Remove ads
బీహార్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో సీతామఢీ జిల్లా ఒకటి. సీతామఢీ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. సీతామఢీ జిల్లా తిరుహట్ డివిజన్లో భాగం.ఇది నేపాల్ సరిహద్దులో ఉంది..
సీతామఢీ జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | Tirhut |
ముఖ్య పట్టణం | Sitamarhi |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | సీతామఢీ |
• శాసనసభ నియోజకవర్గాలు | Riga, Bathnala, Parihar, Sursand, Bajpatti, Sitamarhi, Runnisaidpur, Belsand |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,294 కి.మీ2 (886 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 34,19,622 |
• జనసాంద్రత | 1,500/కి.మీ2 (3,900/చ. మై.) |
• Urban | 5.71 % |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 53.53 % |
• లింగ నిష్పత్తి | 899 |
ప్రధాన రహదార్లు | NH 104 |
సగటు వార్షిక వర్షపాతం | 1200 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
సీతామర్షి జీతాదేవి జన్మించిన ప్రదేశమని విశ్వసిస్తున్నారు. జితామర్హి పట్టణంలో సీతాదేవి ఆలయం ఉంది. . [1] సీతామర్షి వద్ద మౌర్యుల కాలం నాటి శిలాలయం ఒకటి ఉంది.[2]
1875లో ముజాఫర్ జిల్లాలో సీతామఢీని ఉప జిల్లాగా చేసారు.[3] 1972లో సీతామఢీకి పూర్తి స్థాయి జిల్లా అంతస్తు ఇవ్వబడింది.[4] ఈ జిల్లా బిహార్ రాష్ట్ర ఉత్తర భాగంలో ఉంది. ధుంరా పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. ఇది సీతామఢీకి 5 కి.మీ దూరంలో ఉంది. 1972]] లో ముజాఫర్ జిల్లా నుండి వేరుచేసి సీతామఢీకి పూర్తి స్థాయి జిల్లా అంతస్తు ఇవ్వబడింది..[5] 1994లో సీతామహి జిల్లా నుండి షెయోహర్ జిల్లాను రూపొందించారు..[5] ఈ జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్లో భాగం.[6] సీతామఢీలో హర్పురా గ్రామంలో " హజరత్ దత్తా షాహ్ రహముతుల్లా అలైహి " సమాధి ఉంది.
ఈ ప్రాంతంలో జనకుడు ఇంద్రుని ప్రీత్యర్ధం భూమిని త్రవ్వుతున్న సమయంలో సీదేవి భూమిలో నుండి ప్రత్యక్షమైందని పురాణకథనాలు వివరిస్తున్నాయి.
ప్రస్తుతం సీతామఢీ ప్రముఖయాత్రా స్థలంగా మారింది. సప్రదాయం, మిథాలజీ సమ్మిళితమైన సుందర ప్రాంతం ఇది. పురాణ ప్రాశస్త్యం కలిగిన ఈ ప్రదేశం హిందువులకు ప్రధాన యాత్రాగమ్యంగా ఉంది. ఇది అత్యంత సుందరంగా సంప్రదాయం, వారసత్వ సంపదకు చిహ్నంగా నిలిచింది. ఇక్కడ ఉన్న అద్భుతమైన ఆకర్షణ యాత్రీకులను మంత్రముగ్ధులను చేస్తుంది. సీతామఢీలో పురాతన సంప్రదాయం సమకాలీన ఆధునిక జీవనదరళి కలిసి అడుగులు వేస్తున్నాయి.
జిల్లా అంతటా ఉన్న అందమైన ఆలయాలతో కాంతి ధర్మల్ పవర్ స్టేషను, దర్భంగా, రాక్సుయల్, అరెరాజ్, మోతీహరి వంటి ఇతర ఆకర్షణలు కూడా ఉన్నాయి. జిల్లా ప్రకృతి సౌందర్యం, అనమైన నిర్మాణాలు పవిత్రమైన ఆలయాలు వైవిధ్యమైన ఆకర్షణలతో యాత్రీకులకు విహారయాత్రానుభవన్ని కలిగిస్తూ తిరిగి తిరిగి సందర్శించేలా చేస్తుంది.
సీతామఢీ జిల్లా 2294 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది.[7] ఇది ఆస్ట్రేలియా లోని గ్రూట్ ఐలాండ్ వైశాల్యానికి సమానం.[8] సీతామఢీ అక్షాంశ స్థానం: 26.6° ఉత్తరం 85.48.° తూర్పు ఇది సరాసరిన 56 మీటర్ల ఎత్తున అనగా 183 అడుగుల ఎత్తు కలిగివున్నది. ఈ జిల్లాలో బాగ్మతి, అఘ్ వారా, లఖండై, (లక్ష్మణ రేఖ) మనుస్మర, అనే నదులు ప్రవహిస్తున్నాయి. ఇవి గాక చిన్న వాగులు కూడా ఉన్నాయి. ఈ జిల్లా ఉత్తర సరిహద్దు ప్రాంతము హిమాలయాపర్వతాల చెంత వరకు వ్యాపించియున్నది. ఉత్తరం నుండి దక్షిణాదికి పోను పోను ఎత్తు కలిగి మైదాన ప్రదేశము కలిగి ఉంది. ఈ భూమి పంటలకు అనువైనది. ఇక్కడ భూగర్భ జలము ఎక్కువగా నున్నందున నీటికి కొదువ లేదు.
జిల్లాలో బగ్మతి, లఖందేవి నదులు ప్రవహిస్తున్నాయి.
సీతామఢీ జిల్లా మూడు సబ్ డివిజన్లుగా విభజింప బడివున్నది :- అవి. సీతామఢీ సాదర్, బెల్ సాండ్, పుప్రి.
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో సీతామఢీ జిల్లా ఒకటి అని గుర్తించింది. బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[9]
సీతామఢీ రాష్ట్రం, వెలుపల ప్రాంతాలు అన్నింటితో రహదారి, రైలు మార్గాలతో చక్కగా అనుసంధానమై ఉంది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 3,419,622,[10] |
ఇది దాదాపు. | పనామా దేశ జనసంఖ్యకు సమానం.[11] |
అమెరికాలోని. | కనెక్టికట్ నగర జనసంఖ్యకు సమం.[12] |
640 భారతదేశ జిల్లాలలో. | 96 వ స్థానంలో ఉంది.[10] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1491[10] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 27.47%.[10] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 899:1000 [10] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 53.53%.[10] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.