From Wikipedia, the free encyclopedia
చెంచులక్ష్మి, 1958లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇది తెలుగు, తమిళ భాషలలో విడుదలయ్యింది. (ఇదే పేరుతో 1943లో ఒక సినిమా వచ్చింది.) ఈ సినిమాలో మొదటి భాగంలో ప్రహ్లాదుని కథను, రెండవ భాగంలో చెంచులక్ష్మి కథను చూపారు. మొదటి భానుమతిని ఎంపిక చేశారు. తరువాత ఆ పాత్రకు అంజలీదేవిని తీసుకొన్నారు. ఈ సినిమా విడుదలైనపుడు విష్ణువు గెటప్‌లో ఉన్న అక్కినేని నాగేశ్వరరావు కాలెండర్లను థియేటర్ల వద్ద అమ్మారు. ఈ సినిమాలో పాటలు జనప్రియమయ్యాయి.
చెంచులక్ష్మి (1958 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.ఎ.సుబ్బారావు |
---|---|
కథ | సదాశివ బ్రహ్మం |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు (విష్ణువు, నరహరి), అంజలీదేవి (ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి) ఎస్వీ రంగారావు (హిరణ్య కశిపుడు) పుష్పవల్లి (లీలావతి) మాస్టర్ బాబ్జీ (ప్రహ్లాదుడు) రేలంగి (నారదుడు) నాగభూషణం (శివుడు) గుమ్మడి వెంకటేశ్వరరావు (దూర్వాసుడు) నల్ల రామమూర్తి వంగర సీతారాం అంగముత్తు |
సంగీతం | సాలూరు రాజేశ్వరరావు |
గీతరచన | ఆరుద్ర, కొసరాజు, సముద్రాల, సదాశివ బ్రహ్మం |
సంభాషణలు | సదాశివ బ్రహ్మం |
నిర్మాణ సంస్థ | బి.ఎ.ఎస్.ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
అహోబిల తెగకు చెందిన శిఖనాయకుడు తనకొక కుమార్తెను ప్రసాదించమని విష్ణుమూర్తిని ప్రార్థించాడు. అలా వరమిచ్చిన విష్ణువు ఆమెను తానే పెండ్లాడుతానని చెప్పాడు. అలా కొండజాతి నాయకునికి పుట్టిన బిడ్డ "చెంచులక్ష్మి". సాహసవతిగా పెరిగి పెద్దయ్యింది. విష్ణుమూర్తి నరహరి రూపంలో భూలోకానికి వచ్చి ఆ లక్ష్మితో ప్రేమలో పడ్డాడు. నరహరి అసలు రూపం తెలియని నాయకుడు అనేక పరీక్షలు పెట్టి ఆపై తన కుమార్తెను నరహరికిచ్చి పెళ్ళి చేశాడు.
పాత్ర | నటి / నటుడు |
---|---|
విష్ణువు | అక్కినేని నాగేశ్వరరావు |
లక్ష్మీదేవి/చెంచులక్ష్మి | అంజలీ దేవి |
హిరణ్యకశిపుడు | ఎస్.వి. రంగారావు |
నారదుడు | రేలంగి వెంకట్రామయ్య[1] |
ప్రహ్లాదుడు | మాస్టర్ బాలాజీ |
చెంచు రాణి | సంధ్య |
శివుడు | నాగభూషణం |
ఋష్యేంద్రమణి | |
దూర్వాసుడు | గుమ్మడి వెంకటేశ్వరరావు |
లీలావతి | పుష్పవల్లి |
చండామార్కులు | వంగర వెంకట సుబ్బయ్య |
ఎ.వి. సుబ్బారావు | |
నల్ల రామమూర్తి |
పాట | రచయత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఆనందమాయే అలి నీలవేణీ అరుదెంచినావా అందాలదేవీ | ఆరుద్ర | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల, జిక్కి |
కనలేరా కమలాకాంతుని అదిగో కనలేరా భక్త పరిపాలుని అదిగో కనలేరా శంఖ చక్రధారిని | సదాశివబ్రహ్మం | సాలూరు రాజేశ్వరరావు | పి.సుశీల |
కానగరావా ఓ శ్రీహరి రావా ప్రాణసఖా నను చేరగ రావా | ఆరుద్ర | సాలూరు రాజేశ్వరరావు | జిక్కి, ఘంటసాల |
చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా, చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మల చిగురు కోయగలవా | ఆరుద్ర | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల, జిక్కి |
నీల గగన ఘనశ్యామా ఘనశ్యామా దేవా హాని కలిగితే అవతారాలను పూని బ్రోచునది నీవే కావా | ఆరుద్ర | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల |
పాలకడలిపై శేష తల్పమున పవళించేవా దేవా బాలుని నను దయపాలించుటకై కనిపించేవ మహానుభావా | సదాశివబ్రహ్మం | సాలూరు రాజేశ్వరరావు | పి.సుశీల |
శ్రీనాధుని పద సరసిజ భజనే ఈ నరజన్మము కనిన ఫలం | సముద్రాల రాఘవాచార్యులు | సాలూరు రాజేశ్వరరావు | పి.సుశీల బృందం |
01.ఇందుగలదండు లేడని సందేహము వలదు,(పద్యం), పి సుశీల ,మాధవపెద్ది ,భాగవతము నుండి
02. ఎంత దయామతివయ్యా అనంతా, పి సుశీల, రచన : సదాశివ బ్రహ్మం
03. ఎవడురా విష్ణుండురా ఎవడురా జిష్ణుండురా - మాధవపెద్ది సత్యం, రచన: ఆరుద్ర
04. కరుణాలవాలా ఇదు నీదు లీల అంతయును వింత పొగడగ నేనెంత - ఘంటసాల, రచన:ఆరుద్ర
05. చదివించిరి నను గురువులు, పి సుశీల,భాగవతం నుండి
06. చెయ్యి చెయ్యి కలుపుదాం చిందులేసి కులుకిదాం - ఎ.పి.కోమల, జిక్కి బృందం, రచన:కొసరాజు
07.అధినాథుని పత్ని కూడ విధికి బానిసే ,ఘంటసాల, రచన:ఆరుద్ర
08. చిలకా గోరొంకా కులుకే పకా పకా నేనై చిలకెతే నీవే గోరొంక - జిక్కి, ఘంటసాల,రచన:ఆరుద్ర
09.చిలకా గోరింక కులుకే పకా పకా , పి.సుశీల, పి బి శ్రీనివాస్, రచన:ఆరుద్ర
10. నాడు హిరణ్యకసిపుడు అనర్గళ (పద్యం) - ఘంటసాల రచన: తాపీ ధర్మారావు
.11. పరాభవమ్మును సహింతునా నే పరాక్రమించక - మాధవపెద్ది సత్యం, రచన:ఆరుద్ర
12. మందార మకరంద, పి .సుశీల ,భాగవతం నుండి
13. మహాశక్తిమంతులైనా నిజము తెలియలేరయ్యో నిజం - ఘంటసాల, రచన: ఆరుద్ర
14. మరపురాని మంచిరోజు నేడు వచ్చెనే ముచ్చటైన వినోదము - జిక్కి, ఘంటసాల బృందం, రచన: ఆరుద్ర
15. మా చిన్ని పాపాయీ చిరునవ్వేలరా మరి నిదురింపరా - జిక్కి, రచన: సదాశివ బ్రహ్మం
16.అఖిల జగములకును హరియే మూలవిరాట్(పద్యం) రచన:ఆరుద్ర, గానం.పి బి.శ్రీనివాస్
17.ఆది మధ్యాంత రహితుడైనట్టి హరిని(పద్యం), పి సుశీల, రచన:సదాశివ బ్రహ్మం
18.ఏడేడు లోకాల ఏలికా నీపైన పాడగా, ఘంటసాల
19.కంజాక్షునకుగాని కాయంబు కాయమే (పద్యం),భాగవతము నుండి
20.కాంత చేతిలో ఏ మంత్రమున్నధో ,ఘంటసాల, రచన:ఆరుద్ర
21.కాళ్లకు గజ్జెలు కట్టి కంటికి కాటుక పెట్టి , పిఠాపురం నాగేశ్వరరావు, ఎ.పి.కోమల బృందం, రచన:కొసరాజు
22.క్షీర సాగరము వీడక నిరతము ,ఘంటసాల, రచన:ఆరుద్ర
23.బ్రహ్మ ఇచ్చెను వరములు తెచ్చెను , ఘంటసాల, రచన:ఆరుద్ర
24.హే ప్రభో దీన దయాళ్లో రక్షింపు, వైదేహి
25.వతుతరుణి నీతి శాస్త్ర జయపారగ చేసేదనంటు,(పద్యం), మాధవపెద్ది సత్యం.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.