వినోదం (సినిమా)
From Wikipedia, the free encyclopedia
వినోదం 1996 లో విడుదలైన ఒక హాస్యభరిత చిత్రం. ఈ సినిమాకు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించగా శ్రీకాంత్, రవళి ప్రధాన పాత్రలు పోషించారు.
వినోదం | |
---|---|
![]() | |
దర్శకత్వం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
రచన | [[దివాకర్ బాబు]] |
నిర్మాత | కె. అచ్చిరెడ్డి |
తారాగణం | శ్రీకాంత్, రవళి |
ఛాయాగ్రహణం | టి. శరత్ |
కూర్పు | రాంగోపాల్ రెడ్డి |
సంగీతం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
నిర్మాణ సంస్థ | మనీషా ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 2 ఆగస్టు 1996[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సంభాషణలు : దివాకర బాబు
కథ
రాజా, అతని స్నేహితులు కలిసి చింతామణి అనే ఇంట్లో అద్దెకుంటుంటారు. చింతామణికి అద్దె ఎగ్గొట్టడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అల అని పిలవబడే అష్టలక్ష్మి ధనవంతుడైన బంగారం కూతురు. కూతురు పుట్టాక తనకు బాగా కలిసొచ్చిందని ఆమె ఏదడిగితే అది కాదనకుండా ఇస్తుంటాడు బంగారం. ఈమెకు స్వేచ్ఛగా తిరగడం అంటే ఇష్టం. అలా బయట తిరుగుతున్నపుడు రాజా, అతని మిత్రబృందం తో పరిచయం ఏర్పడుతుంది. రాజా, అష్టలక్ష్మి ఒకరినొకరు ప్రేమించుకుంటారు.
నటీనటులు
- రాజా గా శ్రీకాంత్
- అష్టలక్ష్మి అలియాస్ అల గా రవళి
- బంగారం గా కోట శ్రీనివాసరావు
- చింతామణి గా తనికెళ్ళ భరణి
- ప్రకాష్ రాజ్
- ఏవీయస్
- బ్రహ్మానందం
- బాబు మోహన్
- శివాజీ రాజా
- బండ్ల గణేష్
- ఉత్తేజ్
- వై. విజయ
- రాళ్ళపల్లి
- మల్లి గా మల్లికార్జున రావు
- గుండు హనుమంతరావు
- గౌతంరాజు
- మధుమణి
పాటలు
- హై లైలా ప్రియురాలా , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- మల్లెపూల వాన జల్లుల్లోనా ,రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- కమ్మగా సాగే స్వరమా , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర , శ్రీనివాస కార్తీక్, ఆర్. కళ
- చలాకీ కలువ కలువ , రచన: భువన చంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,
- జింగిలాలో ఏం గింగిరాలో, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
పురస్కారాలు
ఈ సినిమాలో నటనకు గాను బ్రహ్మానందం కు ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం లభించింది.[2]
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.