From Wikipedia, the free encyclopedia
కోట శంకరరావు సినీ నటుడు, రంగస్థల నటుడు. ఇతడు నటుడు కోట శ్రీనివాసరావు తమ్ముడు.
కోట శంకరరావు | |
---|---|
జననం | కోట శంకరరావు ఆగస్టు 10 |
విద్య | బి. కాం. |
వృత్తి | సినిమా నటుడు, రంగస్థల నటుడు, టి.వి.నటుడు |
జీవిత భాగస్వామి | భాగ్యలక్ష్మి |
తల్లిదండ్రులు |
|
ఇతడు ఆగస్టు 10న కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో కోట సీతారామాంజనేయులు, విశాలాక్షి దంపతులకు జన్మించాడు. ఇతడు విద్యార్థి దశ నుంచి వివిధ నాటకాల్లో నటించాడు. బి.కాం వరకు చదువుకున్నాడు. ఇతడు బ్యాంకులో మేనేజర్ స్థాయి ఉద్యోగం చేస్తూ నాటకరంగంలోకి వచ్చాడు. దాదాపు 150 నాటకాలు, 80 చలన చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించాడు. అలాగే 64 మెగా టివి సిరియల్స్‌లో కూడా నటించాడు. వీటిలో మూడు సీరియల్స్‌కు నంది అవార్డులు లభించాయి.[1]
Seamless Wikipedia browsing. On steroids.