 2 రకాతుల జనాజా (సజ్దా రహిత) జనాజా నమాజ్ ను ఆచరిస్తారు. దీనిని మస్జిద్లో లేదా ఖబ్రస్తాన్లో సామూహికంగా ఆచరిస్తారు.[11]
  • సలాతుల్- ఖుసఫ్ : సూర్య చంద్ర గ్రహణాల సమయాలలో "సలాతుల్-ఖుసుఫ్" సామూహిక ప్రార్థనలు ఆచరిస్తారు.[12]
  • తరావీహ్ : రంజాన్ నెలలో ప్రతిరోజూ "ఇషా" నమాజ్ తరువాత చదివే నఫిల్ నమాజ్ నే తరావీహ్ నమాజ్ గా వ్యవహరిస్తారు.

నమాజు చేయు స్ఠలాలు

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.