Remove ads
బీహార్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో జిల్లా (హిందీ:मुज़फ़्फ़रपुर ज़िला) ఒకటి. ముజఫర్‌పూర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. ముజఫర్‌పూర్ జిల్లా తిర్హత్ డివిజన్లో భాగం.[1] 2011 గణాంకాల ప్రకారం బీహార్ రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా ముజఫర్‌పూర్ జిల్లా అత్యధిక జనసంఖ్య కలిగిన జిల్లాలలో మూడవస్థానంలో ఉన్నట్లు గుర్తించబడింది. మొదటి స్థానాలలో పాట్నా జిల్లా, తూర్పు చంపారణ్ జిల్లాలు ఉన్నాయి.[2] జిల్లావైశాల్యం 3173 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 3,743,836. జిల్లా విద్య, వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.లిచీ పడ్లకు జిల్లా ప్రత్యేకత సంతరించుకుంది.
Muzaffarpur,ضلع مظفر پور జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | తిర్హుత్ |
ముఖ్య పట్టణం | ముజఫర్‌పూర్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | ముజఫర్‌పూర్,వైశాలి |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,173 కి.మీ2 (1,225 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 47,78,610 |
• జనసాంద్రత | 1,500/కి.మీ2 (3,900/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 67.68 % |
• లింగ నిష్పత్తి | 898 |
ప్రధాన రహదార్లు | NH 57, NH 57A, NH 102 |
Website | అధికారిక జాలస్థలి |
1875 తిర్హత్ పరిపాలనా సౌలభ్యం కొరకు ముజఫర్‌పూర్ జిల్లాను రూపొందించారు. 18వ శతాబ్దంలో రూపొందించబడున ప్రస్తుత ముజఫర్‌పూర్ జిల్లాకు ఈ పేరు అమిల్ (బ్రిటిష్ రెవెన్యూ అధికారి) ముజఫర్ ఖాన్ ఙాపకార్ధం నిర్ణయించబడింది.
సరిహద్దు వివరణ | జిల్లా |
---|---|
ఉత్తర సరిహద్దు | సీతామఢీ |
దక్షిణ సరిహద్దు | వైశాలి, సారణ్ |
తూర్పు సరిహద్దు | దర్భంగా, సమస్తిపూర్ |
పశ్చిమ సరిహద్దు | సారణ్, గోపాల్‌గంజ్ |
రాయాణ కాలంలో జనకుడు పాలించిన విదేహరాజ్యంలో ఈ ప్రాంతం భాగంగా ఉండేది. తూర్పు నేపాల్, ఉత్తర బీహార్ విదేహరాజ్యంలో ఉన్నాయని భావిస్తున్నారు. రామాయణ కావ్యనాయకి సీత జనకునికి లభించిన పునౌర ప్రాంతం ఈ జిల్లాలో ఉంది. జనకుడు యఙభూమిని దున్నుతున్న సమయంలో సీతాదేవి మట్టి పాత్రలో జనకునికి కుమార్తెగా లభించింది.
లిచివీలు ప్రభావవంతగా పాలించిన 8 రిపబ్లిక్కులలో ఇది వజ్జి రిపబ్లిక్ అని భావిస్తున్నారు. క్రీ.పూ 519లో మగధ రాజులు లిచివీల పొరుగు ప్రాంతంతో ప్రాంతంలో వివాహబంధం ఏర్పరచుకున్నారు.
వైశాలి రాజ్యం మీద అజాతశత్రువు ఈ ప్రాంతం మీద దాడి చేసి రాజ్యాన్ని తిర్హత్ వరకు విస్తరించాడు. అజాతశత్రువు గంగాతీరంలో పాటలీపుత్ర (ప్రస్తుత పాట్నా) నగరం స్థాపించాడు. లిచివీల నుండి రక్షణ కొరకు అజాతశత్రువు గంగా తీరంలో బలమైన కోటను నిర్మించాడు.
ముజఫర్‌పూర్ నగరానికి 40కి.మీ దూరంలో ఉన్న అంబరాతి వైశాలి రాజ్య రాజనర్తకి అమ్రపాలి స్వగ్రామమని భావిస్తున్నారు. విభిన్న మత ప్రాధాన్యతకు వైశాలి రాజ్యం కేంద్రంగా ఉంది. జిల్లాలోని బాసోకుండ్ గౌతమ బుద్ధుని సమకాలీనుడు 24 వ తీర్ధంకర్ మహావీరుని జన్మస్థలం. ఇక్కడకు అంతర్జాతీయ యాత్రికులు యాత్రార్ధం వస్తుంటారు.
చైనాయాత్రీకుడు హూయంత్సాంగ్ పాలా సామ్రాజ్యం ఆవిర్భవిస్తున్న సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. ముజఫర్‌పూర్ కొంతకాలం హర్షవర్ధనుడి ఆధీనంలో ఉంది. సా.శ. 647 లో ఈ ప్రాంతాన్ని ప్రాంతీయ రాజులు స్వాధీనం చేసుకున్నారు. 8వ శతాబ్దంలో పాలా రాజులు సా.శ. 1019 వరకు తిర్హత్ ప్రాంతాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. తరువాత మధ్యభారతానికి చెందిన చేది రాజులు ఈ ప్రాంతం మీద ఆధిపత్యం వహించారు. తరువాత 11వ శతాబ్దంలో సేనా రాజవంశం ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది.
1210-1226లో బెంగాల్ పాలకుడు గైసుద్దీన్ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం వహించాడు. గైసుద్దీన్ ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి ముస్లింపాలకుడుగా గుర్తించబడుతున్నాడు. ఆయన ఈ ప్రాంతం మీద పూర్తి ఆధీనం పొందలేక చక్రవర్తులకు కప్పం చెల్లించాడు. 1323 గైసుద్దీన్ తుగ్లక్ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం వహించాడు. ముజఫర్‌పూర్ చరిత్ర సింరాయన్ సామ్రాజ్యం (చంపారణ్యం ఈశాన్య భూభాగం) గురించి వివరించనిది పూర్తికాదు. సింరాయన్ సామ్రాజ్య స్థాపకుడు నాన్యుప దేవ తన శక్తిని నేపాల్, మిథిల వరకు విస్తరించాడు.
ఈ ప్రాంతాన్ని చివరిగా హరసింగ్ దేవా పాలించాడు. 1323లో తిర్హత్ మీద తుగ్లక్ షాహ్ దండయాత్ర చేసాడు. తుగ్లక్ షాహ్ నుండి తీర్హత్ ఆధిపత్యం కామేశ్వర్ ఠాకూర్ స్వాధీనం చేదుకున్నాడు. తరువాత ఈ ప్రాంత ఆధిపత్యం హిందూ రాజుల నుండి ముస్లిం హస్థాలకు మారినప్పటికీ హిందుఇరాజులు స్వతంత్ర రాజులుగా కొనసాగారు.
14వ శతాబ్దం చివరినాటికి బిహార్ ఉత్తర భూభాగం తిర్హత్‌తో చేర్చి జౌన్పూర్ రాజుల హస్థహతం అయింది. తరువాత శతాబ్ధకాలం ఇది జౌన్పూర్ రాజుల వశంలో ఉంది. తరువాత ఢిల్లీ సుల్తాన్ సికిందర్ లోడీ ఈ ప్రాంతం మీద దండయాత్ర చేసాడు. తరువాత బెంగాల్ నవాబు అల్లాద్దీన్ హుసైన్ షాహ్ శక్తిని పుంజుకుని తీర్హత్ వరకు ఆధిపత్యం సాధించి. తీర్హత్లో అధికభూభాగాన్ని కూడా స్వాధీనపరచుకున్నాడు.
1499లో ఢిల్లీ చక్రవర్తి హుసైన్ షాహ్ ఈ ప్రాంత పాలకులను ఓడించి ఈ ప్రాంతాన్ని స్వాధీనపరచుకున్నాడు. బెంగాల్ నవాబుల శక్తి క్షీణించడం మొదలై మహూద్ షాహ్ పాలన పతనావస్థకు చేరుకుంది. తిర్హత్‌తో చేరిన ఉత్తర బీహార్ ప్రాంతం ముగల్ సామ్రాజ్యంలో భాగం అయింది. బెంగాల్ నవాదు దావుద్ ఖాన్ పాలన బలపడే వరకు ముజఫర్‌పూర్ ప్రాంతం ముగల్ సామంతరాజుల పాలనలో కొనసాగింది. దావూద్ ఖాన్ పాట్నా, హాజీపూర్ వరకు ఆధిపత్యం చేసాడు. దావూద్ పతనం తరువాత బీహార్ ప్రాంతం ముగల్ సామ్రాజ్య సుభాహ్‌గా రూపొందించబడింది. తీర్హత్ అందులో భాగం అయింది.
1764లో ఈస్ట్ ఇండియా కంపెనీ బక్సర్ యుద్ధం తరువాత బిహార్ మీద పూర్తి ఆధిపత్యం సాధించింది. 1857లో ఢిల్లీ వద్ద తిరుగుబాటుదారులు విజయం సాధించిన తరువాత జిల్లాలో నివసిస్తున్న ఆగ్లేయులకు తురుగుబాటుదారుల ద్వారా తలెత్తిన సమస్యలు ఈ ప్రాంతం అంతా విస్తరించాయి.
1908లో బెంగాల్ యువతిరుగుబాటుదారుడు 18 సంవత్సరాల ఖుది బోస్ ఉరితీతకు గురయ్యాడు. ఖుది రాం బోస్ ముజఫర్‌పూర్ జడ్జి కింగ్స్‌ఫోర్డ్స్ మీద విసిరిన బాంబు ప్రింజిల్ కెనడీ మీద పడింది. బాంబు విసిరినందుకు ఖుది రాం బోస్ ఉరితీయబడ్డాడు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత బోస్ ఙాపకార్ధం ముజఫర్‌పూర్ వద్ద ఒక స్మారకచిహ్నం నిర్మించబడింది. ముజఫర్‌పూర్ వద్ద 2004 అక్టోబరు 2 న అంతరాష్ట్రీయ బజ్జిక పైషద్ 12 వ అంతరాష్ట్రీయ బజ్జిక సమ్మేళనం నిర్వహించబడింది. పైషద్ ఏకగ్రీవంగా రాజకీయ నాయకులు, అధికారుల సమక్షంలో నగరం పేరును ఖుదీరాంపూర్ అని మార్చాలని తీర్మానించింది. 1920 - 1927 జనవరిలో ముజఫర్‌పూర్‌ను మహాత్మాగాంధీ సందర్శించిన తరువాత ప్రజలలో చైతన్యం అధికరించి స్వాతంత్ర్య సమరంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
భారతీయ నాగరికతలో ముజఫర్‌పూర్ మీద రెండు ప్రధాన మతాల ప్రభావం అధికంగా ఉంది. హిందూ ముస్లిం ఐక్యతకు ఇది కేంద్రంగా ఉంది. విభిన్న సప్రదాయం మరియి సంస్కృతికి ఇది చిహ్నంగా భాదిస్తుంది. ముజఫర్‌పూర్ రాజేంద్రప్రసాద్, జార్జ్ ఫెర్నాండెజ్, ఆచార్య కృపలాని మొదలైన ప్రముఖులకు స్వస్థలంగా ఉంది. ఈ ప్రాంత ప్రజల భాష బజ్జిక అని కాలక్రమంలో అది వజ్జిక అయిందని జార్జ్ గ్రియేసన్ అభిప్రాయపడుతున్నాడు..
1972లో ముజఫర్‌పూర్ జిల్లా నుండి సీతామఢీ, వైశాలి జిల్లాలు రూపొందించబడ్డాయి.[3]
స్వతంత్ర సమరయోధుడు, ఉపాధ్యాయుడు కీ.శే పి.టి జగదీష్ నారాయణ్ శర్మ (బి.టి సాహిత్య రత్న- శాస్త్రి) స్వస్థానం ముజఫర్‌పూర్‌లోని సికిందర్‌పూర్. 1978లో ప్రధానమంత్రి ఇందిరాగాంధి నుండి ఆయన " తామ్ర పాత్రను " బహుమతిగా పొందాడు. కమలేష్ నారాయణ్ శర్మ (సుబేదార్ మేజర్ - హానరరీ కేప్టన్ - ఇండియన్ ఆర్మీ), ఉదయ్ నారాయణ్ (టి.ఐ.ఎఫ్.సి- ఇండియన్ ఆర్మీ), ఉదయ్ నారాయణ్ కుమారుడు చిరగ్ శర్మ ఆర్మీ మెడికల్ కాలేజ్‌లో చేరి ఇండియన్ ఆర్మీకి సేవలు అందించాడు.
ముజఫర్‌పూర్ జిల్లాను బుధి గంధక్ నది చేత రెండుగా విభజించబడింది. ఇది గంగా మైదానంలో ఉంది. జిల్లాలో మరికొన్ని జలప్రవాహాలు ప్రవహిస్తున్నాయి. జిల్లా వైశాల్యం 3181 చ.కి.మీ. [4] ఇది కెనడా దేశంలోని మంసెల్ ద్వీపం వైశాల్యానికి సమానం.[5]
విషయాలు | వివరణలు |
---|---|
ఉపవిభాగాలు | తూర్పు ముజఫర్‌పూర్ - పశ్చిమ ముజఫర్‌పూర్ |
తూర్పు ముజఫర్‌పూర్ మండలాలు | 9 ఔరై, బొచహన్, బాంద్రా, గైఘత్, కత్రా, మినపుర్, మురౌల్, ముషహరి,, సక్ర. |
పశ్చిమ ముజఫర్‌పూర్ మండలాలు | 7 ఉదరు, కురహంత్, మర్వన్, మొతిపుర్, పరూ, సహెబ్గంజ్, సరైయ. |
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ముజఫర్‌పూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[6] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[6]
ముజఫర్‌పూర్ జిల్లా లిచీ పండ్ల ఎగుమతికి ప్రసిద్ధి. దీర్ఘకాలాం నుండి ఈ ప్రాంతం చేనేత వస్త్రాలకు, చెరుకు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది. జిల్లాలో కొన్ని చక్కెర మిల్లులు ఉన్నాయి. అవి ప్రస్తుతం పాతవై పాడుపడి ఉన్నాయి. ఇది ఉత్తర బీహార్ వాణిజ్య కేంద్రంగా ఉంది. ముంబయి, సూరత్, అహమ్మదాబాద్ నగరాలకు ఇది హోల్‌సేల్ మార్కెట్‌గా ఉంది. సుత పట్టి వద్ద మార్వారీల సమూహానికి చెందిన టెక్స్టైల్ మిల్లులు ఉన్నాయి. నగరంలో మోత్ఝీల్, కల్యాణీ చౌక్, సరియాగంజ్, జవహర్లాల్ నెహ్రూ రోడ్డు, బేలా ఇండస్ట్రియల్ ఏరియా, క్లబ్ రోడ్డు, ఇస్లాంపూర్, షాఫీదౌది మార్కెట్, అంది గొల, చాటా బజార్, కంపెనీ బాగ్, తిలక్ మైదాన్ రోడ్డు, జురన్ చప్రా, బ్యాంక్ రోడ్డు, మిథంపురా, ఆంగొలా మొదలైన వ్యాపార కేంద్రాలు ఉన్నాఅయి..
ముజఫర్‌పూర్ జిల్లాలో వ్యవసాయభూములు అధికంగా ఉన్నాయి. వ్యవసాయభూములలో వ్యవసాయం, హార్టీ కల్చర్ అధికంగా వాడుకలో ఉంది. లిచీ, మామిడి పండ్లను విస్తారంగా పండిస్తున్నారు. బియ్యం, గోధుమ, పప్పుధాన్యాలు, జనపనార, మొక్కజొన్నలు, నూనెగింజలు అధికంగా పండించబడున్నాయి. కాలిఫ్లవర్, క్యాబేజ్, ఎర్రగడ్డలు, టొమాటో, ముల్లంగి, కేరట్, బీట్రూట్ మరియి ఇతర కూరగాయలు పండించబడుతున్నాయి. అలాగే చెరుకు, ఉర్లగడ్డలు, బార్లీ వంటి పంటలు కూడా పండించబడుతున్నాయి.
జిల్లాలో బర్రెలు, మేకలు మరియి కోళ్ళు పెంచబడుతున్నాయి.
ముజఫర్‌పూర్ నగరం పలు పరిశ్రమలు చిన్నతరహా, బృహత్తర ఉన్నాయి. రైల్వే వ్యాగన్ పరిశ్రమ నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకు వస్తుంది. హోల్‌సేల్ వస్త్రవ్యాపారానికి ముజఫర్‌పూర్ కేంద్రంగా ఉంది. బీహార్ ఆల్కహాల్ తయారీకి కేంద్రంగా ఉంది. జిల్లాలో ప్రధానంగా ప్రాంతీయ, విదేశీ ఆల్కహాలు తయారీ పరిశ్రమలు ఉన్నాయి. ముజఫర్‌పూర్‌లో 2012లో విజయ మల్లాయ్యా గ్రూప్, యునైటెడ్ బ్రివరీస్ గ్రూప్ ఇక్కడ లిట్చి ఫ్లేవర్డ్ ఆల్కహాలు తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. ఈ సంస్థ లిచీ తోటలను లీజుకు తీసుకుంది.[7]
లిచీ పంట మే - జూన్ మాసాలలో అందుబాటుకు వస్తుంది. లిచీ ప్రధానంగా ముజఫర్‌పూర్ జిల్లా, పరిసర ప్రాంతాలలో అధికంగా పండించబడుతుంది. ఇది 25,800 హెక్టార్ల ప్రాంతంలో పండించబడుతుంది. సంవత్సరానికి 3,00,000 టన్నులు ఉత్పత్తి చేయబడుతుంది. లిచీ పండ్లు ముంబయి, కొలకత్తా,, ఇతర దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి. ప్రపంచ లిచీ మార్కెట్లో భారతదేశ ఉత్పత్తి 1% ఉంది.ముజఫర్‌పూర్‌లో పండించబడుతున్న లిచీ పండ్ల పేర్లు షాహి,, చైనా. ఇక్కడ పండించబడుతున్న పండ్లు అద్భుతమైన రుచి, వాసన కలిగి ఉంటాయి.[8]
మిథిలా భూభాగంలో ముజఫర్‌పూర్ ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా ఉంది. జిల్లాలో చిన్న, బృహత్తర తరహా పరిశ్రమలు ఉన్నాయి. ప్రభాత్ Zarda ఫ్యాక్టరీ, గణేష్ కర్మాగారాలు లిమిటెడ్, భారత్ వాగన్, ఇంజనీరింగ్ లిమిటెడ్, ఎన్టిపిసి, బీహార్ డ్రగ్స్ & సేంద్రీయ కెమికల్స్ లిమిటెడ్ ముజాఫర్పూర్ - IDPL యొక్క ఒక యూనిట్, లెదర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముజాఫర్పూర్ డైరీ యూనిట్లు ఉన్నాయి. జిల్లాలో అదనంగా ముజఫర్ సుధా బ్రాండ్ ప్యాక్ పాల ఉత్పత్తి బీహార్ రాష్ట్రం డైరీ కార్పొరేషన్ యూనిట్ బీహార్ స్టేట్ కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ 'ఫెడరేషన్ లిమిటెడ్, యూనిట్ మొదలైన పాలౌత్పత్తు యూనిట్లు ఉన్నాయి. ఈ పరిశ్రమలు జిల్లాలోని ప్రజలకు కనీసమైన ఉపాధిని కల్పిస్తున్నాయి. జిల్లాలో తయారు చేయబడుతున్న ఉత్పత్తులలో ప్రధానమైనది రైలువ్యాగన్ల తయారీ. హోల్‌సేల్ వస్త్రాల తయారీకి ముజఫర్‌పూర్ కేంద్రంగా ఉంది. జిల్లాలో సరికొత్తగా చక్కెర మిల్లులు, బ్రిటానియా బిస్కట్ల తయారీ సంస్థలు స్థాపించబడ్డాయి..[9]
ముజఫర్‌పూర్ జిల్లా బీహార్ రాష్ట్రంలో ప్రముఖ విద్యాకేంద్రంగా గుర్తింపు పొందింది. జిల్లాలో శ్రీ కృష్ణ మెడికల్ కాలేజ్, హాస్పిటల్, ఇంజనీరింగ్ కాలేజ్ ( ముజఫర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ఉన్నాయి. జిల్లాలో రాష్ట్రంలోని పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటైన బీహార్ యూనివర్శిటీ (ప్రస్తుతం ఇది బి.పి. అంబేద్కర్ యూనివర్శిటీ) ఉంది. బీహార్ యూనివర్శిటీ ప్రధాన కార్యాలయం పాట్నాలో ఉంది. ముజఫర్‌పూర్ నగరప్రజలు బీహార్ యూనివర్శిటీ ప్రధాన కార్యాలయం ముజఫర్‌పూర్ నగరానికి మార్చాలని నిర్బంధిస్తున్నారు. డాక్టర్ మాఘ్ఫూర్ అహ్మద్ అజాజి నాయకత్వంలో ఒక స్టీరింగ్ కమిటీ రూపొందించబడింది. కమిటీలో అదనంగా ఆచార్య JBKripalani, అశోక్ మెహతా, మహామాయ పీడీ, మహేష్ PD సిన్హా మొదలైన సభ్యులు ఉన్నాఅరు. ప్రజలు ఉద్యమం విజయవంతమైంది UGC బీహార్ ప్రభుత్వాన్ని ప్రధాన కార్యాలయం ముజఫర్‌పూర్‌కు మార్చాలని ఆదేశించంది. .[10] దేశ ప్రథమ అధ్యక్షుడు " డాక్టర్ రాజేంద్రప్రసాద్ " ఉపాధ్యాయుడుగా బాధ్యవహించింది గ్రీర్ భూమిహార్ బ్రాహ్మణ కాలేజిలోనే.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 4,778,610,[2] |
ఇది దాదాపు. | సింగపోర్ దేశ జనసంఖ్యకు సమానం.[11] |
అమెరికాలోని. | అల్బామా నగర జనసంఖ్యకు సమం.[12] |
640 భారతదేశ జిల్లాలలో. | 24 వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1056 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 27.54%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 898:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 65.68%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
జిల్లాలో వజ్జిక భాష వాడుకలో ఉంది. బజ్జింకాంచల్ ప్రజల కేంద్రంగా (పశ్చిమ మిథిల) ఉన్నందున స్థానికులు అధికంగా వజ్జిక భాషను మాట్లాడుతున్నారు. అయినప్పటికీ హిందీ కార్యాలయాలలో అధికంగా కనిపిస్తుంది. ఉర్దు రెండవ అధికారిక భాషగా ఉంది. రాష్ట్రమంతటా ఆగ్లంకూడా వాడుకలో ఉంది.
జిల్లాలో ముజఫర్‌పూర్ జంక్షన్, రెండు సబర్బన్ స్టేషన్లు (రాం దయాళ్ నగర్, నారాయణపూర్ అనంత్ (షేర్పూర్)) ఉన్నాయి.
ప్రాంతీయ, రాష్ట్రీయ బసులు ఇమ్లి బస్‌స్టాండ్ నుండి బయలుదేరుతుంటాయి.
జిల్లాలో ప్రధానంగా " ముజాఫర్పూర్ విమానాశ్రయం " ఉంది. ఇక్కడ నుండి కొన్ని నగరాలకు విమానాలు నడుస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఇక్కడ వాణిజ్యపరమైన విమానసర్వీసులు వసతి లేదు. ఇక్కడి నుండి పాట్నా, భాగల్పూర్, గయ, ముంగేర్, దర్భాంగా నగరాలకు విమానాలు నడుపబడుతున్నాయి.
6 జాతీయరహదారులన్నింటీకీ జిల్లాలో కూడళ్ళు (జంక్షన్) ఉన్నాయి. రిగ్ రోడ్డు నిర్మాణంలో ఉంది. బుధిగంధక్ నది మీద వంతెన నిర్మించారు. బస్,టాక్సి, రిక్షా, ఆటోరిక్షా మొదలైనవి లభ్యమౌతుంటాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.