మహారాష్ట్ర లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
మహారాష్ట్ర లోని జిల్లాలలోజలగావ్ జిల్లా (హిందీ:जळगाव जिल्हा) ఒకటి. జలగావ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 11,765 చ.కి.మీ. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 3,682,690. గ్రామీణ ప్రాంత నివాసితులు 71.4%. .[1]
జలగావ్ జిల్లా
जळगाव जिल्हा | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
డివిజను | నాసిక్ |
ముఖ్య పట్టణం | Jalgaon |
మండలాలు | 1. Jalgaon, 2. Jamner, 3. Erandol, 4. Dharangaon, 5. Bhusawal, 6. Bodwad, 7. Yawal, 8. Raver, 9. Muktainagar, 10. Amalner, 11. Chopda, 12. Parola, 13. Pachora, 14. Chalisgaon, 15. Bhadgaon |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | 1. Jalgaon, 2. Raver (shared with Buldhana District) (Based on Election Commission website) |
• శాసనసభ నియోజకవర్గాలు | 12 |
విస్తీర్ణం | |
• మొత్తం | 11,765 కి.మీ2 (4,542 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 42,24,442 |
• జనసాంద్రత | 360/కి.మీ2 (930/చ. మై.) |
• Urban | 70% |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 85 |
• లింగ నిష్పత్తి | 933 |
ప్రధాన రహదార్లు | NH-6 National Highway 211 (India) NH-211 |
సగటు వార్షిక వర్షపాతం | 690 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
జిల్లా సరిహద్దులో మద్యప్రదేశ్ రాష్ట్రం, తూర్పు సరిహద్దులో బుల్ఢానా జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో జాల్నా జిల్లా, దక్షిణ సరిహద్దులో ఔరంగాబాద్ (మహారాష్ట్ర) జిల్లా, వాయవ్య సరిహద్దులో నాశిక్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో ధూలే జిల్లా ఉన్నాయి. .
జిల్లాలో ప్రధానంగా అరటి, పత్తి, సజ్జలు, గోధుమలు, మిల్లెట్, నిమ్మ, వేరుచనగ, చెరకు పండించబడుతున్నాయి. నాణ్యమైన బంగారానికి జలగావ్ ప్రత్యేకత కలిగి ఉంది. [2].
జల్గావ్ జిల్లాలో వర్షపాతం 77-80 సె.మీ.జిల్లా తూర్పు ప్రాంతంలోని యవాల్ తాలూకాలో 77 సె.మీ.జిల్లాలోని భుసవాల్, పచోరా ప్రాంతాలలో 79సె.మి.జమ్నర్ ప్రాంతంలో 80 సె.మీ. [2]
ప్రస్తుత జలగావ్ జిల్లా ప్రాంతం ఫరూఖ్ రాజవంశానికి చెందిన స్వతంత్ర ఖందేష్ సుల్తానేట్‌లో (1382 - 1601) భాగంగా ఉండేది. జలగావ్ జిల్లా 1960 అక్టోబరు 21న ఖండేష్ జిల్లాగా ఉండి తరువాత గతంలో తూర్పు ఖండేష్‌గా జిల్లాగా ఉండేది. అబ్దుల్ ఫాజల్ (గ్లాడ్విన్ అయినే అక్బరి 1157) వ్రాతలను అనుసరించి మాలిక్ నాజర్‌కు (ఫాజిల్ రెండవ రాజు ) అహమద్ - 1 (గుజరాత్) (1411-1443) ఖాన్ అనే బిరుదు ఇచ్చిన తరువాత ఈ ప్రదేశానికి ఖండేష్ అనే పేరు వచ్చిందని భావిస్తున్నారు.
మరొక కథనం అనుసరించి మహాభారతంలో వర్ణించబడిన ఖాండవప్రస్థం ఇదే అని అందువలన ఇది ఖండేష్ అయిందని భావిస్తున్నారు. తోరణ్మల్ పాలకుడు యువంషవ పాండవులతో యుద్ధంచేసాడని సూచించబడింది.
క్రీ.పూ 3 వ శతాబ్దం నాటి నాసిక్ సమీపంలో ఉన్న అజంతా గుహాలయాలు ఉన్నాయి. ఖండేష్‌ను బుద్ధమతావలంబీకులు అధికంగా పాలించారు. తరువాత ఇది సప్తవననాస్, ఆంధ్రభ్రిత్యాలు, విర్సెన్ (అహిర్ రాజు), యువన్ సామ్రాజ్యం, చాళుక్యులు, యాదవులు, అలావుద్దీన్ ఖిల్జీ, మొహమ్మద్ తుగ్లక్, మాలిక్ రాజ మాలిక్ నాజర్, ది నాజిర్, ది నిజాం ఆఫ్ హైదరాబాదు, మరాఠీలు పాలించారు.
18వ శతాబ్దంలో ఖండేష్‌ను బ్రిటిష్ సైన్యాలు ఈ ప్రాంతాన్ని (హోల్కర్ - ధూలే) ఆక్రమించుకున్నారు. తరువాత ఖండేష్ పాలనకు మొదటి అధికారిగా రాబర్ట్ గిల్ల్ నియమించబడ్డాడు. 1906లో జలగావ్ జిల్లాగా రూపొందించబడింది.
జిల్లాలోని పరోలా తాలూకాలో ఉన్న కోట ఝాంసీ రాణి నిర్మించిందని భావిస్తున్నారు. 1936లో యవాల్ తాలూకాలోని ఫాజిల్ వద్ద ఆల్ ఇండియ కాంగ్రెస్ సభ నిర్వహించబడింది. ప్రఖ్యాత కవి బహినబాయి చౌదరి స్వస్థలం జలగావ్. ఆయన అహిరిని మాండలికానికి గుర్తింపు తీసుకు వచ్చాడు. సానే గురూజి బాల్కవి తొమెరే కవిత్వంతో ప్రజలను మేలుకొలిపేవాడు. జలగావ్ ^కు చెందిన ఎన్.డి మహానూర్ కవిగా తనకుతాను నిరూపించుకున్నాడు.
1601లో అక్బర్ ఈ ప్రాంతాన్ని ముగల్ సామ్రాజ్యంతో విలీనం చేసుకున్నాడు. తరువాత ఈ ప్రాంతం నిజాం తరువా మరాఠీల ఆధీనంలోకి వచ్చింది. 18 వ శతాబ్దం ఆరంభంలో ఈ ప్రాంతం హోల్కర్ పాలన నుండి బ్రిటిష్ పాలనలోకి మారింది. తరువాత ధులియా కేంద్రంగా ఖండేష్ జిల్లా రూపొందించబడింది. 1906లో ఖండేష్ జిల్లా రెండు జిల్లాలుగా విభజించబడ్డాయి. ప్రస్తుత జలగావ్ రాజధానిగా ఉన్న జలగావ్ జిల్లాను తూర్పు ఖండేష్ అనేవారు. 1956లో రాష్ట్రాల పునర్విభజన తరువాత తూర్పు ఖండేష్ జిల్లా బొంబాయి రాష్ట్రంలో భాగం అయింది. తరువాత 1960 మే 1 న మహారాష్ట్రా జిల్లా రూపొందించిన తరువాత ఈ జిల్లా మహారాష్ట్రా జిల్లాలో భాగం అయింది. 1960 అక్టోబరు 21 తూర్పు ఖండేష్ జిల్లా జలగావ్ జిల్లాగా మార్చబడింది.
ఫ్యాక్టరీ పేరు | ప్లేస్ | తాలూకాను | |
---|---|---|---|
మధుకర్ | జీవ్రామ్నగర్, ఫాఇజ్పుర్ | యావల్ | |
బెల్గంగ | భొరస్ | చలిస్గఒన్ | |
వసంత్ | కసొద | ఎరందొల్ | |
సంత్ ముక్తబై | ఘొదస్గఒన్ | ముక్తైనగర్ | |
చొపద శేత్కారి | చొపద | చొపద | |
జమ్నెర్ తాఉక | గొంద్ఖెల్ | జమ్నెర్ | |
వివేక్ పాటిల్ | ఎం.ఐ.డీ.సి | జాల్గాఓన్ |
ఈ జిల్లాలోని ప్రధాన పరిశ్రమలు ఉన్నాయి:
జిల్లా ఈశాన్య సరిహద్దులో తపి నది ప్రవహిస్తుంది. తపి నది మొత్తం 724 కి.మీ. మహారాష్ట్రలో 208 కి.మీ ప్రవహిస్తుంది. గిరానా నది జిల్లాలో ప్రవహిస్తుంది. గిరానా నది నాసిక్‌లోని కల్వన్ ఉపవిభాగంలో సప్తశృంగి పర్వతాలలో జన్మిస్తుంది. తరువాత ఉత్తర భూభాగంలో ప్రవహిస్తున్న సెలఏర్లు ఈ నదిలో సంగమిస్తున్నాయి. గిరినా నది 150 కి.మీ ప్రవహించిన తరువాత నందర్ తపినదిలో సంగమిస్తుంది. తపి నది నాసిక్‌లో తూర్పు వైపుగా నేరుగా ప్రవహిస్తుంది. జలగావ్ నుండి కొంచెం ఉత్తరదిశగా తపినదికి సమాంతరంగా సాగుతుంది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 4,224,442,[4] |
ఇది దాదాపు. | కాంగో దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | కెంటకీ నగర జనసంఖ్యకు సమం.[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 46వ స్థానంలో ఉంది.[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | 359 [4] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 14.71%.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 922:1000 [4] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 79.73%.[4] |
జాతియ సరాసరి (72%) కంటే. |
జిల్లాలో ఖండేష్ భాషాకుటుంబానికి చెందిన అహిరాని భాష వ్యవహార భాషగా వాడుకలో ఉంది. అహిరానీ భాషకు " 7,80,000 మంది వాడుకరులు ఉన్నారు. అహిరానీ భాష మారాఠీ , భిలీ భాషను పోలి ఉంటుంది.[7] భిల్ భాషాకుటుంబానికి చెందిన బరేలీ భాషకు మద్యప్రదేశ్‌లో 10,000 మది వాడుకరులు ఉన్నారు. [8] , భిల్ భాషాకుటుంబానికి చెందిన బరేలీ రథ్వీ భాషకు 64,000 మంది వాడుకరులు ఉన్నారు. ఈ భాషను వ్రాయడానికి దేవనాగరి లిపిని వాడుతున్నారు.[9]
జిల్లాలో ప్రధానంగా మరాఠీ భాషా వార్తాపత్రికలు ప్రచురించబడుతున్నాయి : దేష్దూత్, దేశోన్నతి, లోక్మాత, సకల్, దివ్య మరాఠీ, మహారాష్ట్ర.
* లో పతనదెవి పతనదెవి ఆలయంలో '
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.