సీతామఢీ
బీహార్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
సీతామఢీ బీహార్ రాష్ట్రం, మిథిల ప్రాంతం లోని సీతామఢీ జిల్లాకు చెందిన నగరం. ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. ఈ జిల్లా తిర్హత్ విభాగంలో భాగంగా ఉంది. బీహార్ ప్రభుత్వం 2020 ఏప్రిల్ 8 న సీతామఢీని మునిసిపల్ కార్పొరేషన్‌గా ప్రకటించింది.[2]
1875 లో, ముజాఫర్‌పూర్ జిల్లాలో సీతామఢీ ఉప జిల్లాను సృష్టించారు.[3] 1972 డిసెంబరు 11 న సీతామఢీని ముజఫర్పూర్ జిల్లా నుండి వేరుచేసి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసారు. [4] ఇది బీహార్ రాష్ట్ర ఉత్తర భాగంలో ఉంది.
భౌగోళికం
సీతామఢీ 26.6°N 85.48°E వద్ద, [5] సముద్ర మట్టం నుండి 56మీటర్ల ఎత్తున ఉంది.
జనాభా
సీతామఢీ నగరంలో మొత్తం జనాభా 1.06,093. సుమారు 56,693 మంది పురుషులు, 49,400 మంది మహిళలు ఉన్నారు. అక్షరాస్యులైన పురుషుల సంఖ్య 39,537 కాగా, అక్షరాస్యులైన ఆడవారి సంఖ్య 29,970. మొత్తం 69,507 మంది అక్షరాస్యులు. అక్షరాస్యత రేటు 52.04%, మగవారికి 60.64%, ఆడవారికి 42.41%. లింగ నిష్పత్తి 899. పిల్లల్లో లింగ నిష్పత్తి 872. [6]
రవాణా సౌకర్యాలు
జాతీయ రహదారి 77 ఈ ప్రాంతాన్ని ముజఫర్‌పూర్ జిల్లాకు పాట్నాకూ కలుపుతుంది. జాతీయ రహదారులు 77, 104, ఇతర రహదారులు పక్క జిల్లాలకు కలుపుతాయి. రాష్ట్ర రహదారులు దీనిని తూర్పున మధుబని జిల్లాతోను, పశ్చిమాన శివ్‌హర్ తోనూ కలుపుతాయి .
సీతామఢీ జంక్షన్ రైల్వే స్టేషన్ దర్భాంగా - రాక్సాల్ - నార్కటియాగంజ్ లైన్‌లోని ఐదు ప్లాట్‌ఫారాలున్న స్టేషను. దీనిని 2014 ఫిబ్రవరిలో బ్రాడ్ గేజ్‌గా మార్చారు. మరో బ్రాడ్-గేజ్ మార్గం సీతామఢీని ముజఫర్‌పూర్‌తో కలుపుతుంది. సీతామఢీ రైల్వే జంక్షన్ నుండి న్యూ ఢిల్లీ, కోల్‌కతా, వారణాసి, లక్నో, గౌహతి (కామాఖ్యా), హైదరాబాద్, కాన్పూర్, ముంబై వంటి ప్రదేశాలకు నేరుగా రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి.
సీతామఢీకి సమీపంలో ఉన్న దేశీయ విమానాశ్రయం దర్భంగా విమానాశ్రయం. ఇది పట్టణం నుండి 82 కి.మీ. దూరంలో ఉంది.
సీతామఢీ నుండి బీహార్ లోని ఇతర పట్టణాలకు ప్రభుత్వ యాజమాన్యంలోని రవాణా సంస్థ బస్సులు నడుపుతోంది. సీతామఢీ, పాట్నాల మధ్య చాలా ప్రైవేట్ బస్సులు (ఎసి, నాన్-ఎసి రెండూ) నడుస్తున్నాయి.
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.