ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళల విద్యాభివృద్ధి కొరకు 1983వ సంవత్సరంలోఎన్.టి. రామారావు ముఖ్య మంత్రిగా వున్నప్పుడు శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేసారు. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని ఏకైక మహిళా విశ్వ విద్యాలయం. ఇది తిరుపతి జిల్లా ప్రముఖ పట్టణమైన తిరుపతిలో- పవిత్ర తిరుమల కొండ పాదాల చెంత సుమారు 138 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించ బడివున్నది. మొదట్లో 10 ఫాకల్టీలతో, 300 మంది విద్యార్థులతో, 25 మంది ఉద్యోగులతో ప్రారంబమైన ఈ విశ్వ విద్యాలయం కాల క్రమేణ ఎంతో అభి వృద్ధి చెందినది.

Sri Padmavathi Mahila University Entrance
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ప్రవేశం
త్వరిత వాస్తవాలు రకం, స్థాపితం ...
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయము
రకంపబ్లిక్
స్థాపితం1983
ఛాన్సలర్బిశ్వభూషణ్ హరిచందన్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్
వైస్ ఛాన్సలర్దువ్వూరు జమున
స్థానంతిరుపతి, ఆంధ్రప్రదేశ్, భారత్
జాలగూడుhttps://www.spmvv.ac.in
మూసివేయి

ఈ విశ్వ విద్యాలయంలోని ఇంజనీరింగు సంబంధిత కోర్సులలో ఆంధ్రా ప్రాంతం వారికి 43 శాతం, తెలంగాణా ప్రాంతం వారికి 36 శాతం, రాయలసీమ ప్రాంతం వారికి 22 శాతం కేటాయించ బడ్డాయి. ఈ విశ్వవిద్యాలయం నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ద్వారా నాలుగు నక్షత్రాల గుర్తింపు పొందింది. ప్రొఫెసర్ దువ్వూరు జమున 2020 జనవరిలో వైస్ ఛాన్సలర్ గా నియమితులయ్యారు.[1]

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లంకెలు

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.