జహానాబాద్ జిల్లా
బీహార్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో జహనాబాద్ జిల్లా ఒకటి. జహనాబాద్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా మగధ్ డివిజన్‌లో భాగం. జిల్లా బీహార్ రాష్ట్ర ముఖ్యపట్టణం పాట్నాకు 45 కి.మీదూరంలోనూ గయ పట్టణానికి 43 కి.మీ దూరంలోనూ ఉంది. దర్ధ, యమునైయా నదీ సంగమంలో ఉంది. ఇది మగధసామ్రాజ్యానికి హృదయస్థానంలో ఉంది. ఇక్కడ ప్రాంతీయ భాష మాగహి. ఈ జీల్లా ఒకప్పుడు నక్సలైట్ కార్యక్రమాల వలన వార్తలలో కేంద్రంగా ఉండేది. ప్రస్తుతం జిల్లాలో చేపట్టబడిన అభివృద్ధి కార్యక్రమాలు, సర్వీస్ సెక్టర్ మెరుగైనందు వలన పరిస్థితి కొంత మెరుగైంది.
జహానాబాద్ జిల్లా
जहानाबाद जिला | |
---|---|
![]() బీహార్ పటంలో జహానాబాద్ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | మగధ |
ముఖ్య పట్టణం | జహానాబాద్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | జహానాబాద్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,569 కి.మీ2 (606 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 11,24,176 |
• జనసాంద్రత | 720/కి.మీ2 (1,900/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 68.27 % |
• లింగ నిష్పత్తి | 918[1] |
ప్రధాన రహదార్లు | NH 83 |
సగటు వార్షిక వర్షపాతం | 1074 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |

చరిత్ర
1872లో జహానాబాద్ జిల్లా గయ రాష్ట్రంలోని ఉపవిభాగంగా ఉండేది. జిల్లా 1986 ఆగస్టు 1 న రూపొందించబడింది. జహానాబాద్ జిల్లాలో బార్బర్ గుహలు ఉన్నాయి. [[భరతదేశంలో రాతిని తొలిచి నిర్మించిన పురాతన గుహలలో ఇవి ఒకటిగా గుర్తించబడుతున్నాయి. ఇవి అధికంగా మౌర్యకాలానికి (క్రీ.పూ 322 - 185) సంబంధించినవని భావిస్తున్నారు. కొన్ని అశోకుని కాలానికి చెందినవని భావిస్తున్నారు. ఇది ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగం.[2]
పేరువెనుక చరిత్ర
షాజహాన్ కుమార్తె జహనరా బేగం ఙాఅపకార్ధం ఈ ప్రాంతానికి జహానాబాద్ అనే పేరు నిర్ణయించబడింది. జహనరా బేగం షాజహాన్, అర్జుమండ్ బాను బేగం కుమార్తె. ఆమె 1681 సెప్టెంబరు 16న జన్మించింది.
భౌగోళికం
జహానాబాద్ జిల్లా వైశాల్యం 832 చ.కి.మీ.[3] ఇది మెక్సికో లోని ఇస్లా ఏంజల్ లా గుర్డా వైశాల్యానికి సమానం.[4] జిల్లాలో ధాన్యం, కూరగాయలు పండించబడుతున్నాయి. జిల్లాలో వేడి, పొడి వాతావరణం ఉంటుంది
ఆర్ధికం
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో జహ్నాబాద్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[5] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[5]
విభాగాలు
- జిల్లాలో ఒకేఒక ఉపవిభాగం ఉంది (జహానాబాద్).
- జహ్నాబాద్ ఉపవిభాగం : జహానాబాద్, కాకో, కాకొ, మొదంగంజ్, ఘొసి, హులస్‌గంజ్, మఖ్దుమ్‌పూర్, రత్ని ఫరీద్పూర్.
విద్య
జాహానాబాద్ నగరమంతటా విస్తరించి ఉన్న పలు ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి.
- సి.బి.ఎస్ విద్యను అందిస్తున్న పాఠశాలల జాబితా:-
- D.A.V. స్కూల్, B.V.N., ఫ్లో, మానస్ విద్యాలయలో
- కేంద్రీయ విద్యాలయ,
- స్వామి ఉన్నత పాఠశాల Tehta వివేకానంద్
కొత్తగా స్థాపించబడిన పలు ప్రైవేట్ పాఠశాలలు జిల్లాలో విద్యాభివృద్ధికి తగినంత సహకారం అందిస్తిన్నాయి. ది గాంధి ఇంటర్ మీ డియట్ స్కూల్ (వి.టి స్కూల్, ఎస్.ఎస్ కాలేజ్) జిల్లా విద్యారంగానికి వెన్నెముకగా నిలిచిఉంది.
జిల్లాకు చెందిన వ్యక్తులు
- మహేంద్రప్రసాద్ - రాజ్యసభ సభ్యుడు
2001 లో గణాంకాలు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,124,176,[1] |
ఇది దాదాపు. | సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[6] |
అమెరికాలోని. | రోడే ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం..[7] |
640 భారతదేశ జిల్లాలలో. | 412 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1206 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 21.34%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 918:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 68.27%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
ఇవికూడా చూడండి
మూలాలు
బయటి లింకులు
వెలుపలి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.