From Wikipedia, the free encyclopedia
పర్షియన్ (فارسی) నాటి పర్షియా దేశం, నేటి ఇరాన్ దేశములో మాట్లాడేభాష. దీనికి పారసీ, పార్శీ, ఫార్శీ అనేపేర్లుగూడా గలవు. ఇది ఇండో-యూరోపియన్ భాషకు చెందిన శాఖ అయిన ఇండో-ఇరానియన్ భాష. ఈ భాష మాట్లాడే దేశాలు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్,, తజకిస్తాన్, ఈ దేశాలలో అధికారిక భాష.
పర్షియన్ فارسی | ||
---|---|---|
ఫార్సీ (Fārsi) పర్సో-అరబిక్ లిపియైన నస్తలీఖ్ శైలిలో): | ||
ఉచ్ఛారణ: | [farˈsi] | |
మాట్లాడే దేశాలు: | ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, , బహ్రెయిన్. ఇంకనూ ఇరానియన్, ఆఫ్ఘన్, ఉజ్బెగ్, , తజకిస్తానీ, diaspora communities in the USA, Pakistan, Russia, Germany, Canada, Turkmenistan, France, Spain, Sweden, UAE, Kuwait, Bahrain, Qatar, భారత దేశము, Israel, Brazil and Turkey. | |
ప్రాంతం: | Middle East, Central Asia | |
మాట్లాడేవారి సంఖ్య: | ca. 56,000,000 native (2006 estimates)[1]మూస:1 | |
ర్యాంకు: | 22వ (native speakers) [2] | |
భాషా కుటుంబము: | Indo-European ఇండో-ఇరానియన్ ఇరానియన్ పశ్చిమ ఇరానియన్ నౌరుతి ఇరానియన్ పర్షియన్ | |
అధికారిక స్థాయి | ||
అధికార భాష: | ఇరాన్ Afghanistan Tajikistan | |
నియంత్రణ: | Academy of Persian Language and Literature Academy of Sciences of Afghanistan | |
భాషా సంజ్ఞలు | ||
ISO 639-1: | fa | |
ISO 639-2: | per (B) | fas (T) |
ISO 639-3: | variously:fas — Persianprs — Eastern Persianpes — Western Persiantgk — Tajikaiq — Aimaqbhh — Bukharicdeh — Dehwaridrw — Darwazihaz — Hazaragijpr — Dzhidiphv — Pahlavani | |
గమనిక: ఈ పేజీలో IPA ఫోనెటిక్ సింబల్స్ Unicodeలో ఉన్నాయి. |
భారతదేశంలోని అనేక షియా మతస్తులు, జొరాస్ట్రియన్ మతస్తులు మాట్లాడే భాష. మన రాష్ట్రంలో హైదరాబాదు నగరంలో అనేకులు ఈ భాషను మాట్లాడేవారున్నారు. మన దేశంలో, మన రాష్ట్రంలోని అనేక విశ్వవిద్యాలయాలలో ఈ భాషా విభాగమూ గలదు.
ప్రఖ్యాత ఫార్శీ కవులు షేఖ్ సాదీ, మౌలానా రూమీ, ఒమర్ ఖయ్యాం, మిర్జా గాలిబ్, ఇక్బాల్ మొదలగువారు.
13వ శతాబ్దం దక్షిణాసియా లోని ముస్లింల పరిపాలనా రాజుల సభలలో సభా భాషగా ఇండో-ఆర్యన్ (హిందూ-ఆర్యన్) ల మాండలికంగా ప్రారంభమయినది. ఢిల్లీ సుల్తానుల, మొఘల్ సామ్రాజ్యపు అధికార భాషగా ఉర్దూ విరాజిల్లినది. నాగరిక, సాహిత్య పద్యరూపాలకు పరిపూర్ణభాషగా పర్షియన్ ఉపయోగంలో వుండేది. మతపరమయిన ధార్మికపరమయిన భాషగా అరబ్బీ వుండేది. ఢిల్లీసుల్తానుల కాలంలో దాదాపు అందరు సుల్తానులు అత్యున్నత పదాధికారులందరూ మధ్యాసియాకు చెందిన పర్షియన్-తురుష్కులే. వీరి మాతృభాష చొఘ్తాయి లేదా టర్కిక్ భాష. మొఘలులుకూడా మధ్యాసియాకు చెందిన పర్షియన్ లే. వీరి ప్రథమభాష టర్కీ, తరువాత వీరు పర్షియన్ (పారసీ, ఫారసీ భాష) భాషను తమభాషగా ఉపయోగించసాగారు. మొఘలులకు పూర్వం, పర్షియన్ భాష అధికార భాషగాను సభ్యతా, సాహితీభాషగా పరిగణించబడింది. బాబరు మాతృభాష టర్కీ, టర్కీభాషలోనే బాబరు తన రచనలు చేశాడు. ఇతని కుమారుడు హుమాయూన్ కూడా టర్కీభాషనే అవలంబించాడు. మొఘల్ కాలపు హిందూ-పర్షియన్ చరిత్రకారుడు మొఘల్ పరిపాలనా, అక్బర్ పరిపాలనా కాలంలో పర్షియన్ భాష తన సభ్యతా విశాలధృక్పదాలు సరళతాకారణాలవల్ల ప్రధాన భాషగా ఆమోదం పొందిన భాషగా వర్ణిస్తాడు. టర్కీ, పర్షియన్, బ్రజ్ భాష, హిందవి, హర్యానవి, హిందీ భాషల సమ్మేళనభాషగా ఉర్దూ జన్మించింది. ఈ భాష దక్షిణాసియాలో ప్రధానంగాను, ప్రపంచమంతటా పాక్షికంగాను వాడుకలోయున్నది. ఢిల్లీ, హైదరాబాదు, కరాచి, లక్నో లాహోర్ లలో తనముద్రను ప్రగాఢంగా వేయగల్గింది.
భాష –క్రీ.పూ 6వ శతాబ్ది నుంచి పారశీక భాష ఉన్నట్లు తెలుస్తోంది .ఇప్పుడు ఇరాను దేశంలో వాడుక భాష, శాసనసభ విశ్వవిద్యాలయ బోధనకు, అధికార ప్రకటనలకు, పత్రికలకు సామాన్య సాహిత్యానికీ అదే భాష .అభయ మెనిడ్ రాజులచేత వాళ్ళ స్మారక చిహ్నాలలో రాయబడిన పాత పారశీకమే ఇది .బెహిస్తూన్ పర్వతం పై ఎత్తుగా ఉంచబడిన డేరియస్ ప్రకటన చాలా పేరుపొందించి, ఇక్కడి శాసన వ్యాకరణ భాషకు అవెస్తా సంస్కృతలో ఉన్న భాషకు సన్నిహిత సంబంధం ఉన్నది .
మధ్య పారశీ లేక పహ్లవి –అలక్జాండర్ సామ్రాజ్య పతనం తర్వాత పర్షియాను పార్దియన్లు పాలించారు .వీరిని బట్టే పహ్లవి అనే మాండలీకానికి ఆ పేరు వచ్చింది .కొన్ని శాసనాల్లో, మత గ్రంథాలలో, నాణాలపైనా కనబడే భాష అదే అంటారు .ఫార్సు రాష్ట్రంలో ఏర్పడిన పాత పారసీ పరిణామ దశలో ఇది ఒకటి .
ఇస్లామిక్ పారసీ -7వ శతాబ్దిలో ఇస్లాం మతం అవలంబించటం పర్షియా దేశం కాలి ఫేట్ కు వశమవటం జరిగాక, అరబ్బీ భాష తప్పని సరి అయింది .పారసీ రచయితలూ అరబ్బీ నుండి విరివిగాపదాలు వాడే అవకాశం కలిగింది .నిత్యవ్యవహారాలు పార్సీలోనే జరిగేవి .ఇప్పుడు సామాన్యజనం పాడుకొనే పాటలుకూడా ఆభాషలో రాసినవే .పద్యంలో అరబ్బీ పదాలు తక్కువే .గద్యంలో విపరీతం .పరదేశీయులు పాలించినా పార్సీ వారి భాషలలో లీనంకాకపోవటం ప్రత్యేకత .అరబ్బీ పదాలను అరువు తెచ్చుకొన్నా వ్యాకరణమర్యాద నిలుపుకున్నది .వాక్యంలో పదాలన్నీ అరబ్బీ అయినా, క్రియలు, పదాలక్రమం మాత్రం పారసీ లక్షణాలతో ఉంటుంది .
వర్తమానకాలంలో పత్రికలలో, ఉత్తరప్రత్యుత్తరాలలో, నవలలో వాడే భాష ప్రాచీన పార్సీ, వ్యావహారిక భాష, ఫ్రెంచ్ జర్మన్, ఇంగ్లిష్ మొదలైన పాశ్చాత్యపదాల కలగా పులగం .దీనికీ,11 వ శతాబ్ది భాషకు పెద్దగ తేడా లేదు .కొత్తపదాలు చాలా చేరాయి .పదాలా అర్ధాలు కూడా మారాయి.అంటారు.
మహమ్మద్ గజని సామ్రాజ్యంలో బుఖారా, సమర్ఖండ్అనే పెద్ద పట్టణాలున్నాయి .ఇక్కడి నుంచే ఇస్లాం లోని పారశీక సంస్కృతి ఇండియాకు, టర్కీకి వ్యాపించింది .క్రీశ 1000లో టర్కోమాన్ ప్రాంతాలన్నీ ముస్లిం ప్రభావంలో ఉన్నాయి .స్థానిక భాషలలో చేరిన అపరిచిత పదాల అర్ధాలు పారశీ ద్వారా వివరించాల్సి వచ్చేది .మతపరివర్తన ప్రయోజకులు పారశీనే వాడేవారు .ఆసియా మైనర్ లోని ‘’ఆటోమన్’’నాయకులు ఉత్తరప్రత్యుత్తరాలకు పారశీ నే వాడేవారు .టర్కీలో వచ్చిన మొదటి సాహిత్యం పారశీలోనే వచ్చింది .టర్కీకవులు పార్శీ మూలం లోని పేరున్న ఛందస్సులు, ప్రక్రియలనుమాత్రమేకాక, విశేష పద సంపదకూడా తీసుకొన్నారు .ఇప్పటికీ గ్రాంధిక టర్కీలో పారశీ ఎక్కువే.
డేరియస్ తోనే పారశీ సాహిత్యం మొదలైంది .అతడు బెహేస్తూన్ కొండలమీదా, నాణాలమీదా, కిర్మాన్ షామతగ్రంధం లో తన ఆజ్ఞలనుపారషీ భాషలో చెక్కించాడు .జోరాస్టర్ మత గ్రంథం కూడా ఈ భాష లోనే ఉంది .అవెస్తా అనేది గ్రంథంమాత్రమేకాదు, మా౦డలికంకూడా .దీనికీ, సంస్కృతానికి సంబంధం ఉన్నది .ఇప్పుడు లభించింది 21గ్రంథాలతో కూడిన మూలగ్రంథం ఒక భాగం మాత్రమే .ఇంకో భాగం ఉన్నది .అవెస్తా మూలం, అవేస్తాఖర్డు అనే ప్రార్థనలు .పహ్లవి వాజ్మయంలో మూలం మాత్రమే నిల్చి ఉంది .దీనిలో దీన్ కార్డ్, మైన్యో ఐ ఖిరాద్ అనేవి పేరుపొందాయి .వీటి ముఖ్యత తర్వాత రచనల పరిణామం గురించి చదివేటప్పుడు తెలుస్తుంది .యత్కాలే జరిరాన్, ఇందార్స్ ఏ –ఖుస్రని, గవటాన్, కార్నమక్ఎ-అర్దీ షెర్ అనేవికూడా ముఖ్యమైనవే. ఫిరదౌసి కవి రాసిన ఇతిహాసానికి మూలమైనవి సెసెనియన్ కవిత్వంలో ఏమీ మిగలలేదు .
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.