Remove ads
బీహార్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
బీహార్ జిల్లాలలో దర్భంగా జిల్లా (ఉర్దు:ضلع دربھنگہ)', (హిందీ: दरभंगा जिला) ఒకటి. దర్భంగా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. దర్భంగా జిల్లా దర్భంగా డివిజన్లో భాగం. జిల్లావైశాల్యం 2,279 చ.కి.మీ.
Darbhanga జిల్లా
दरभंगा ज़िला ضلع دربنگا | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | దర్భంగా |
ముఖ్య పట్టణం | దర్భంగా |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | దర్భంగా |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,279 కి.మీ2 (880 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 39,21,971 |
• జనసాంద్రత | 1,700/కి.మీ2 (4,500/చ. మై.) |
• Urban | 8.7 % |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 58.26 % |
• లింగ నిష్పత్తి | 910 |
ప్రధాన రహదార్లు | NH 57, NH 105 |
Website | అధికారిక జాలస్థలి |
సరిహద్దు వివరణ | జిల్లా |
---|---|
ఉత్తర సరిహద్దు | మధుబని జిల్లా |
దక్షిణ సరిహద్దు | సమస్తిపూర్ |
తూర్పు సరిహద్దు | సహర్సా జిల్లా |
పశ్చిమ సరిహద్దు | సీతామఢీ జిల్లా, ముజఫర్‌పూర్ జిల్లా |
1976 దర్భంగా ప్రాంతం రెండు భాగాలుగా విభజించబడింది :- మధుబని జిల్లా, సమస్తిపూర్ జిల్లా [1]
దర్భంగా జిల్లా వైశాల్యం 2279 చ.కి.మీ.[2] ఇది ఇండోనేషియాలోని యాపెన్ ఐలాండ్ వైశాల్యానికి సమానం.[3] జిల్లాలో కొండలతో విభజించబడిన విస్తారమైన మైదానం ఉంది. ఉత్తర నుండి దక్షిణం వైపుగా ఏటవాలుగా ఉంటుంది. జిల్లా సహజసిద్ధంగా నాలుగు విభాగాలుగా విభజించబడింది. తూర్పు విభాగంలో ఘనశ్యాంపూర్, బైరౌల్, కుషేశ్వర్ మండలాలు ఉన్నాయి. ఈ విభాగంలో కోసీ నది తీసుకువచ్చే సారవంతమైన మట్టి అధికంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో కోశీనది ప్రవహిస్తుంది. రెండవ పంచ వార్షిక ప్రణాళికలో భాగంగా నదీతీరనిర్మాణం జరిగేవరకు ఈ నదికి వరదలు సంభవిస్తూ ఉండేవి. ఇది ఇసుకతో కూడిన చిత్తడి నేలలను విస్తారంగా కలిగి ఉంది. రెండవ విభాగంలో బుర్హి గంధక్ నది ప్రవహిస్తుంది. ఇక్కడ వ్యవసాయభూములు అధికంగా ఉన్నాయి. జిల్లాలోని ఇతర భూభాగాల కంటే ఇవి ఎత్తుగా ఉంటాయి. ఇక్కడ చాలా స్వల్పంగా చిత్తడి భూములు ఉంటాయి. ఇది రబి పంటలకు చాలా అనుకూలంగా ఉంటుంది.మూడవ విభాగం బుర్హి గంధక్, బఘమతి నదుల మైదానం. ఇది చాలా దిగువన ఉంటుంది. ఇందులో అక్కడక్కడా చిత్తడి భూములు ఉంటాయి. ఈ భూభాగంలో సంవత్సరమంతా వరదలు సంభవిస్తూ ఉంటాయి. నాలుగవ విభాగంలో సాదర్ సబ్‌డివిజన్ ఉంది. ఇక్కడ అనేక శెలయేర్లు ఉన్నాయి. ఇందిలో ఎగువభూములు ఉన్నాయి.
జిల్లాలో విద్యావంతులు, తాత్వికవాదులు అధికంగా ఉన్నారు. జిల్లాలో అనేక పాఠశాలలు, కాలేజీలు విద్యార్థులకు ఉన్నతస్థాయి విద్యను అందిస్తున్నాయి. జిల్లాలో విద్యా మూలాలు బలీయంగా ఉన్నాయి. గ్రామస్థాయి విద్యకూడా దేశంలో ప్రథమ స్థాయిలో ఉన్నాయి. ప్రత్యేకంగా సైన్స్ విభాగంలో జిల్లాలో ఉన్నతస్థాయి విద్య లభిస్తుంది.
జిల్లాలోని పాఠశాలలలో ఎ.సి ఉన్నత పాఠశాల (కర్షన్) అధిక ప్రాముఖ్యత కలిగి ఉంది. మద్యయుగంలో దియోధిలో భూస్వామిగా ఉన్న అదిస్తానీ చౌదరి పేరుతో ఈ స్కూల్ స్థాపించబడింది.
జిల్లాలో హిమాలయాలలో జన్మించిన పలు నదులు ప్రవహిస్తున్నాయి. జిల్లాలో ప్రధానంగా బఘమతి, చోటా బఘమతి, కామ్లా, తిల్జుగా నదులు ప్రవహిస్తున్నాయి. బఘమతీ నది ముజఫర్‌పూర్ జిల్లా నుండి దర్భంగా జిల్లాలో ప్రవేశిస్తుంటాయి. బఘమతీ నదీ ప్రవాహాలు జిల్లాకు, సమస్తిపూర్ జిల్లాకు మద్య సరిహద్దును ఏర్పరుస్తున్నాయి. ఇది ఆగ్నేయంగా ప్రవహించి రొసేరా వద్ద బుర్హి గంధక్ నదితో సంగమిస్తుంది. చోటా బఘమతి నది మధుబని జిల్లా గుండా ప్రవహించి పాలి సమీపంలో దర్భంగా జిల్లాలో ప్రవేశిస్తుంది. ఇది దర్భంగా నగరంలో ప్రవహిస్తూ హయాఘాట్ చేరుకుని బఘమతీ నదిలో సంగమిస్తుంది. కామ్లా నది జిల్లాలోని సింగర్ పండౌల్ వద్ద ప్రవేశిస్తుంది. తరువాత తూర్పుగా ప్రవహించి రొసేరా మండలంలోని ఆగ్నేయంలో తిల్జుగా నదితో సంగమిస్తుంది. తిల్జుగా నది దర్భంగా జిల్లా తూర్పు సరిహద్దును ఏర్పరిస్తుంది.
జిల్లాలో పలు నీటి మడుగులు ఉన్నాయి. జిల్లా నీటి మడుగులకు ప్రసిద్ధి. జిల్లాలో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నీటి మడుగులు ఉన్నాయి. జిల్లాలోని ప్రధాన నీటిమడుగులలో ఒకటైన మూనా పొఖైర్ కుర్‌సన్ గ్రామంలో ఉంది. 1700 లో తర్ది మండలంలో జమీందార్ నేహల్ సింగ్ చిత్రీకరింపజేసిన ఏడు మానవ శిరసులు కూడా జిల్లాలోని ప్రత్యేక ఆకర్షణలలో ఒకటిగా గుర్తించబడుతుంది.
.
విషయ వివరణ | వాతావరణ వివరణ |
---|---|
శీతాకాలం గరిష్ఠ ఉష్ణోగ్రత | ° సెల్షియస్ |
శీతాకాలం కనిష్ఠ ఉష్ణోగ్రత | ° సెల్షియస్ |
అత్యంత శీతల మాసం | |
వాతావరణ విధానం | |
వేసవి కాలం గరిష్ఠ ఉష్ణోగ్రత | ° సెల్షియస్ |
వేసవి కాలం కనిష్ఠ ఉష్ణోగ్రత | ° సెల్షియస్ |
అత్యంత ఉష్ణ మాసం | |
వర్షపాతం | మి.మీ |
అత్యధిక వర్షపాతం | |
అక్షాంశం | ఉత్తరం |
రేఖాంశం | తూర్పు |
విషయ వివరణ | వాతావరణ వివరణ |
---|---|
వాతావరణ విధానం | పొడిగా ఉంటుంది. |
వేసవి | మార్చి- జూన్ సగం |
అత్యధిక ఉష్ణమాసం | మే |
వర్షాకాలం | జూన్ చివరి భాగం - అక్టోబరు (92%) |
శీతాకాలం | నవంబరు- ఫిబ్రవరి |
గరిష్ఠ ఉష్ణోగ్రత | 47 ° సెల్షియస్ |
కనిష్ఠ ఉష్ణోగ్రత | ° సెల్షియస్ |
వర్షపాతం | 1142.3 మి.మీ |
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో దర్భంగా జిల్లా ఒకటి అని గుర్తించింది. .[4] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]
జిల్లా ప్రధానంగా ప్రజలకు అధికంగా వ్యవసాయం జీవనోపాధిగా ఉంది. జిల్లాలో అత్యధిక సంఖ్యలో విద్యావంతులు ఉన్నారు. వీరు డాక్టర్, ఇంజనీర్, ప్రభుత్వ ఉద్యోగాలు, అధికంగా ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్ అఫ్హికారులు ఉన్నారు.
జిల్లాలో ప్రధానంగా వరి పండించబడుతుంది. అదనంగా గోధుమ, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనె గింజలు, చెరకు పండించబడుతుంది. జిల్లాలో మామిడి పంటకు ప్రసిద్ధిచెందింది. జిల్లాలో చాలా మామిడి తోటలు ఉన్నాయి. అక్బర్ పాలనలో జిల్లాలోని లఖిబాగ్లో ఒక లక్ష మామిడి చెట్లు నాటించబడ్డాయి.
జిల్లాలో ప్రధానంగా పేపర్ మిల్లులు, చక్కెర మిల్లులు, చేనేత మగ్గాలు ఉన్నాయి.
విషయాలు | వివరణలు |
---|---|
విభాగాలు | 3 దర్భంగా సాదర్, బెంజూర్, బిరౌల్ |
మండలాలు | 18 దర్భాంగా జాలే సింఘ్వార, కెవొతి, మనిగచ్హి, తర్దిహ్, ఆలినగర్, బెనిపూర్, ఆషాపూర్, బెహెర, బసుహం, బహదూర్‌పూర్, హనుమాన్ నగర్, హయఘత్, బహెరి, బిరౌల్, ఘన్ష్యంపూర్, కిరత్పూర్, గౌర బౌరం, కుషెశ్వరస్థాన్ (కొత్తగా మనిగచి బ్లాక్ నుండి విభజించబడింది), కుషెశ్వరస్థాన్ తూర్పు. |
పంచాయితీ గ్రామాలు | 329 |
గ్రామాలు | 1269 |
పోలీస్ స్టేషన్లు | 23 |
అసెంబ్లీ స్థానాలు | 10 |
లోనే పార్లమెంటు నియోజకవర్గం | మనిగచ్చి, బహెరా, దర్భాంగా రూరల్ (ఎస్.సి ), దర్భాంగా కెయోటి, హయాఘాట్ |
మధుబని పార్లమెంటు నియోజకవర్గం | జలే |
రొసేరా పార్లమెంటు నియోజకవర్గం | ఘనష్యాంపూర్, బహెరి, సింఘియా |
జిల్లాలోని ప్రధాన గ్రామాలు :- హబిభౌఅర్, హరిహర్‌పుర్, పిండారుచ్, దెవ్కులి ధామ్, పైథాన్ కబై, బqఉఇ పుర్ మహెష్పత్తి, కలిగఒన్, కన్సి, పందఒల్, పాంతోబ్, రజరౌల్య్-రాంపూర్ రౌల్య్, బల్భద్రపుర్, గోవింద్పూర్, ఢరర్, కొఇలఖ్, కారజ్, నెహ్రా, సహోరా, కబిల్పుర్, బహదూర్‌పూర్, ఆనంద్‌పూర్, శ్రీ రాంపూర్, దెఒకులి, రంభద్రపుర్, ఉగ్రారా, పతొరె, ఘన్ష్యంపుర్ (హయ్యర్ క్యాడర్ సేవలు ప్రసిద్ధి), రసీరి, తతూర్, ఆంతౌర్ గల్మ మొహంపుర్, కంతొల్, కొథ్రం, దొధియ, బాల్హా, ధెరుక్, మాహినమ్, పోహడీ, సఖ్వర్ (మందన్ మిశ్రా ప్రసిద్ధి), మురైథ, కథ్ర, ఈ అహ్త (సురేందర్ కుమార్ ఝ పాలు ఉత్పత్తికి ప్రసిద్ధి) ఆఉందౌల్య్ తుమౌల్, మంచి ఖర్క అని పిలుస్తారు, బెలౌనె, మక్రంపుర్, పుతై, దద్పత్తి, కస్రౌర్, కుర్సొన్ నదియమి, థెంఘ, బసంత్, (మఖన ప్రసిద్ధి) నవాదా, ఘొంఘీ జాలే సమీపంలో బసంత్.
జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల జాబితా :-
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 3,921,971,[5] |
ఇది దాదాపు. | లిబరియా దేశ జనసంఖ్యకు సమానం.[6] |
అమెరికాలోని. | ఒరెగాన్ నగర జనసంఖ్యకు సమం.[7] |
640 భారతదేశ జిల్లాలలో. | 64 వ స్థానంలో ఉంది.[5] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1721 .[5] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 19%.[5] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 910:1000 [5] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 58.26%.[5] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
విషయాలు | వివరణలు |
---|---|
జనసంఖ్య | 3,985,493 |
గ్రామీణ జనసంఖ్య | 3,018,639 |
నగరప్రాంత జనసంఖ్య | 306,089 |
1991 అక్షరాస్యత | 44.32% (పురుషులు 57.18%, స్త్రీలు 30.35%). |
హిందువులు | 19,55,068 |
ముస్లిములు | 5,55,429 |
సిక్కులు | 198 |
బౌద్ధులు | 26 |
జైనులు | 27 |
క్రైస్తవులు | 141 |
ప్రధాన భాషలు | మైథిలి, హిందీ, ఉర్దూ |
సంభాషణా భాష | ఆగ్లం |
దర్భంగా బీహార్ రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా ఉండేది. జనపద కళలకు దర్భంగా జిల్లా ప్రఖ్యాతిగాంచింది. జిల్లాలోని మధుబని కళ (మిథిల పెయింటింగ్) కళ జిల్లాకు ప్రత్యేకత తెచ్చింది. మిథిల భూభాగంలోని జానపద నాటక శైలి జిల్లాలో ప్రజాదరణ కలిగి ఉంది. వీటిలో నైతంకి, నతుయా నాచ్, సమ చకెవా, మధుశ్రావణి (కొత్తపెళ్ళి కూతురు) ప్రధానమైనవి.
జిల్లాలో సివిలియన్ భాషవాడుకలో ఉంది. జిల్లా ప్రజలు మతం, కులం గురించి బలంగా విశ్వసిస్తున్నారు. జిల్లాలో శ్యామ మందిర్ (దర్భంగా రాజ్), హనుమాన్ మందిర్ (లహేరైసరై), మలేచమర్ధిని మందిర్ (దర్భంగా నగరం), అహిల్యా స్థాన్ మందిర్ (కాంతల్ చహుటా సమీపంలో), కుషేష్వర్ స్థాన్ మందిర్ (శివాలయం), విదేశ్వర్ స్థాన్ (శివాలయం), సింగేశ్వర్ స్థాన్ (శివాలయం), చరిత్రాత్మకమైన మహాదేవ్ మందిర్ (దియోకులి గ్రామం, నవ్తాల్ గ్రామాల సమీపంలో, దుర్గా స్థాన్, (నవ్దా గ్రామం) మొదలైన పలు ప్రముఖ ఆలయాలు ఉన్నాయి.
జిల్లాలో పలు ఉత్సవాలు, మేళాలు నిర్వహించబడుతున్నాయి. కార్తిక పూర్ణిమ మేళా, దసరా మేళా, జన్మాష్టమి మేళా, దీపావళి మేళా ఉత్సాహంగా నిర్వహించబడుతున్నాయి. పెళ్ళికూతురు కొరకు నిర్వహించబడే " సురత సభ " ద్వారా వివాహాలు నిర్ణయించబడుతుంటాయి.
జిల్లాలో మిథిల చేత్నా పరిషద్, ఆదర్శ్ కళా మంచ్ అనే రెండు కళాబృందాలు ఉన్నాయి. మిథిలా చేత్నా పరిషద్ మిథిలా భూభాగంలో కళాప్రదర్శనను అధికంగా నిర్వహిస్తుంది. వారు భారతదేశం అంతటా, విదేశాలలో మిథిలా సంస్కృతి, కళలను తెలియజేఉఅడానికి రంస్థల ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నారు. ఆదర్శ్ కళా మంచ్ (మహదూర్పూర్ మండలం; మదన్‌పూర్) ను అమెచ్యూర్ కళాకారులు, ప్రాంతీయ కళాకారులు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ మైథిలి నాటకం (మతం, సాంఘిక ఆధారిత కథాంశంతో) ప్రదర్శించడంలో వీరు నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. నిథులకొరత కారణంగా వీరి కార్యకలాపాలు ఆలయాలలో జరిగే చాత్, చిత్రగుప్త పూజ సమయాలకు పరిమితమయ్యాయి.
https://web.archive.org/web/20141206161929/http://villagebasant.blogspot.in/ [बसंत गाँव ]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.