ప్రపంచం సీతారాం

From Wikipedia, the free encyclopedia

డా. ప్రపంచం సీతారాం వేణుగాన విద్వాంసుడు. అతను చిన్నతనంలోనే సంగీత రసజ్ఞలనలరించారు.

త్వరిత వాస్తవాలు డా. ప్రపంచం సీతారాం, మూలం ...
డా. ప్రపంచం సీతారాం
మూలంఆంధ్రప్రదేశ్, భారతదేశం
సంగీత శైలిక్లాసికల్ సంగీతం, కర్ణాటక సంగీతం
వృత్తివేణుగాన కళాకారుడు, స్వరకర్త
క్రియాశీల కాలం1950- 1 జూన్ 2014
మూసివేయి

జీవిత విశేషాలు

అతను విజయవాడలో 1942 సెప్టెంబరు 21న జన్మించారు. ఆకాశవాణిలో 1980 లో చేరడానికి ముందు ఢిల్లీ లోని అశోకా హోటల్లో వేణుగాన విద్వాంసులుగా పనిచేశాడు. యు.పి.ఎస్.సి. ద్వారా 1976 లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా సెలక్ట్ అయి మదరాసులో పనిచేశాడు. అసిస్టెంట్ స్టేషను డైరక్టరుగా 1985 నవంబరు 11 నుండి విజయవాడలో పనిచేశాడు. డైరక్టరేట్ లో సంగీత విభాగం చీఫ్ ప్రొడ్యూసర్ గా నాలుగేళ్లు పనిచేశాడు. 1993 లో స్వచ్ఛంద పదవీ విరమణానంతరం తిరుపతిలోని పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో సంగీతం ప్రొఫెసర్ గా చేరాడు. సంగీతంలో సీతారాం డాక్టరేట్ పొందాడు. విద్వాంసులుగా సీతారాం పేరొందారు. ఆయన వయోలిన్ వాద్యవిద్వాంసుడు అన్నవరపు రామస్వామి శిష్యుడు..[1][2][3][4][5][6]

అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు. అతని కుమారుడు ప్రసన్న కాలిఫోర్నియో లో నివసిస్తున్నాడు. సీతారాం అట్లాంటా, యుఎస్ లో 2014 జూన్ 1న మరణించాడు.

పురస్కారాలు

  • 2009లో సంగీత కళాశిఖామణి పురస్కారం, భారతీయ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ, చెన్నై

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.