కోటగిరి వెంకటేశ్వరరావు భారతీయ సినిమా ఎడిటర్. ఈయన సోదరుడు కోటగిరి గోపాలరావు కూడా ఎడిటర్ గా పనిచేశారు.
జీవిత సంగ్రహం
కోటగిరి వెంకటేశ్వరరావు పూర్వీకులు జమీందారు దగ్గర దివాన్లుగా పనిచేశారు.[1] వీరికి ముగ్గురు అన్నయ్యలు, ఇద్దరు అక్కయ్యలు. అందరికన్నా కోటగిరి గోపాలరావు పెద్దవాడు. చిన్నతనంలోనే వీరి తండ్రి మరణించడంతో అన్నగాగే ఇంటి బాధ్యతలను చూశారు. బ్రతుకు తెరువు కోసం మద్రాసు చేరి, జమిందారు స్టుడియోలో ఆదుర్తి సుబ్బారావు లాంటి వారి సినిమాలకు ఎడిటింగ్ చేస్తుండేవారు.
చదువు మీద శ్రద్ధ తగ్గి పదవ తరగతి పాసైన తర్వాత వెంకటేశ్వరరావు కూడా మద్రాసు చేరి మొదట నిశ్చల పొటోగ్రాఫర్ దగ్గర సహాయకునిగా చేరాడు. తర్వాత ఎడిటింగ్ లో చేరి అన్నయ్య దగ్గర పనిలోని మెళుకువలు నేర్చుకున్నాడు. గోపాలరావు అప్పుడు కె.రాఘవేంద్రరావు అడవి రాముడు (1977) సినిమా కోసం పనిచేస్తుండగా తను కూడా రెండు పాటల్ని ఎడిట్ చేసి సహాయం చేశారు. ఇదే తన మొదటి సినిమాగా టైటిల్స్ లో చూపించారు.
తర్వాత రాఘవేంద్రరావు సినిమాలతో పాటు, బి.గోపాల్, భారతీరాజా, ఎన్టీరామారావు మొదలైన ఎందరో సినీ దర్శకుల, నిర్మాతల చిత్రాలకు పనిచేశారు.
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకుడిగా స్థిరపడక ముందు ఇతని దగ్గర ఒక సంవత్సర కాలం ఎడిటింగ్ నేర్చుకున్నారు.
వీరు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికై ఆరు సంవత్సరాలుగా ఎన్నో సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించారు. ఈ సంస్థ కోసం విరాళాలు పోగుచేసి స్వంత ఆఫీసును నిర్మించారు.
వీరు సుజాతను పెళ్ళిచేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు.
పురస్కారాలు
నంది అవార్డులు
- 2004: సై సినిమాకి నంది ఉత్తమ ఎడిటర్
- 2005: సుభాష్ చంద్రబోస్ సినిమాకి నంది ఉత్తమ ఎడిటర్
- 2007: యమదొంగ సినిమాకి నంది ఉత్తమ ఎడిటర్
- 2009: మగధీర సినిమాకి నంది ఉత్తమ ఎడిటర్
- 2010: డార్లింగ్ సినిమాకి నంది ఉత్తమ ఎడిటర్
- 2012: ఉత్తమ ఎడిటర్ (ఈగ)[2][3][4][5]
చిత్ర సమాహారం
- 1977: అడవి రాముడు (మొదటి సినిమా అన్నయ్య కోటగిరి గోపాలరావుతో)
- 1979: యుగంధర్
- 1980: మోసగాడు
- 1981: కొండవీటి సింహం, సత్యభామ
- 1983: అభిలాష
- 1986: కొండవీటి రాజా
- 1987: అగ్ని పుత్రుడు
- 1988: ఆఖరి పోరాటం
- 1990: అగ్గి రాముడు
- 1995: అల్లుడా మజాకా, ఘరానా బుల్లోడు, సూపర్ మొగుడు
- 1998: గిల్లి కజ్జాలు
- 1999: ఇద్దరు మిత్రులు, రాజకుమారుడు, సమరసింహా రెడ్డి, సుల్తాన్
- 2000: పెళ్ళి సంబంధం, వంశీ
- 2001: స్టూడెంట్ నంబర్ 1
- 2002: అల్లరి రాముడు, ఇంద్ర
- 2003: ఆయుధం,గంగోత్రి, రాఘవేంద్ర, సింహాద్రి
- 2004: అంజలి ఐ లవ్యూ, అడవి రాముడు, శీను వాసంతి లక్ష్మి, సై
- 2005: నరసింహుడు, నా అల్లుడు, బాలు, ఛత్రపతి, జై చిరంజీవ, సుబాష్ చంద్రబోస్
- 2006: ఖతర్నాక్, చిన్నోడు, దేవదాసు, మా ఇద్దరి మధ్య, విక్రమార్కుడు
- 2007: యమదొంగ
- 2008: ఒక్క మగాడు, సిద్దు ఫ్రం శ్రీకాకుళం
- 2009: మగధీర, మస్కా, రాజు మహారాజు, రెచ్చిపో, సలీం, సారాయి వీర్రాజు
- 2010: డార్లింగ్, మర్యాద రామన్న, సింహా, సీతారాముల కళ్యాణం లంకలో
- 2011: కందిరీగ, సీమ టపాకాయ్
- 2012: అధినాయకుడు
- 2013: జెఫ్ఫా
- 2014: రేయ్
- 2015: షేర్ (సినిమా)
- 2016: బ్రహ్మోత్సవం , జనతా గ్యారేజ్, అర్ధనారి, ఇంట్లో దెయ్యం నాకేం భయంమూలం చేర్చాను
- 2017: 2 కంట్రీస్
- 2018: భాగమతి, హౌరాబ్రిడ్జ్, ఛలో, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, జువ్వ, శరభ[6]
- 2019: ప్రతిరోజూ పండగే, కౌసల్య కృష్ణమూర్తి
- 2020: వరల్డ్ ఫేమస్ లవర్,[7] పలాస 1978,[8][9]
- జెమ్ (2021)
- అఖండ (2021)
- అహింస (2023)
- ది రాజా సాబ్ (2024)
మూలాలు
బయటి లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.