From Wikipedia, the free encyclopedia
తిరుమల దేవరాయలు, ఆరవీటి వంశ స్థాపకుడు, రామరాయల తమ్ముడు, శ్రీ కృష్ణదేవరాయల చిన్న అల్లుడు. తళ్లికోట యుద్ధములో రాయరాయలతో పాటు పోరాడాడు. ఆ యుద్ధములోనే ఒక కన్ను కోల్పోయాడు. ఈయన 1570 నుండి 1572 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పెనుగొండ రాజధానిగా పరిపాలించాడు. యుద్ధానికి పూర్వము కూడా ఈయన పెనుగొండను పాలించినట్లు ఫెరిస్తా రచనల వల్ల తెలుస్తున్నది.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
విజయ నగర రాజులు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
యుద్ధము నుండి ప్రాణాలతో బయటపడి నామమాత్ర పాలకుడైన సదాశివరాయలతో సహా 1550 ఏనుగులమీద విజయనగర ఖజానానంత ఎత్తుకొని పెనుగొండకు వచ్చాడు. సుల్తానులు నలుగురూ విజయనగరాన్ని వదిలిన తరువాత ఇతను రాజధాని చేరుకోని బాగుచేయ ప్రయత్నించాడు. కానీ తరువాత మూడు సంవత్సరాలకు ఆ శ్మశానంలో ఉండలేక రాజధానిని పెనుగొండకు మార్చాడు.
అళియ రామరాయల కొడుకైన పెదతిరుమలుడు పినతండ్రి అధికారాన్ని నిరసించి అతన్ని అధికారము నుండి తొలగించి పెనుగొండను సాధించడానికి అలీ ఆదిల్షా సహాయం అర్ధించాడు. పెదతిరుమలుని కోరికపై ఆదిల్షా పెనుగొండ మీదికి ఖిజర్ ఖాన్ నాయకత్వంలో సైన్యాన్ని పంపాడు. పెనుగొండ దుర్గపాలకుడైన సవరం చెన్నప్ప ఈ దాడిని తిప్పికొట్టినాడు.
తళ్లికోట యుద్ధం తర్వాత పంచపాదూషాలలో ఐకమత్యం లోపించి యధాప్రకారముగా కలహించుకోసాగినారు. స్వీయరాజ్యరక్షణకు వారి వ్యవహారాలలో కలజేసుకోవటము అవసరమని తిరుమలరాయలు భావించాడు. కుతుబ్షా, నైజాంషాలు కలసి ఆదిల్షాపై చేసిన యుధ్హములో తిరుమలరాయలు మిత్రకూటమితో చేరినాడు. అందుకు ఆగ్రహించి అలీ ఆదిల్షా 1568లో ఆదోని, పెనుగొండలపై దాడిచేసాడు. పెనుగొండపై దాడి విఫలమైనది కానీ ఆదోని పాలకుడైన కోనేటి కొండమరాజు ఓడిపోయి బీజాపూరు సామంతుడైనాడు. ఆదోని రాజ్యము శాశ్వతంగా బీజాపూరు రాజ్యములో చేరింది.
తిరుమల రాయలు, 1570 లో సదాశివరాయలను హతమార్చి అధికారము చేజిక్కించుకొన్నాడని రాబర్ట్ సూయల్ అభిప్రాయపడ్డాడు. అయితే 1576 వరకు సదాశివరాయల యొక్క పేరు శాసనాలలో ప్రస్తావించడము వల్ల అప్ప్టిదాక ఆయన జీవించే ఉన్నాడని మరొక వర్గపు వాదన.
తిరుమల రాయలు రాజ్యానికి వచ్చేసరికి వృద్ధాప్యము వల్ల ఎంతో కాలము పరిపాలించలేకపోయాడు. ఇతనికి ముగ్గురు కుమారులు, ఒక్కొక్కరినీ ఒక్కొక్క ప్రాంతానికి ప్రతినిధులుగా చేసెను. రామరాయలు, శ్రీరంగపట్టణం రాజధానిగా కన్నడ ప్రాంతాలను, శ్రీరంగ రాయలు పెనుగొండ రాజధానిగా తెలుగు ప్రాంతాలను, మూడవ కొడుకు వెంకటాద్రి చంద్రగిరి రాజధానిగా తమిళ ప్రాంతాలను పాలించారు. రాకుమారుల మధ్య పరస్పర సహకారం లోపించడముతో రాజ్యం బలహీనమై సుల్తానుల విస్తరణకు అవకాశం కల్పించింది.
తిరుమలరాయలు శ్రీకృష్ణదేవరాయల రెండవ భార్య చిన్నమాదేవి కుమార్తె అయిన వెంగళాంబను వివాహము చేసుకొన్నాడు. ఈయనకు నలుగురు కుమారులు : రఘునాథ రాయలు, శ్రీరంగ రాయలు, రామరాయలు, వెంకటరాయలు. రఘునాథ రాయలు నిజాంషాను ఓడించి సుల్తాను సేనలను కృష్ణానది ఆవలికి పారద్రోలాడు. అయితే తిరుమలరాయలు రాజ్యానికి వచ్చేనాటికి ఈయన జీవించి ఉండకపోవచ్చని చరిత్రకారుల అభిప్రాయం.
తిరుమల రాయలు పాలకునిగానే కాక సాహితీకర్తగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఈయన పైనే అన్నాతిగూడ హరుడవే అన్న చాటు పద్యాన్ని రామరాజభూషణుడు చెప్పాడని ప్రతీతి. రామరాజభూషణుడు రాసిన వసుచరిత్రను తిరుమలరాయలకు అంకితమిచ్చాడు. ఈయన సభలోఉన్న లక్ష్మీధరుడనే కవి సంగీతము పై భరతశాస్త్ర గ్రంథము రచించాడు[1].
తిరుమలలోని గర్భగుడి ప్రాంగణములో రంగమండపము పక్కన కల సాళువ నరసింహరాయలు కట్టించిన ఉంజల్ మండపం లేదా సాళువ మండపం శిథిలావస్థకు చేరటముతో తిరుమలరాయలు దానిని విస్తరించి పునరుద్ధరించాడు. అప్పటినుండి దానికి తిరుమలరాయ మండపము అని పేరు వచ్చింది. ఇక్కడ ఈయన విగ్రహము కూడా ఉంది. సాళువ నరసింహరాయలు 1468లో ప్రారంభించిన వసంత తిరునాలను తిరుమలరాయలు మరింత వైభవోపేతమైన పండుగగా తీర్చిదిద్దాడు[2].
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.