అల్లరి ప్రేమికుడు

From Wikipedia, the free encyclopedia

అల్లరి ప్రేమికుడు

అల్లరి ప్రేమికుడు 1994లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] ఇందులో జగపతి బాబు, సౌందర్య, రంభ, కాంచన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సురేష్, సత్యానంద్ కలిసి శ్రీ సత్యదుర్గాఆర్ట్స్ పతాకంపై నిర్మించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించాడు.[2][3] ఇది తమిళంలో పోక్కిరి కాదలన్ అనే పేరుతో అనువాదం అయింది.

త్వరిత వాస్తవాలు దర్శకత్వం, తారాగణం ...
అల్లరి ప్రేమికుడు
(1994 తెలుగు సినిమా)
Thumb
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
తారాగణం జగపతి బాబు, సౌందర్య, రమ్యకృష్ణ, రంభ
సంగీతం ఎం. ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ శ్రీ సత్యదుర్గాఆర్ట్స్
భాష తెలుగు
మూసివేయి

కథ

కృష్ణమూర్తి అలియాస్ కిట్టు తన స్నేహితుడైన చంద్రంతో పందేలు కాస్తుంటాడు. ఒకసారి కృష్ణమూర్తి భవాని, ఝాన్సీ, జోగీశ్వరి దేవి అనే ముగ్గురు అమ్మాయిలను ప్రేమలోకి దింపుతానని చంద్రంతో పందెం కాస్తాడు. కిట్టు ఒక హోటల్ లో సంగీత కళాకారుడుగా పనిచేస్తాడు. భవాని కళాశాలలో చదువుతూ మహిళల తరపున పోరాడుతుంటుంది. ఆమెకు తగినట్టుగా కిట్టు మహిళలను గౌరవించేవాడిగా ప్రవర్తిస్తుంటాడు. కిట్టు ఖాన్ దాదా పేరుతో చలామణి అయ్యే అహోబిలంతో ఒప్పందం కుదుర్చుకుని అతను మహిళలను వేధిస్తుండగా అతన్ని ఎదిరించి భవాని తనను అభిమానించేలా చేస్తాడు.

ఝాన్సీ పోలీస్ ఇన్స్పెక్టర్. కిట్టు ఈసారి మరో దాదాతో మాట్లాడుకుని ఆమె సోదరుని అపహరించి కాపాడటానికి ప్రయత్నిస్తున్నట్లు నాటకం ఆడతాడు.

తారాగణం

పాటల జాబితా

  • కూ కూ కూ , రచన: వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • పుత్తడి బొమ్మకు, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • నిన్ను చూడగానే , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • బంతిలాంటి బత్తాయి, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • చిలిపి చిలక , రచన వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • నారీజన ప్రియతమా , రచన: ఎం ఎం కీరవాణి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.