దివాకర్ బాబు

From Wikipedia, the free encyclopedia

దివాకర్ బాబు

దివాకర్ బాబు రంగస్థల, సినిమా రచయిత. 100 కి పైగా సినిమాలకు రచయితగా పనిచేశాడు. శుభలగ్నం, యమలీల, ఘటోత్కచుడు, మావిచిగురు, చూడాలనివుంది, ఆహ్వానం, మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు వంటి సూపర్‌హిట్ సినిమాలకు మాటలందించాడు.

త్వరిత వాస్తవాలు దివాకర బాబు మాడభూషి, జననం ...
దివాకర బాబు మాడభూషి
Thumb
జననం1951
గుంటూరు జిల్లా
ప్రసిద్ధిరంగస్థల, సినిమా రచయిత
మూసివేయి

జననం

దివాకర్ బాబు 1951 లో తాడేపల్లిగూడెంలో జన్మించారు. గుంటూరులో పెరిగారు. ఈయన తండ్రి కూడా నాటకరంగంలో పనిచేశారు. వీరి తాత, ఇంకా ఇతర కుటుంబ సభ్యులు కూడా రచనా వ్యాసంగంలో ఉన్నారు.[1]

వ్యక్తిగత జీవితం

ఆయనకు చిన్నప్పటి నుంచి నాటకాలంటే అభిమానం ఉండేది. దివాకర బాబు ముందు కరూర్ వైశ్యా బ్యాంకులో ఉద్యోగం చేసేవారు. ఉద్యోగం చేస్తూనే నాటకాలు రాయడం, పరిషత్తు పోటీల్లో పాల్గొనడం, ప్రదర్శనలు ఇవ్వడం చేసేవారు. అసురగణం, ఎవ్వనిచే జనించు, పుటుక్కు జరజర డుబుక్కుమే, కుందేటికొమ్ము మొదలైన నాటికలు... రసరాజ్యం వంటి నాటకాలు రచించారు.

మద్రాసు వెళ్ళి దర్శకుడు రేలంగి నరసింహారావును కలిసి, ఒక కథ చెప్పారు. అది ఆయనకు నచ్చి దాన్ని అభివృద్ధి చేసి మద్రాసుకు వచ్చేయమన్నారు. అలా కొంటెకాపురం సినిమాతో సినిమా రచయిత అయ్యారు. తర్వాత మన్మధ లీల – కామరాజు గోల, డబ్బెవరికి చేదు లాంటి చిత్రాలకు మాటలు రాశాడు. మెల్లగా సినిమా అవకాశాలు పెరగడంతో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశారు. రేలంగి నరసింహారావు, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ, ఎస్వీ కృష్టారెడ్డి, ముత్యాల సుబ్బయ్య, రవిరాజ పినిశెట్టి, గుణశేఖర్ వంటి దర్శకులతో పనిచేశారు.

ఆయన తనయుడు శ్రీకర్ బాబు కూడా సినిమా రంగంలోకి ప్రవేశించాడు.[2]

సినిమాలు

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.