సంధ్య (నటి)
నటి From Wikipedia, the free encyclopedia
సంధ్య (వేదవల్లి) తెలుగు సినిమా నటి. మాయాబజార్ చిత్రంలో రుక్మిణి పాత్రధారి.ఆమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమారి జయలలితకు తల్లి.
సంధ్య | |
---|---|
జననం | వేదవల్లి 1924 శ్రీరంగం, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా |
మరణం | 1971 |
ఇతర పేర్లు | వేదవల్లి |
క్రియాశీల సంవత్సరాలు | 1954 నుండి 1965 |
వీటికి ప్రసిద్ధి | సినిమా నటి |
జీవిత భాగస్వామి | జయరామన్ |
భాగస్వామి | జయరామన్ |
పిల్లలు | జయకుమార్, జయలలిత |
బంధువులు | అంబుజవల్లి (నటి) |
జీవిత విశేషాలు
ఆమె బ్రిటీష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీలోని శ్రీరంగంలో తమిళ బ్రాహ్మణ కుటుంబంలో 1924 లో జన్మించింది. ఆమె అసలు పేరు "వేదవల్లి". సంధ్య పేరుతో సినిమా నటిగా వెలుగొంందింది. 1950లో తన 26వ యేట తన భర్త జయరామన్ మరణించాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. వారు జయకుమార్, జయలలిత. ఆమె భర్త జయరామన్ మరణించేనాటికి జయలలిత వయస్సు రెండేళ్ళు.[1] ఆమె భర్త జయరామన్ లాయరుగా పని చేసేవాడు.[2] జయరామన్ మరణించిన తర్వాత బెంగళూరులో ఉంటున్న పుట్టింటికి కూతురితో సహా చేరింది వేదవల్లి. కుటుంబ బాధ్యతను మోయడం కోసం వేదవల్లి టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకొని, గుమస్తాగా పని చేయడం మొదలుపెట్టింది. తర్వాత మద్రాసులో ఎయిర్‌హోస్టెస్‌గా, రంగస్థల నటిగా కొనసాగుతున్న తన సోదరి అంబుజవల్లి (విద్యావతి) దగ్గరికి వేదవల్లి వెళ్ళింది. ఆమె తన సోదరి అంబుజవల్లి అడుగుజాడలలో నటించింది. దాంతో ఆమె కుమార్తె జయలలిత ఆమెకు దూరంగా అమ్మమ్మ-తాతల దగ్గర పెరిగింది. చిన్నారి జయను వదిలి వేదవల్లి కూడా కుటుంబపోషణ నిమిత్తం 1952లో మద్రాస్‌కు వచ్చేసింది.[3] కూతురికి దూరంగా వేదవల్లి మద్రాసులో ఉంటూ, సంధ్యగా పేరు మార్చుకుని నాటకాల్లోకి, తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. అటుపైన ఆర్థికంగా ఫర్వాలేదనిపించడంతో కుమార్తెను కూడా మద్రాసు తీసుకెళ్ళింది. వాస్తవానికి కూతురిని బాగా చదివించాలన్నది తల్లి సంధ్య ఆశయం. అందుకే, బాల నటిగా పలు అవకాశాలు వచ్చినప్పుడు, ‘అమ్మాయి చదువుకు ఆటంకం లేకుండా షూటింగ్స్ పెడితే ఓకే’ అని ఆమె కండిషన్ పెట్టేది.[4] తదనంతరం ఆమె జయలలిత ను కూడా నటిగా ప్రోత్సహించింది.
ఆమె క్యారెక్టర్ నటిగా, గుర్తింపు పొందిన నటులకు సోదరి లేదా తల్లిగా సహాయక పాత్రలను కూడాఅ పోషించింది. నటి కావడానికి ముందు వ్యవసాయ డైరెక్టరేట్‌లో కార్యదర్శిగా పనిచేసింది.
ఆమె 1971లో మరణించింది.[5]
నటించిన చిత్రాలు
- ఇరుగు పొరుగు (1965)
- నర్తనశాల (1963)
- కులగోత్రాలు (1962)
- శ్రీశైల మహత్యం (1962)
- భార్యాభర్తలు (1961)
- శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం (1960)
- మనసిచ్చిన మగువ (1960)
- కృష్ణలీలలు (1959)
- చెంచులక్ష్మి (1958)
- మాయాబజార్ (1957)
- ప్రేమే దైవం (1957)
- తెనాలి రామకృష్ణ (1956)
- విప్రనారాయణ (1954)
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.