Map Graph

ధూలే జిల్లా

మహారాష్ట్ర లోని జిల్లా

మారాష్ట్ర రాష్ట్ర జిల్లాలలో ధూలేజిల్లా (హిందీ:) ఒకటి. ధూలే పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.1998 జూలై 1న ధూలే జిల్లా రెండు ప్రత్యేక జిల్లాలుగా విభజించబడ్డాయి. పురాతన కాలం గిరిజన ప్రజలు నివసించిన ప్రాంతాలు ఈ జిల్లాలో ఉన్నాయి.జిల్లా ప్రజలలో వ్యవసాయం ప్రధాన జీవనోపాధిగా ఉంది. జిల్లాలో అత్యధికభాగంలో నీటిపారుదల వసతులు లేవు కనుక వ్యవసాయం అధికంగా వర్షాధారితంగా ఉంది. గోధుమ, బజ్రా, జొన్న, ఎర్రగడ్డలు వంటి పంటలతో పత్తి వంటి వాణిజ్యపంటలు కూడా పండించబడుతున్నాయి. గ్రామీణ ప్రజలలో అధికులలో అహిరాని భాష వాడుకలో ఉంది. అహిరాని భాష మరాఠీ భాషాకుటుంబానికి చెందిన భాషలలో ఒకటి. నగరప్రాంతాలలో మరాఠీ భాష వాడుకలో ఉంది. ధూలే మహారాష్ట్రలోని ఖండేష్ భూభాగంలో ఉంటూ ఉండేది. పాలనా సౌలభ్యం కొరకు నాసిక్ విభాగంలో భాగం చేయబడింది.

Read article
దస్త్రం:Dhule_in_Maharashtra_(India).svgదస్త్రం:Laling_Waterfalls_Dhule.jpg
Nearby Places
Thumbnail
ధూలే