2018లో విడుదలైన తెలుగు చిత్రం From Wikipedia, the free encyclopedia
ఛలో 2018 ఫిబ్రవరి 2న విడుదలైన తెలుగు సినిమా. దర్శకుడు వెంకీ కుడుములకు ఇదే తొలి చిత్రం. ఈ చిత్రం 50 రోజుల పండగ చేసుకుంది. ఈ సినిమా హిందీ లోకి అనువాదం అయింది. ఇరా క్రియేషన్స్ బ్యానర్ ఫై ఉష ముళ్ళపూరి నిర్మించారు. ఇది నాగశౌర్య కెరీర్ లో ఎక్కువ వసూళ్లు చేసిన చిత్రం. కోటగిరి వెంకటేశ్వర రావు ఈ సినిమాకి ఎడిటింగ్ చేశారు. సాయి శ్రీరామ్ కెమెరా అందించారు. 2018 లో హిట్ అందుకున్న చిత్రాలలో ఇది ఒకటి. ఈ సినిమా నాగశౌర్యకు మంచి పేరు తెచ్చింది.[1][2]త్రివిక్రం శ్రీనివాస్ చిత్ర టీజర్ ను ఆవిష్కరించాడు.[3] [4] [5]
ఛలో | |
---|---|
దర్శకత్వం | వెంకీ కుడుముల |
రచన | వెంకీ కుడుముల |
నిర్మాత | ఉష మూల్పూరి |
తారాగణం | నాగశౌర్య, రష్మిక మందాన |
ఛాయాగ్రహణం | సాయి శ్రీరామ్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | మహతి స్వర సాగర్ |
నిర్మాణ సంస్థ | ఇరా క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2 ఫిబ్రవరి 2018 |
సినిమా నిడివి | 140 నిమిషాలు |
దేశం | India |
భాష | తెలుగు |
చిన్న పిల్లల మనస్తత్వం చాలా భిన్నంగా ఉంటుంది. కానీ నేపథ్యానికి భిన్నంగా ఉండే పిల్లాడు హరి (నాగశౌర్య). చిన్నపిల్లాడైనా ఎవరైనా గొడవలు పడుతుంటే చూడాలనుకునే విపరీత మనస్తత్వం హరిది. దీంతో హరి తండ్రి (సీనియర్ నరేశ్) తనని తిరుపురం అనే ఊరికి పంపేస్తాడు. హరి అక్కడే పెరిగి పెద్దవుతాడు. తిరుపురం ఆంధ్ర సరిహద్దుల్లో ఉంటుంది. ఆ ఊళ్లో తెలుగువారు, తమిళులు ఎందుకనో కంచె వేసుకుని గొడవలు పడుతుంటారు. హద్దు దాటి ఎవరూ రారు. అలా వస్తే సంప్రదాయంగా చంపేసుకుంటూ ఉంటారు. తిరుపురం కళాశాలలో చదువుకున్న హరి కార్తీక (రష్మిక మందణ్ణ) ను ప్రేమిస్తాడు. తెలుగువాడైన హరిని చంపాలనుకుంటారు తమిళులు. అయితే హరి తప్పించుకుంటాడు. తమ ప్రేమ గెలవాలంటే రెండు వర్గాలు కలవాలనే నియమం పెడుతుంది కార్తీక. అప్పుడు హరి ఏం చేస్తాడు? రెండు ఊర్లను కలిపేస్తాడా? లేదా అనే విషయం మిగిలిన కథలో భాగం.[6]
చిత్ర పాటలు ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా చూసీ చూడంగానే అనే పాట వీక్షకాదరణ పొందింది.[8]
చూసీ చూడoగానే , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం . అనురాగ్ కులకర్ణి, సాకేత్ కోమాండురు , ఆదిత్య అయ్యంగార్ , ధనుంజయ్, సాగర్ మహతి
చెప్పవే బాలామని , రచన: కాసర్ల శ్యామ్, గానం.స్వీకార్ ఆగస్త్య
అమ్మాయే చలో అంటూ , రచన: కృష్ణ మదినేని , గానం . యాజిన్ నిజార్ , లిప్సీక
డ్రంక్ అండ్ డ్రైవ్ , రచన: కాసర్ల శ్యామ్ , గానం.రాహుల్ సింప్లీ గంజ్
చల్ గొడవ, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. యజీన్ నిజార్
2018 సైమా అవార్డులు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.