సహర్సా
బీహార్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
సహర్సా బీహార్ రాష్ట్ర తూర్పు భాగంలోని సహర్సా జిల్లా లోని పట్టణం. ఇది కోసి నది తూర్పు ఒడ్డున ఉంది. ఇది సహర్సా జిల్లా ముఖ్యపట్టణం. కోసి డివిజన్ ప్రధాన కార్యాలయం. ఈ డివిజనులో సహర్సా, మాధేపురా, సుపాల్ జిల్లాలు భాగంగా ఉన్నాయి.
సహర్సా
సహర్సా | |
---|---|
పట్టణం | |
Saharsa | |
![]() | |
Coordinates: 25.88°N 86.6°E | |
దేశం | India |
రాష్ట్రం | బీహార్ |
ప్రాంతం | మిథిల |
జిల్లా | సహర్సా |
విస్తీర్ణం | |
• Total | 21 కి.మీ2 (8 చ. మై) |
Elevation | 41 మీ (135 అ.) |
జనాభా (2011) | |
• Total | 1,56,540 |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 852201-852154-852221-852127 |
టెలిఫోన్ కోడ్ | 916478 |
ISO 3166 code | IN-BR |
Vehicle registration | BR-19 |
భౌగోళికం
సహర్సా 25.88°N 86.6°E నిర్దేశాంకాల వద్ద, [1] సముద్ర మట్టం నుండి 41 మీటర్ల ఎత్తున ఉంది.ఈ పట్టణం కోసి పరీవాహక ప్రాంతంలో ఉంది. భూమి చాలా సారవంతమైనది. కాని గంగానది యొక్క అతిపెద్ద ఉపనదులలో ఒకటైన కోసి ప్రవాహ మార్గంలో తరచూ మార్పులు జరగడం వలన, [2] [3] నేల కోతకు గురైంది. ఈ ప్రాంతానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడానికి వరదలు ఒక ప్రధాన కారణం. వంతెనలు తరచూ కొట్టుకుపోతాయి. వరదలు దాదాపు ఏటా సంభవిస్తాయి. దీనివల్ల గణనీయమైన ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగుతూంటాయి. [4]
పట్టణ ప్రముఖులు
- మండన మిశ్రుడు మైథిల్ తత్వవేత్త, తత్వ వాదనలో ఆది శంకరాచార్యుల చేతిలో ఓడిపోయాడు.
- బిందేశ్వరి ప్రసాద్ మండల్, బీహార్ ముఖ్యమంత్రి
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.