జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 2016లో తెలుగు భయానక చలనచిత్రం From Wikipedia, the free encyclopedia
ఇంట్లో దెయ్యం నాకేం భయం 2016, డిసెంబరు 30న విడుదలైన తెలుగు భయానక చలనచిత్రం.[3] శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి[4] పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో జి. నాగేశ్వరరెడ్డి[5][6] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, కృతిక జయకుమార్, మౌర్యాని, రాజేంద్ర ప్రసాద్[7] ప్రధాన పాత్రల్లో నటించగా, సాయి కార్తీక్ సంగీతం అందించాడు.[8]
ఇంట్లో దెయ్యం నాకేం భయం | |
---|---|
దర్శకత్వం | జి. నాగేశ్వరరెడ్డి |
రచన | డైమండ్ రత్నబాబు (మాటలు) |
స్క్రీన్ ప్లే | జి. నాగేశ్వరరెడ్డి |
కథ | జి. నాగేశ్వరరెడ్డి |
నిర్మాత | బివిఎస్ఎన్ ప్రసాద్ |
తారాగణం | అల్లరి నరేష్ కృతిక జయకుమార్ మౌర్యాని రాజేంద్ర ప్రసాద్ |
ఛాయాగ్రహణం | దాశరథి సివేంద్ర |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | సాయి కార్తీక్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 30 డిసెంబరు 2016[2] |
సినిమా నిడివి | 130 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నరేష్ (అల్లరి నరేష్) బ్యాండ్ మేళం ట్రూపుకి యజమాని. మొదటి చూపులోనే ఇందుమతి (కృతిక జయకుమార్)ను ఇష్టపడిన నరేష్, ఆమె కష్టాల్లో ఉన్నదని తెలిసి ఆమెకు సహాయంచేసి అప్పుల్లో ఇరుక్కుంటాడు. ఇదే సమయంలో రాజేంద్ర ప్రసాద్ ఇంట్లోవున్న దెయ్యం, ఆ ఇంట్లో జరగాల్సిన పెళ్లిని ఆపేస్తుంటుంది. ఆ విషయం తెలుసుకున్న నరేష్ ఆ దెయ్యాన్ని తరిమేయడంకోసం 10 లక్షల రూపాయల కాంట్రాక్ట్ కుదుర్చుకుని ఆ ఇంట్లోకి వెళ్ళి స్నేహితులతో సహా ఇరుక్కుపోతాడు. తన మరదలు స్వప్న దెయ్యంగా మారిందని నరేష్ తెలుసుకుంటాడు. ఆ దెయ్యం వల్ల తన ప్రేమనే వదులుకోవాల్సి పరిస్థితి తలెత్తుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నరేష్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, అసలు స్వప్న దెయ్యంగా ఎందుకు మారింది, తన ప్రేమ ఫలించిందా లేదా అన్నది మిగతా కథ.
ఇంట్లో దెయ్యం నాకేం భయం | ||||
---|---|---|---|---|
సినిమా by | ||||
Released | 28 అక్టోబరు 2016 | |||
Recorded | 2016 | |||
Genre | పాటలు | |||
Length | 14:08 | |||
Label | జంగ్లీ ఆడియో | |||
Producer | సాయి కార్తీక్ | |||
సాయి కార్తీక్ chronology | ||||
|
సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు జంగ్లీ ఆడియో ద్వారా విడుదలయ్యాయి.[9]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "పడ్డాను ఇందుమతి (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | భాస్కరభట్ల రవికుమార్ | ధనుంజయ్ | 3:06 |
2. | "శతమానం భవతి (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | భాస్కరభట్ల రవికుమార్ | రేవంత్, హరిణి ఇవటూరి | 2:55 |
3. | "అయ్యాను నేనే ఫిదా (రచన: రవి ములకలపల్లి)" | రవి ములకలపల్లి | సాయి చరణ్, సాయా శిల్ప | 3:00 |
4. | "డబ్బాయి డబ్బాయి (రచన: చిలక రెక్క గణేష్)" | చిలక రెక్క గణేష్ | సింహ, దివిజ కార్తీక్ | 3:13 |
5. | "జో అచ్యుతానంద (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | భాస్కరభట్ల రవికుమార్ | సాయి గీతిక | 1:44 |
మొత్తం నిడివి: | 14:08 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.