కోవెలమూడి రాఘవేంద్రరావు లేదా కె. రాఘవేంద్ర రావు తెలుగు సినీ రంగంలో దర్శకేంద్రుడు అని పిలువబడే శతాధిక చిత్రాల దర్శకుడు, రచయిత, నిర్మాత. ఈయన 50 ఏళ్ళకి పైగా చిత్ర పరిశ్రమలో ఉన్నాడు. ఈయన తండ్రి కోవెలమూడి సూర్యప్రకాశరావు కూడా తెలుగు సినీ దర్శకుడే. రాఘవేంద్రరావు మొత్తం ఎనిమిది నంది పురస్కారాలు, ఒక IIFA పురస్కారం, ఒక సైమా అవార్డు, ఐదు ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు, రెండు సార్లు సినీ మా (Cinemaa) అవార్డులు అందుకున్నాడు. వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి తారలు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలోనే కథానాయకులుగా ప్రస్థానం మొదలుపెట్టారు.[2]
కె. రాఘవేంద్రరావు | |
---|---|
జననం | కోవెలమూడి రాఘవేంద్రరావు 1942 మే 23[1] |
ఇతర పేర్లు | దర్శకేంద్రుడు |
విద్య | బి. ఎ |
వృత్తి | దర్శకుడు, నిర్మాత, రచయిత |
జీవిత భాగస్వామి | సరళ |
పిల్లలు | 2 (కోవెలమూడి ప్రకాష్ తో సహా) |
తల్లిదండ్రులు |
|
బంధువులు | కె.బాపయ్య (సోదరుడు), శోభు యార్లగడ్డ (అల్లుడు) |
జననం, విద్య
రాఘవేంద్ర రావు మే 23, 1942 తేదీన కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను గ్రామంలో సుర్యప్రకాశ రావు దంపతులకు జన్మించాడు. రాఘవేంద్రరావు తండ్రి కోవెలమూడి సూర్యప్రకాశరావు దర్శకుడే. రాఘవేంద్రరావు కొడుకు పేరు కూడా కోవెలమూడి సూర్య ప్రకాష్. ఇతను కూడా సినీ రంగంలో నటుడు, దర్శకుడు, నిర్మాతగా కూడా వ్యవహరించాడు. దర్శకుడు కె.బాపయ్య వీరి పెదనాన్న కుమారుడు.
సినీ రంగం
తండ్రి కోవెలమూడి ప్రకాశరావు దర్శకుడయినా మరో దర్శకుడి కమలాకర కామేశ్వరరావు దగ్గర కొన్నాళ్ళు సహాయకుడిగా పనిచేశాడు. దర్శకుడిగా ఆయన మొదటి చిత్రం 1975లో వచ్చిన బాబు. ఈ చిత్రంలో శోభన్ బాబు, వాణిశ్రీ, లక్ష్మి ముఖ్య పాత్రల్లో నటించారు. ఆ తర్వాత ఎంతో మంది కథానాయకులతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశాడు. స్త్రీ పాత్రలే ప్రధానంగా జ్యోతి, ఆమె కథ, కల్పన లాంటి చిత్రాలు తీశాడు. అన్నమయ్య, శ్రీ మంజునాథ, శ్రీరామదాసు, శిరిడి సాయి, ఓం నమో వేంకటేశాయ లాంటి ఆధ్యాత్మిక చిత్రాలు రూపొందించాడు.
శ్రీదేవితో రాఘవేంద్రరావు 24 సినిమాలు చేశాడు.[3]
అవార్డులు.
1984: ఉత్తమ దర్శకుడు, నంది అవార్డు, బొబ్బిలి బ్రహ్మన్న.
టి. వి. రంగం
కేవలం వెండితెరమీదే కాక బుల్లితెర మీద కూడా రాఘవేంద్రరావు తన ముద్ర వేశాడు. ఈటీవీలో ప్రసారమైన శాంతి నివాసం అనే ధారావాహికకు రచయిత, దర్శకత్వ పర్యవేక్షకుడిగా వ్యవహరించాడు. ఈటీవీలో సౌందర్యలహరి అనే పేరుతో ఆయన సినీ జీవిత విశేషాలతో ఒక కార్యక్రమం ప్రసారమైంది.[4]
కె. రాఘవేంద్ర రావు సినిమాల జాబితా
స.రం | చిత్రం పేరు | నటీ నటులు |
---|---|---|
1975 | బాబు | శోభన్ బాబు, వాణిశ్రీ, లక్ష్మి |
1976 | రాజా | శోభన్ బాబు, జయసుధ |
1976 | జ్యోతి | జయసుధ٫మురళీమోహన్ |
1977 | అమరదీపం | కృష్ణంరాజు, జయసుధ |
1977 | కల్పన | మురళీమోహన్, జయచిత్ర |
1977 | ఆమెకథ | మురళీమోహన్, ప్రభ |
1977 | అడవి రాముడు | నందమూరి తారక రామారావు, జయప్రద, జయసుధ |
1978 | సింహబలుడు | నందమూరి తారక రామారావు, వాణిశ్రీ |
1978 | పదహారేళ్ళ వయసు | శ్రీదేవి, చంద్ర మోహన్ |
1979 | నిండు నూరేళ్ళు | చంద్రమోహన్, జయసుధ |
1979 | డ్రైవర్ రాముడు | నందమూరి తారక రామారావు, జయసుధ |
1979 | వేటగాడు | నందమూరి తారక రామారావు, శ్రీదేవి |
1980 | గజదొంగ | నందమూరి తారక రామారావు, శ్రీదేవి, జయసుధ |
1980 | మోసగాడు | శోభన్ బాబు, శ్రీదేవి |
1980 | భలే కృష్ణుడు | కృష్ణ, జయప్రద |
1980 | ఘరానా దొంగ | కృష్ణ, శ్రీదేవి |
1981 | కొండవీటి సింహం | నందమూరి తారక రామారావు, శ్రీదేవి, జయంతి |
1981 | తిరుగులేని మనిషి | నందమూరి తారక రామారావు |
1981 | ఊరికి మొనగాడు | కృష్ణ, జయప్రద |
1981 | రగిలే జ్వాల | కృష్ణంరాజు, సుజాత, జయప్రద |
1982 | మధుర స్వప్నం | కృష్ణంరాజు, జయసుధ, జయప్రద |
1982 | త్రిశూలం | కృష్ణంరాజు, శ్రీదేవి, రాధిక, జయసుధ |
1982 | దేవత | శోభన్ బాబు, జయప్రద, శ్రీదేవి |
1982 | జస్టిస్ చౌదరి | నందమూరి తారక రామారావు, శ్రీదేవి |
1983 | అడవి సింహాలు | కృష్ణ, కృష్ణంరాజు, శ్రీదేవి, జయప్రద |
1983 | శక్తి | కృష్ణ, జయసుధ |
1984 | ఇద్దరు దొంగలు | శోభన్ బాబు, రాధ |
1984 | బొబ్బిలి బ్రహ్మన్న | కృష్ణంరాజు, లక్ష్మి, రాధ |
1985 | అడవి దొంగ | చిరంజీవి, రాధ |
1985 | అగ్నిపర్వతం | కృష్ణ, రాధ, విజయ శాంతి |
1985 | వజ్రాయుధం | కృష్ణ, శ్రీదేవి |
1985 | పట్టాభిషేకం | బాలకృష్ణ, విజయ శాంతి, శారద |
1986 | రావణబ్రహ్మ | కృష్ణంరాజు, శారద, జయసుధ |
1986 | కలియుగ పాండవులు | వెంకటేష్, కుష్బు |
1986 | చాణక్య శపథం | చిరంజీవి, విజయ శాంతి |
1986 | కొండవీటి దొంగ | చిరంజీవి, రాధ, విజయ శాంతి |
1987 | భారతంలో అర్జునుడు | వెంకటేష్, కుష్బు, అరుణ |
1988 | జానకిరాముడు | అక్కినేని నాగార్జున, విజయ శాంతి |
1988 | ఆఖరి పోరాటం | అక్కినేని నాగార్జున, శ్రీదేవి , సుహాసిని |
1989 | ఒంటరి పోరాటం | వెంకటేష్ |
1989 | రుద్రనేత్ర | చిరంజీవి |
1990 | మంచి దొంగ | చిరంజీవి, విజయ శాంతి |
1990 | జగదేకవీరుడు- అతిలోక సుందరి | చిరంజీవి, శ్రీదేవి |
1990 | అల్లుడుగారు | మోహన్ బాబు, రమ్యకృష్ణ |
1991 | కూలీ నెం.1 | వెంకటేష్, టబు |
1992 | సుందరకాండ | వెంకటేష్, మీనా, అపర్ణ |
1992 | ఘరానా మొగుడు | చిరంజీవి, నగ్మా, వాణీ విశ్వనాథ్ |
1992 | రౌడీ అల్లుడు | చిరంజీవి, శోభన, దివ్య భారతి |
1992 | అల్లరి మొగుడు | మోహన్ బాబు, మీనా |
1992 | అశ్వమేధం | శోభన్ బాబు, బాలకృష్ణ , మీనా |
1993 | మేజర్ చంద్రకాంత్ | నందమూరి తారక రామారావు, మోహన్ బాబు, శారద, రమ్యకృష్ణ, నగ్మా |
1994 | అల్లరి ప్రియుడు | రాజ శేఖర్, రమ్యకృష్ణ, మధు బాల |
1994 | ముద్దుల ప్రియుడు | వెంకటేష్, రమ్యకృష్ణ, రంభ |
1994 | ముగ్గురు మొనగాళ్లు | చిరంజీవి, నగ్మా, రోజా, రమ్యకృష్ణ |
1994 | అల్లరి ప్రేమికుడు | జగపతి బాబు, రమ్యకృష్ణ, సౌందర్య, రంభ |
1995 | ఘరానా బుల్లోడు | అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ |
1995 | రాజసింహం | రాజ శేఖర్, రమ్యకృష్ణ, సౌందర్య |
1996 | బొంబాయి ప్రియుడు | జె.డి.చక్రవర్తి, రంభ |
1996 | పెళ్ళి సందడి | శ్రీకాంత్, దీప్తీ భట్నాగర్, రవళి |
1996 | సాహసవీరుడు - సాగరకన్య | వెంకటేష్, శిల్పా షెట్టి, మాలాశ్రీ |
1997 | అన్నమయ్య | అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, కస్తూరి |
1998 | పరదేశి | మాధవ్ , మోనా , ధనుజ, విశ్వ |
1998 | లవ్ స్టోరీ 1999 | ప్రభుదేవా, నవీన్ వడ్డే , రమ్య, రంభ |
1999 | రాజకుమారుడు | మహేష్ బాబు, ప్రీతి జింటా |
1999 | ఇద్దరు మిత్రులు | చిరంజీవి, సాక్షీ శివానంద్, రమ్యకృష్ణ |
2001 | మంజునాధ | చిరంజీవి, అర్జున్, సౌందర్య, మీనా |
2003 | గంగోత్రి | అల్లు అర్జున్ , అదితి అగర్వాల్ |
2005 | సుభాష్ చంద్రబోస్ | వెంకటేష్, శ్రియా, జెనీలియా |
2005 | అల్లరి బుల్లోడు | నితిన్, త్రిష |
2006 | శ్రీరామదాసు | అక్కినేని నాగార్జున , స్నేహ |
2008 | పాండురంగడు | బాలకృష్ణ, స్నేహ |
2010 | ఝుమ్మందినాదం | మంచు మనోజ్ కుమార్,తాప్సీ |
2012 | శిరిడి సాయి | అక్కినేని నాగార్జున |
2017 | ఓం నమో వెంకటేశాయ | అక్కినేని నాగార్జున, అనుష్క శెట్టి, సౌరభ్ రాజ్ జైన్, ప్రగ్యా జైస్వాల్ |
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.