Remove ads
మహారాష్ట్ర లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
మారాష్ట్ర రాష్ట్ర జిల్లాలలో ధూలేజిల్లా (హిందీ:) ఒకటి. ధూలే పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.1998 జూలై 1న ధూలే జిల్లా రెండు ప్రత్యేక జిల్లాలుగా (ధూలే, నందూర్బార్) విభజించబడ్డాయి. పురాతన కాలం గిరిజన ప్రజలు నివసించిన ప్రాంతాలు ఈ జిల్లాలో ఉన్నాయి.జిల్లా ప్రజలలో వ్యవసాయం ప్రధాన జీవనోపాధిగా ఉంది. జిల్లాలో అత్యధికభాగంలో నీటిపారుదల వసతులు లేవు కనుక వ్యవసాయం అధికంగా వర్షాధారితంగా ఉంది. గోధుమ, బజ్రా, జొన్న, ఎర్రగడ్డలు వంటి పంటలతో పత్తి వంటి వాణిజ్యపంటలు కూడా పండించబడుతున్నాయి. గ్రామీణ ప్రజలలో అధికులలో అహిరాని భాష వాడుకలో ఉంది. అహిరాని భాష మరాఠీ భాషాకుటుంబానికి చెందిన భాషలలో ఒకటి. నగరప్రాంతాలలో మరాఠీ భాష వాడుకలో ఉంది.[1] ధూలే మహారాష్ట్రలోని ఖండేష్ భూభాగంలో ఉంటూ ఉండేది. పాలనా సౌలభ్యం కొరకు నాసిక్ విభాగంలో భాగం చేయబడింది.
ధూలే జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
డివిజను | నాసిక్ |
ముఖ్య పట్టణం | Dhule |
మండలాలు | 1. Dhule, 2. Shirpur, 3. Sindkheda, 4. Sakri |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | 1. Dhule (shared with Nashik District), 2. Nandurbar (ST) (shared with Nandurbar District) (Based on Election Commission website) |
విస్తీర్ణం | |
• మొత్తం | 8,063 కి.మీ2 (3,113 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 17,07,947 |
• జనసాంద్రత | 210/కి.మీ2 (550/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 71.6% |
• లింగ నిష్పత్తి | 944 |
ప్రధాన రహదార్లు | NH-3, NH-6, NH-211 |
సగటు వార్షిక వర్షపాతం | 544 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
ధూలే జిల్లా పుర్వం పశ్చిమ ఖండేష్ జిల్లాగా పిలువబడింది. జిల్లా ప్రాంతం పురాతన కాలంలో రసిక అని పిలువబడింది. తరువాతి కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా సెయునచంద్ర తరువాత ఈ ప్రాంతం ఈ ప్రాంతం సెయినదేశ అని పిలువబడింది. తరువాత ఇది ఖండేష్ అయింది.
సరిహద్దు వివరణ | జిల్లా |
---|---|
తూర్పు సరిహద్దు | బేరర్ (పురాతనకాల విదర్భ) |
ఉత్తర సరిహద్దు | నెమాడ్ (పురాతనకాల అనుపా) |
దక్షిణ సరిహద్దు | ఔరంగాబాదు (పురాతనకాల ములక), భీర్ (అస్మక) |
సరిహద్దు |
ఆర్యులు దక్షిణ భారతంలో ప్రవేశించే కాలంలో మహర్షి అగస్త్యుడు వింధ్య ప్రాంతాలను దాటి గోదావరీ తీరంలో కొంతకాలం నివసించడానికి మొదటిసారిగా ఈ ప్రాంతాన్ని దాటి ప్రయాణించాడు. ఈ ప్రాంతం అశోకసామ్రాజ్యంలో భాగంగా ఉండేది. మౌర్య సామ్రాజ్యాన్ని పడగొట్టి పుష్యమిత్ర ఈ ప్రాంతంలో శుంగ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. తరువాత ఈ ప్రాంతాన్ని శాతవాహనుడు పాలించాడు.
సా.శ. 250 లో శాతవాహనులను తొలగించి పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతం (ఈశ్వరసేన) మీద అహిరాలు ఆధిక్యత సాధించారు. ఖండేష్‌ను పాలించిన అహిరాల గురించిన తాంరపత్రాలు గుజరాత్ లోని కలచాల, అజంతా గుహలలో లభించాయి. శాతవాహనుల పతనం తరువాత విదర్భప్రాంతాన్ని వాకాటకులు పాలించారు. వాకాటకులను త్రోసి రాష్ట్రకూటులు ఈ ప్రాంతానికి పాలకులు అయ్యారు. తరువాత ఈ ప్రాంతాన్ని చాళుక్యులు, యాదవులు పాలించారు.
క్రీ.పూ 1296లో అల్లావుద్దీన్ ఖిల్జీ రామచంద్ర యాదవ్ మీద దండయాత్ర చేసిన సమయంలో రాంచంద్రయాదవ అల్లావుద్దీన్ ఖిల్జీకిపెద్ద మొత్తంలో కప్పం చెల్లించాడు. తరువాత ఆయన కుమారుడు శంకరగణ ఢిల్లీకి కప్పం కట్టడం నిలిపివేసాడు. అందువలన సా.శ. 1318లో మాలిక్ కాఫర్ శకరగణను ఓడించి వధించాడు.
1345లో దేవగిరిని హాసన్ గంగు స్వాధీనం చేదుకున్నాడు. హాసన్ గంగు బహ్మనీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. .
1370లో ఫిరోజ్ తఘ్లక్ థాల్నర్, కరవంద జిల్లాలను ఫరూకీ సామ్రాజ్య స్థాపకుడు మాలిక్ రాజా ఫరూకీకు స్వాధీనం చేసాడు. రాజా ఫరూకకి థాల్నర్ సామ్రాజ్య స్థాపన చేసాడు. గుజరాత్ గవర్నర్ మాలిక్ రాజాను " సిపాహ్సలర్ ఆఫ్ ఖండేష్ " అనే బిరుదుతో సత్కరించాడు. లిటిల్ ఖాన్ పాలన తరువాత ఈ ప్రాంతం ఖండేష్ (ఖాన్ దేశం) అని పిలువబడింది. అసిర్ గడ్కు చెందిన అహిర్ ఆశా కాలంలో పలు దుకాణాలలో మొక్కజొన్న విక్రయించబడింది. బధిత కుటుంబాలకు ఉపాధి కల్పించడానికి ఆశా మాసోనీ వద్ద ఉన్న పాత గోడను పడగొట్టి సరికొత్తగా కోటను నిర్మించాడు. ఆశా శరీరశ్రమ చేయలేని ముసలి వారికి, బలహీనులకు ఆహారం సరఫరాచేసాడు.అపారమైన సంపద, బలమైన కోట ఉన్నప్పటికీ అహిర్ రాజు మాలిక్ రాజా సార్వభౌమత్వాన్నికి తలవంచి యుద్ధం ద్వారా కలిగే రక్తపాతాన్ని తప్పించాడు.
మాలిక్ నాసిర్ అసిర్గాడ్ను స్వాధీనం చేసుకుని తన రాజధానిగా చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. మాలిక్ నాసిర్ ఆశాకు వ్రాసిన లేఖలో " బగ్లన, అంతూర్ , ఖెర్లా సంస్థానధీశులు తనకు వ్యతిరేకంగా ఉన్నారు " అని తెలియజేసాడు. మాలిక్ నాసిర్ తన కుటుంబానికి సురక్షితమైన ఆశ్రయం కల్పించని కోరాడు. ఆశా మాలిక్ నాసిర్ కుటుంబానికి సురక్షితమైన నివాసాలను ఏర్పాటు చేసాడు. తరువాత నివాసాలలో అసరఘడ్ నుండి వచ్చిన పాలకీలలో స్త్రీలను నివసింపజేసారు. వారిని ఆశా భార్య, కుమార్తె ఆహ్వానించారు. మరుసటి దినం మరొక 200 వచ్చి చేరాయొ. ఆశా తన కుమారునితో వారిని ఆహ్వానించడానికి వెళ్ళగా వారంతా సాయుధులైన సైనికులని తెలుసుకుని ఆశ్చర్యచకితుడు అయ్యాడు. వారు ఆహ్వానించడానికి వెళ్ళిన ఆశా, ఆయన కుమారులను వధించారు. కుటుంబంలో ఒక్క మగ సంతానం కూడా ప్రాణాలతో మిగలలేదు. తరువాత అసిర్గాడ్కు మాలిక్ నాసర్‌కు అభినందనలు తెలపడానికి వచ్చాడు. తరువాత షైక్ జైన్ ఉద్దీన్ శిష్యుడు మాలిక్ నాసర్‌ను ఆశీర్వదించడానికి వచ్చాడు. ఆయన సలహామీద మాలిక్ నాసిర్ తపీ నదీ తీరంలో రెండు నగరాలను నిర్మించాడు. తూర్పు తీరంలో నిర్మించిన నగరానికి జైనాబాద్ (షైక్ జైనుద్దీన్ స్మృత్యర్ధం), పశ్చిమతీరంలో నిర్మించిన నగరానికి బుర్హన్ పూర్ (దౌలతాబాద్‌కు చెందిన బుర్హనుద్దీన్ స్గేక్ స్మృత్యర్ధం) అని పేరు నిర్ణయించబడింది.
1601 జనవరి 6న ఖందేష్ అక్బర్ సామ్రాజ్యంలోకి చేర్చబడింది. ఖండేష్కు అక్బర్ దండేస్ (అక్బర్ కుమారుడు దనియాల్ స్మృత్యర్ధం) అని నామకరణం చేసాడు. 1634లో ఖండేష్ సుబాహ్ చేయబడింది.
1818 జూన్ 3 న పేష్వా తనకు తానే బ్రిటిష్ ప్రభుత్వానికి లొంగిపోయాడు. 1906లో ప్రత్యేక జిల్లాగా విభజించే వరకు ఈ ప్రాంతం ఖండేష్ జిల్లాలో భాగంగా ఉంది. .
విషయాలు | వివరణలు |
---|---|
వాతావరణ విధానం | పొడి వాతావరణం (నైరుతీ ౠతుపవనాల సమయంలో మినహా) |
సీజన్లు | 4 శీతాకాలం, |
శీతాకాలం | డిసెంబరు- ఫిబ్రవరి |
వేసవి కాలం | మార్చి- మే |
నైరుతీ ౠతుపవనాలు | జూన్- సెప్టెంబరు |
వర్షాకాలానంతర సీజన్ | అక్టోబరు- నవంబరు |
వర్షపాతం | 674.0 మి.మీ |
పశ్చిమ దిశలో ఉన్న కొండప్రాంతం, సాత్పురా పర్వతశ్రేణి వద్ద వర్షపాతం అధికంగా ఉంటుంది. పశ్చిమ సరిహద్దులో ఉన్న నవాపూర్ వద్ద వార్షిక వర్షపాతం 1097.1 మి.మీ. నైరుతీ ౠతుపనాలు 88% వర్షపాతం అందిస్తాయి. జూలై మాసంలో అత్యధికంగా వర్షం కురుస్తుంది. వర్షాకాలం తరువాత ఉరుములతో కూడిన ఝల్లులు కురుస్తుంటాయి.
నైరుతీ ౠతుపవనాల సమయంలో మినహా వర్షపాతం గాలిలో తేమ 70% ఉంటుంది. వేసవిలో గాలిలో తేమ 20% - 25% ఉంటుంది.
విషయాలు | వివరణలు |
---|---|
వేసవి గరిష్ఠఉష్ణోగ్రత | 40.7 డిగ్రీల సెల్షియస్ |
వేసవి కనిష్ఠఉష్ణోగ్రత | 25.80 డిగ్రీల సెల్షియస్ |
అత్యధిక వేసవి ఉష్ణోగ్రత | 45 డిగ్రీల సెల్షియస్ |
వడగాలులు | ఏప్రిల్- మే |
శీతాకాల గరిష్ఠఉష్ణోగ్రత | 30.'3 డిగ్రీల సెల్షియస్ |
శీతాకాల కనిష్ఠఉష్ణోగ్రత | 16.2 డిగ్రీల సెల్షియస్ |
అత్యల్ప ఉష్ణోగ్రత | 8-9 డిగ్రీల సెల్షియస్ |
అత్యధిక చల్లని మాసం | జనవరి |
వేసవిలో మధ్యాహ్నవేళలలో కురిసే ఉరుములతో కూడిన వర్షం వేసవి తాపానికి ఉపశమనం కలిగిస్తూ ఉంటుంది. జూన్ మాసం రెండవ వారంలో జిల్లాలో ప్రవేశించే నైరుతీ ౠతుపవనాలు ఉష్ణోగ్రతను తగ్గుముఖం పట్టించి వాతావరణాన్ని ఆహ్లాదంగా మారుస్తుంటాయి. అక్టోబరు మాసానికి వర్షాలు తగ్గుముఖం పడతాయి.
వేసవి, వర్షాకాలంలో గాలులు వేగంగా వీస్తాయి. నైరుతీ ౠతుపవనాలు వీస్తున్న సమయంలో గాలులు నైరుతి నుండి పశ్చిమం దిశాగా వీస్తుంటాయి. వర్షాకాలం తరువాత గాలి వేగం తగ్గి ఉదయపు వేళలో గాలి ఈశాన్యం నుండి తూర్పు దిశగా వీస్తుంది. వేసవి, శీతాకాలాలలో గాలి నైరుతి నుండి ఈశాన్యం దిశగా వీస్తుంటాయి కొన్ని మద్యాహ్నవేళలలో గాలి ఈశాన్యం నుండి ఉత్తర దిశగా వీస్తాయి.
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ధూలే జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మహారాష్ట్ర రాష్ట్ర 12 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[2]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,048,781,[3] |
ఇది దాదాపు. | బోత్సువానా దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 223 వ స్థానంలో ఉంది.[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 285 .[3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 19.96%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 941:1000 [3] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 74.61%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. |
జిల్లాలో వాడుకలో ఉన్న భాషలలో అహిరి భాష, ఖందేషి భాష (మరాఠీ భాషను పోలి ఉండి 7,80,000 మంది వాడుక భాషగా ఉంది), [6] భిలలి (11,50,000 మందికి వాడుక భాషగా ఉంది)[7] బరేలి పల్యా (10.000 మందికి వాడుక భాషగా ఉంది) [8] బరేలీ పౌరీ (దేవనాగరి లిపిలో వ్రాయబడే బరేలీ పౌరీ భాష 1,75,000 మందికి వాడుకభాషగా ఉంది)[9] బరేలీ రథ్వి (64, 000 మందికి వాడుక భాషగా ఉంది)[10] వాడుకలో ఉన్నాయి.
విషయాలు | వివరణలు |
---|---|
ఉప విభాగాలు | 2 ధూలే ఉపవిభాగం, షిర్పూర్ ఉపవిభాగం |
తాలూకాలు | 4 ధూలే, సఖి, షిర్పూర్, సింద్ఖెడా |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.