Remove ads

కమల్ హాసన్ (తమిళం : கமல்ஹாசன்) ( November 7, 1954లో తమిళనాడు రాష్ట్రం రామనాథ పురం జిల్లాలోని పరమక్కుడి లో పుట్టాడు) భారతదేశపు నటుడు. బహుముఖ ప్రజ్ఞగల ఈ నటుడు ప్రధానంగా దక్షిణ భారత చిత్రాలలో, అందునా ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించినప్పటికీ భారత దేశ మంతటా సుపరిచితుడు. బాలనటుడిగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్న కమల్ తరువాత జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని మూడు సార్లు గెలుచుకున్నాడు.

త్వరిత వాస్తవాలు కమల్ హాసన్, జననం ...
కమల్ హాసన్
Thumb
జననంకమల్ హాసన్
(1954-11-07) 1954 నవంబరు 7 (వయసు 70)
పరమక్కుడి, తమిళనాడు,భారతదేశం
నివాస ప్రాంతంచెన్నై, తమిళనాడు
వృత్తిసినిమా నటుడు
దర్శకుడు
నిర్మాత
గాయకుడు
నృత్య దర్శకుడు
కథారచయిత &
మాటల రచయిత
రాజకీయ పార్టీమక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ
మతంనాస్తికుడు
భార్య / భర్తవాణీ గణపతి(1978-1988)
సారిక(1988–2004)[1]
పిల్లలుశ్రుతి హాసన్
అక్షర హాసన్
తండ్రిశ్రీనివాసన్
తల్లిరాజ్య లక్ష్మి
మూసివేయి

బాల్య జీవితం

శ్రీనివాసన్, రాజ్య లక్ష్మి దంపతులకు కమల్ హాసన్ నాలుగో సంతానం, ఆఖరి వాడు. కొడుకులందరికి చివరి పదం "హాసన్" అని వచ్చేలా పేరు పెట్టారు ఈ దంపతులు. ఇది హాసన్ అనబడే ఒక మిత్రుడితో తమకి ఉన్న అనుబంధానికి గుర్తు. కమల్ 3 1/2 యేళ్ళ పసి వయసులోనే చిత్ర రంగంలోకి ప్రవేశించారు. ఆయన మొదటి చిత్రం "కలత్తూర్ కన్నమ్మ". బాల్యంలోనే ఆయన శాస్త్రీయ కళలను అభ్యసించారు. నూనుగు మీసాల వయసులో సినిమాలలో నృత్య దర్శకుడిగా పనిచేసారు. అదే సమయంలో ప్రసిద్ధ తమిళ సినీ దర్శకుడు కె.బాలచందర్ తో ఆయనకు ఏర్పడిన అనుబంధం తరువాత సుదీర్ఘ గురు-శిష్య సంబంధంగా మారింది. కమల్ నేపథ్య గాయకుడిగా కూడా శిక్షణ పొందాడు. ఇటీవలి కొన్ని చిత్రాలలో పాటల రచయితగా కూడా పనిచేసారు. భరత నాట్యం ప్రదర్శించటంలో ఆయనకి ఆయనే సాటి. తమిళ చిత్ర రంగంలో తిరుగులేని నటుడిగా ఎదిగాడు.

60వ దశకం

కమల్ తన సినీ జీవితాన్ని కలత్తూర్ కన్నమ్మ అనే చిత్రంలో బాల నటుడిగా ఆరంభించాడు. ఇది ఆయనకి ఉత్తమ బాల నటుడిగా అవార్డ్ తెచ్చిపెట్టిన మొదటి చిత్రం. ఆ తర్వాత కూడా ఎం.జి.రామచంద్రన్,శివాజీ గణేషన్,నాగేష్,జెమినీ గణేష్ వంటి వారు నిర్మించిన చిత్రాలలో బాల నటుడుగా నటించాడు.

70వ దశకం

70 వ దశాబ్ధంలో కమల్ పూర్తి స్థాయిలో సినిమాల్లో నటించారు. తమిళ చిత్రాలలోనే కాక ఆ నాటి ప్రసిద్ధ మళయాళ దర్శకులు నిర్మించిన మళయాళ చిత్రాలలో కూడా నటించారు. పూర్తి స్థాయి కథా నాయకుడిగా "అవర్‌గళ్", "అవళ్ ఓరు తొడరర్‌కదై", "సొల్ల తాన్ నినైక్కిరేన్", "మాణవన్", "కుమార విజయం" లాంటి చిత్రాలలో నటించినప్పటికీ శ్రీదేవి తో ఆయన నటించిన 16 వయదినిలె (తెలుగులో పదహారేళ్ళ వయసు) చిత్రం 23 ఏళ్ళ వయసులో యువ కథానాయకుడిగా మంచి పేరు తెచ్చింది. కమల్ హాసన్, శ్రీదేవి తెర మీద ప్రసిద్ధ జంటగా మారి సుమారు 23 చిత్రాలు కలిసి నటించారు. 16 వయదినిలె చిత్రం తర్వాత దర్శకుడు కె.బాలచందర్ నిర్మించిన మరో చరిత్ర అనే తెలుగు చిత్రంలో నటించారు.

1970 లో విభిన్న పాత్రలను పోషించారు.

  • వెంట్రిలోక్విస్ట్గా అవర్ గళ్ చిత్రంలో (తెలుగులో ఇది కథ కాదు)
  • అమాయకమైన పళ్ళెటూరి వాడిగా 16 వయతినిలె చిత్రంలో (తెలుగులో చంద్రమొహన్ కథానాయకుడుగా పదహారేళ్ళ వయసు)
  • డిస్కో జాకిగా ఇళమై ఊన్జలాడుగిరదు చిత్రంలో
  • వరుస హత్యల స్త్రీ హంతకుడిగా ఉన్మాది పాత్రలో సిగప్పు రోజక్కళ్ చిత్రంలో (తెలుగులో ఎర్రగులాబీలు)
  • ఎత్తు పళ్ళ పళ్ళెటూరి వాడిగాకళ్యాణరామన్ చిత్రంలో (తెలుగులో కల్యాణరాముడు)
  • అలాద్దిన్ గా అలావుద్దీనమ్ అర్పుధ విలక్కుమ్ చిత్రంలో

80వ దశకం

దర్శకుడిగా ఆయన చేపట్టిన మొదటి చిత్రం "శంకర్ లాల్" చిత్రీకరణ జరుగుతుండగా టి.ఎన్.బాలు దుర్మరణం జరిగింది. 1979 లో కమల్ పలు క్లాసిక్, మాస్ చిత్రాలలో నటించి మంచి స్టార్ డమ్ పొందాడు. దీనికి ఎమ్.జీ.అర్/శివాజి వంటి చిత్ర రంగం నుండి తప్పుకోవడం కూడా తోడైంది. (ఎమ్.జీ.ఆర్ చిత్ర రంగం నుండి విరమించుకోగా, 1977 తర్వాత 1990 వరకు శివాజి చిత్రాలకు దూరంగా ఉన్నారు). చిత్ర రంగంలో ఉన్న పోటీని ఎప్పటికప్పుడు ఎదుర్కోవడానికి కమల్ తన చిత్రాలలో విభిన్న కథలతో, పాత్రలతో ముందుకు వచ్చారు.

ఈ దశకంలో నటించిన వివిధ పాత్రలు:

  • అంధ వయొలిన్ విద్వాంసునిగా రాజ పార్వయి చిత్రంలో 27 ఏళ్ళ వయసులో నటించాడు. (ఇదే కమల్ స్క్రీన్ ప్లే వహించిన తొలి చిత్రం ఇదే తెలుగులో అమావాస్యచంద్రుడుగా వచ్చింది.)
  • శాస్త్రీయ నృత్య కళాకారునిగా సాగర సంగమం చిత్రంలో
  • ప్రేమలో పడే మానసిక వికలాంగిగా స్వాతి ముత్యం చిత్రంలో
  • అజ్ఞాత పోలీసుగా కాకి చట్టై చిత్రంలో
  • అండర్ వరల్డ్ డాన్ గా నాయగన్ (నాయకుడు) చిత్రంలో 33 ఏళ్ళ వయసులో మణి రత్నం దర్శకత్వంలో
  • ఒక నిరుద్యోగ యువకుడు ఒక వారం పాటు భోగ భాగ్యాలు అనుభవించే పాత్రలో మూకీ చిత్రం అయిన పుష్పక్లో (తెలుగులో పుష్పక విమానం)
  • నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా, సర్కస్ లో మరుగుజ్జు బఫూన్ గా, సరదాగా ఉండే మెకానిక్ పాత్రలలో అపూర్వ సగోదరర్‌గళ్(విచిత్ర సోదరులు) చిత్రంలో 35 ఏళ్ళ వయసులో (ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా కమల్ చేశారు)
  • చెడ్డవాడు అయిన మేయర్ గా ఇంద్రుడు చంద్రుడు, తెలుగు చిత్రంలో
  • 1989 లో విడుదల అయిన అపూర్వ సగోదరగళ్ (తెలుగులో విచిత్ర సహోదరులు) చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు10 కోట్ల రూపాయలను వసూలు చేసిన మొదటి కమల్ చిత్రం.

90వ దశకం

1997లో మరొక యాదృచ్ఛికమైన సంఘటన కారణంగా కమల్ తిరిగి దర్శకత్వం చేపట్టాల్సి వచ్చింది. చాచి 420 (తెలుగులో భామనే సత్యభామనే) చిత్ర దర్శకుడు శంతను షెనొయ్ పనితనం నచ్చక పోవడంతొ కమల్ మళ్ళి దర్శకుడిగా మారారు. అటుపై ఐరోప చిత్ర విధానాలను అనుసరిస్తూ, కమల్ నిజ జీవితానికి దగ్గరైన సహజ హాస్యం పండిస్తూ అనేక చిత్రాలను తీస్తూ వచ్చారు. ఈ చిత్రాల కారణంగా కొంతమంది అభిమానులని నిరాశపరిచినా, నటుడిగా ఎంతో ఎత్తుకి ఎదిగారు.

ఈ కాలంలో ఆయన నటించిన పాత్రలు:

  • తమిళ హాస్య చిత్రం "సతీలీలావతి"లో డాక్టరుగా (తెలుగులో అదే పేరు)
  • నలుగురు కవలలుగా హాస్య చిత్రం "మైకేల్ మదన కామరాజన్" (తెలుగు: "మైకేల్ మదన కామరాజు")
  • ప్రేమలో పడ్డ ఉన్మాదిగా "గుణ"
  • గ్రామంలో స్థిర పడే ఆధునిక యువకుడిగా "దేవర్ మగన్" (తెలుగు: క్షత్రియ పుత్రుడు) - 38 ఏళ్ళ వయసులో రచించి నిర్మించిన చిత్రం.
  • గ్రామం నుంచి వలస వచ్చి పట్టణంలో కుటుంబాన్ని కోల్పొయే వ్యక్తిగా "మహానది"
  • ఒక విప్లవాత్మకమైన ఉపాధ్యయుడిగా "నమ్మవర్" (తెలుగు: "ప్రొఫెసర్ విశ్వం")
  • ఉగ్రవాదాన్ని అణిచివేసే ప్రత్యేక పొలీసు అధికారిగా "ద్రోహి" (తమిళం: కురుదిప్పునల్)
  • ముదుసలి స్వతంత్రసమరయోధుడిగా, అతని లంచగొండి కొడుకుగా ద్విపాత్రాభినయనం "ఇండియన్" (తెలుగు: "భారతీయుడు")
  • 42 ఏళ్ళ వయసులో ముసలి దాదిగా (naany) (ఇంగ్లీషు చిత్రం మిసెస్ డౌట్ ఫైర్ ఆధారంగా) "అవ్వై షణ్ముఖి" (తెలుగు: భామనే సత్యభమనే)

ఐతే ఎనభైలో మాదిరిగా తొంభైలలో అతని చిత్రాలు అంతగా విజయవంతం కాలేదు. 1996 లో విడుదలైన "ఇండియన్", "అవ్వై షణ్ముఖి" మాత్రం 200 మిలియన్లు వసూలు చేసి కమల్ ను అగ్రపథంలో నిలిపాయి.

Remove ads

2000లలో

నూతన శతాబ్దంలో కమల్ హసన్ బహుముఖ ప్రతిభ తెర మీద మాత్రమే కాకుండా తెర వెనుక అనేక విభాగాల్లో కూడా కనిపించనారంభించింది. ఈ కాలంలో నటన మాత్రమే కాకుండా ఆయన దర్శకత్వం, రచన, కథా సంవిధానం, సంగీతం మొదలైన విభాగాల్లో తనదైన శైలిని ప్రదర్శించాడు. నటనలో విభిన్న పాత్రలెన్నింటినో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో పోషించాడు. వాటిలో కొన్ని:

  • కవల సోదరులుగా: ఆళవందాన్ (అభయ్)
  • ప్రేమలో పడే ఘోటక బ్రహ్మచారిగా: పమ్మల్ కె. సంబంధం (బ్రహ్మచారి)
  • రసికుడైన విమాన చోదకునిగా: పంచతంత్రం
  • వికలాంగుడైన మానవతావాదిగా: అన్బే శివం (సత్యమే శివం)
  • ప్రేయసి హత్యలో అన్యాయంగా ఇరికించబడి జైలు పాలైన మొరటు పల్లె వాసిగా: విరుమాండి (పోతురాజు)
  • సర్కస్ లో పోరాటాలు చేసే బధిరుడిగా: ముంబై ఎక్స్ ప్రెస్
  • ముదురు వయసులో వైద్య విద్యనభ్యసించే ఆకు రౌడీ పాత్రలో: వసూల్ రాజా ఎమ్. బి. బి. ఎస్. (హిందీ చిత్రం మున్నాభాయ్ ఎమ్. బి. బి. ఎస్. ఆధారంగా)
  • ప్రతిభావంతుడైన పోలీస్ అధికారి రాఘవన్ పాత్రలో: వేట్టైయాడు - విళయాడు (రాఘవన్)
  • ప్రతిదానికీ భయపడే అమాయకుడైన పిరికివాడిగా: తెనాలి (ఆంగ్ల చిత్రం వాట్ అబౌట్ బాబ్ ఆధారంగా)

2000లో విడుదలైన తెనాలి కమల్ హసన్ చిత్రాల్లో రూ. 30 కోట్లకు పైగా సాధించిన తొలి చిత్రం. 2005లో వచ్చిన వసుల్ రాజా ఎమ్. బి. బి. ఎస్ సుమారు రూ. 40 కోట్లు సాధించగా, 2006 లో వచ్చిన వేట్టైయాడు - విళయాడు రూ. 45 కోట్లు సాధించి తమిళ బాక్సాఫీసుపై కమల్ హసన్ ప్రభావం తగ్గలేదని నిరూపించాయి.

Remove ads

పురస్కారాలు

కేంద్ర ప్రభుత్వం ఏటా బహూకరించే ప్రతిష్ఠాత్మకమైన ఉత్తమ నటుడి పురస్కారాన్ని కమల్ హసన్ మూడు పర్యాయాలు గెలుచుకున్నాడు. ఆ చిత్రాలు వరుసగా: మూండ్రంపిరై, నాయకన్ (నాయకుడు), ఇండియన్ (భారతీయుడు). ఈయన ఉత్తమ బాలనటుడిగా కూడా కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని [[కలతూర్ కన్నమ్మ]] చిత్రానికిగానూ గెలుచుకున్నాడు. ఇవే కాకుండా సాగర సంగమం, స్వాతి ముత్యం చిత్రాలకు వరుసగా 1983, 1985 లలో ఆసియా చిత్రోత్సవాల్లో ఉత్తమ నటుడి బహుమతి పొందాడు. మరో ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ ఫేర్ బహుమతిని ఆయన రికార్డు స్థాయిలో 18 సార్లు సొంతం చేసుకున్నాడు. ఆయన నటించిన ఆరు చిత్రాలు భారతదేశం తరపున అధికారికంగా ఆస్కార్ బహుమతికై పంపబడ్డాయి. భారత ఉపఖండంలో మరే నటుడు/నటికీ ఈ గౌరవం దక్కలేదు. 1990లో కేంద్ర ప్రభుత్వం కమల్ హసన్ ను పద్మశ్రీ బిరుదంతో గౌరవించింది. 2005లో మద్రాసు లోని సత్యభామ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. 2014లో కేంద్రప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.

మూడు దశాబ్దాలకు పైబడిన నట జీవితంలో కమల్ హసన్ మొత్తం 171 అవార్డులను సొంతం చేసుకున్నాడు. తమిళ సినిమాకు చేసిన సేవలకుగాను తమిళనాడు ప్రభుత్వం ఆయన్ను కళైమామణి (కళాకారుల్లో మాణిక్యం) బిరుదంతో సత్కరించింది.

Remove ads

నిర్మాతగా కమల్ హాసన్ ప్రస్థానం

కమల్ హాసన్ 1981 నుండి రాజ్ కమల్ పతాకంపై సినీ నిర్మాణం ప్రారంభించాడు. నిర్మాతగా ఆయన మొదటి చిత్రం రాజ పార్వై. ఆ తరువాత రాజ్ కమల్ సంస్థ నుండి అపూర్వ సహోదరగళ్, దేవర్ మగన్, మగళిర్ మట్టమ్, కురుదిప్పునల్, విరుమాండి, ముంబై ఎక్స్ ప్రెస్ లాంటి మంచి చిత్రాలు రూపొందాయి.

కమల్ హసన్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మరుద నాయగం దశాబ్దంనర పైగా నిర్మాణంలోనే ఉంది. 19వ శతాబ్దపు మదురై నగర వాసియైన స్వతంత్ర పోరాట యోధుడు యూసఫ్ ఖాన్ సాహెబ్ (మొహమ్మద్ యూసఫ్ ఖాన్) గురించిన ఈ చిత్ర నిర్మాణమ్ రెండవ ఎలిజబెత్ రాణి చేతులమీదుగా మొదలయింది.

2005లో కమల్ హాసన్ రాజ్ కమల్ ఆడియో పేరుతో ఆడియో వ్యాపారంలోకి ప్రవేశించాడు. ఆ మరుసటేడాది ఆయన సంస్థ మద్రాసులో మల్టీప్లెక్స్ సినిమా ధియేటర్ల నిర్మాణం కూడా చేపట్టింది.[2]

Remove ads

వ్యక్తిగత జీవితం

కమల్ హాసన్ వాణి గణపతి అనే ఆమెను వివాహమాడాదు.తర్వాత సారికతో తన జీవితాన్ని పంచుకున్నాడు. వీరికి శృతి, అక్షర అను ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఇప్పుడు సారిక నుండి విడిపోయాడు. మరో ప్రముఖ తెలుగు నటియైన గౌతమితో సహజీవనం సాగిస్తున్నాడు.

సమాజ సేవా కార్యక్రమాలు

తన అభిమాన సంఘాలను సమాజానికి సేవ చేసే సేవా సంస్థలుగా మార్చిన మొదటి నటుడు కమల్ హాసన్.తన అభిమానుల ద్వారా పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఆయన పుట్టిన రోజున ఆయన అభిమానులంతా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

వివాదాలు

మొదటి నుంచీ కమల్ హసన్ సినిమాలు సంచలనాలకే కాక వివాదాలకు కూడా కేంద్రబిందువులుగా ఉంటున్నాయి. 1992లో విడుదలైన తెవర్ మగన్ (తెలుగు అనువాదంలో క్షత్రియ పుత్రుడు) సినిమా తెవర్ కులస్తుల్లోని హింసాత్మక ప్రవృత్తిని గొప్పగా చూపించిందన్న ఆరోపణపై వివాదాలు చెలరేగాయి. సినిమాలోని తొలిపాట తెవర్ కులాన్ని, ఆ కులస్తుల పౌరుషాలను పొడుగుడతూ ఉండడంతో బహిరంగంగా వారు వినిపిస్తూండడం, ఇతరులపై ఆధిక్యసూచనగా ప్రదర్శించడం వంటివి సమాజంలోని వివాదాలను రేపేందుకు పనికివచ్చాయని భావించారు. 2000లో విడుదలైన కమల్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హే రామ్ చిత్రం చాలా వివాదాలకు మూలబీజమైంది. స్వాతంత్ర్యానంతరం మహాత్మాగాంధీ హత్య వరకూ జరిగిన పరిణామాల నేపథ్యంలో నిర్మించిన చారిత్రికాంశాలతో కూడిన చిత్రమిది. ఈ సినిమాలో మహాత్మా గాంధీని తక్కువ చేసి చూపారని కాంగ్రెస్ నాయకులు భావించగా, స్వాతంత్ర్యోద్యమంలో తమ పాత్రను కించపరిచారని సంఘ్ పరివార్ సంస్థలు ఆరోపించాయి. 2002నాటి పంచతంత్రం సినిమాలోని ఒక పాటకు సెన్సార్ బోర్డు నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పుడు సమస్యలు ఎదురయ్యాయి. చివరికి ఆ పాటను తీసివేసి సినిమా విడుదల చేశారు. సందియర్ అన్న పేరుతో ఓ సినిమాను చిత్రీకరిస్తున్నప్పుడు పుతియ తమిళగం సంస్థ నాయకుడు కె.కృష్ణమూర్తి, ఇతర దళిత సంఘాలు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేశాయి. తెవర్-దళిత కులస్తుల మధ్య విభేదాలు, హింసాత్మక ఘటనలు నమోదైన దృష్ట్యా తెవర్ కులస్తుల ఆభిజాత్యానికి, వారి హింసాప్రవృత్తికి ఆ పేరు ఉత్తేజం కల్పిస్తుందని దళిత నాయకులు ఆరోపించారు. తన చిత్రబృందానికి రక్షణ కల్పించాలని స్థానిక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుని కమల్ హాసన్ కలవగా తర్వాత విస్తృత ప్రజానీకం భద్రత దృష్ట్యా కల్పించలేమని ఆయన తిరస్కరించారు. ఆనాటి ముఖ్యమంత్రి జయలలితను కమల్ హసన్ స్వయంగా కలిసి మాట్లాడి భద్రత తెచ్చుకున్నారు. అలానే సినిమా పేరును విరుమాండిగా మార్చి 2004లో చలనచిత్రాన్ని విడుదల చేశారు. 2004లోనే విడుదలైన వసూల్‌రాజా ఎం.బి.బి.ఎస్. సినిమా పేరు తమ వృత్తిని కించపరిచేదిగా ఉందని ఈరోడ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం 2005 నాటి ముంబై ఎక్స్ప్రెస్ సినిమాపై భాషాభిమానులు వ్యతిరేక ప్రదర్శనలు చేశారు. తమిళ సినిమాకు ఇంగ్లీషులో పేరు పెట్టడాన్ని నిరశిస్తూ సాగిన ఈ ఆందోళనకు పిఎంకె నేత, తమిళ భాషా పరిరక్షణ ఉద్యమానికి ఆద్యులైన ఎస్.రామదాసు నేతృత్వం వహించారు. 2010 నాటి మన్మథన్ అంబు (తెలుగులో మన్మథబాణం) సినిమాలోని ఒక పాటలోని సాహిత్యం హిందూ మక్కల్ కచ్చి వారు హిందూమతాన్ని కించపరిచేదిగా ఉందంటూ ఆందోళన చేశారు. పాటను తొలగించాకా సినిమా విడుదల అయింది. విశ్వరూపం సినిమా ఇస్లాం మతాన్ని తక్కువచేసి చూపిందని ఆరోపణలు రాగా, తమిళనాడు ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తవచ్చు అంటూ సినిమాను నిషేధించింది. కొన్ని దృశ్యాలను తొలగించి, కొన్ని సంభాషణలు మ్యూట్ చేసేందుకు కమల్ అంగీకరించాకా దాదాపు విడుదల అయిన 22 రోజులకు ప్రభుత్వం నిషేధాన్ని సడలించింది. 2015లో విడుదల అయిన ఉత్తమ విలన్ చలనచిత్రం క్లైమాక్స్ పాట హిందువులను అవమానిస్తోందని ఆరోపిస్తూ విశ్వహిందూపరిషత్ సినిమాను నిషేధించాలని ఆందోళన చేసింది, సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక ప్రెంచి ఫోటోగ్రాఫర్ చిత్రాన్ని కాపీచేస్తున్నట్టు వుందని గొడవ చెలరేగితే, చిత్రవర్గాలు "ఆ పోస్టర్లో చూపిన తెయ్యం అన్నది వేయి సంవత్సరాలకు పైగా వయసున్న భారతీయ కళ అని, దాన్ని వేరెవరి నుంచో కాపీ చేయాల్సిన అవసరం తమకు లేదని" స్పష్టీకరించాయి.[3]

Remove ads

వివిధ భాషలలో ఆరంగేట్రం

  • 1960 - తమిళ చిత్ర రంగ ప్రవేశం
  • 1962 - మలయాళ చిత్ర రంగ ప్రవేశం
  • 1977 - బెంగాలీ చిత్ర రంగ ప్రవేశం
  • 1977 - కన్నడ చిత్ర రంగ ప్రవేశం
  • 1977 - తెలుగు చిత్ర రంగ ప్రవేశం
  • 1977 - హిందీ చిత్ర రంగ ప్రవేశం

కమల్ హసన్ చిత్ర మాలిక: నటుడి గా

మరింత సమాచారం సంవత్సరం, పేరు ...
సంవత్సరం పేరు పాత్ర భాష దర్శకత్వం వివరములు Ref.
1960 మావూరి అమ్మాయి (కలథుర్ కన్నమ్మ) Selvam తమిళ ఎ. భీమ్‌సింగ్ ఉత్తమ బాల నటుడి"గా జాతీయ బహుమతి వచ్చింది. [4]
1962 పవిత్ర ప్రేమ (పార్దాల్ పాసి థీరుమ్) Babu & Kumar తమిళ ఎ. భీమ్‌సింగ్ (మొట్ట మొదటి ద్వి-పాత్రాభినయం) (అతిథి పాత్రలో) [5]
1962 పాధ కానిక్కై Ravi తమిళ K. Shankar Child artist [6]
1962 కన్నుమ్ కరులుమ్ BabuమలయాళK. S. SethumadhavanChild artist [7]
1963 వానంపడి (Vanambadi) Ravi తమిళ G. R. Nathan Child artist
1963 దొంగ బంగారం (అనంధ జోధి) Baluతమిళవి.ఎన్.రెడ్డిChild artist [8]
1970 మాణవన్ తమిళM. A. ThirumugamUncredited role [9]
1971 Annai Velankanni Jesus తమిళ Thankappan Uncredited role [10]
1972 కురత్తి మగన్ తమిళకె.ఎస్‌.గోపాలకృష్ణన్‌
1973 అరంగేట్రమ్ Thiaguతమిళకైలాసం బాలచందర్ [11]
1973 చొల్లత్తాన్ నినైక్కిరేన్ Kamalతమిళకైలాసం బాలచందర్
1974 పరువ కాలమ్ ChandranతమిళJos A.N. Fernando [12]
1974 గుమస్తావిన్ మగళ్ ManiతమిళA. P. Nagarajan [13]
1974 శృంగార లీల (నాన్ అవనిల్లై తమిళకైలాసం బాలచందర్
1974 కన్యాకుమారి SankaranమలయాళK. S. Sethumadhavan
1974 అన్బు తంగై BuddhaతమిళS. P. MuthuramanGuest appearance [14]
1974 విష్ణు విజయమ్ మలయాళN. Sankaran Nair
1974 అవళ్ ఒరు తొడర్ కదై Prasadతమిళకైలాసం బాలచందర్ [15]
1974 పణత్తుక్కాగ KumarతమిళM. S. Senthil [12]
1975 సినిమా పైత్యమ్ Natarajanతమిళముక్తా శ్రీనివాసన్ [12]
1975 ప్రేమ లీలలు (పట్టామ్ బూచ్చి) SivaతమిళA. S. Pragasam [12]
1975 ఆయిరత్తిల్ ఒరుత్తి KamalతమిళAvinashi Mani [12]
1975 భలే బ్రహ్మచారి (తేన్ సిందుదే వానమ్) తమిళR. A. Sankaran [12]
1975 మేల్‌నాట్టు మరుమగళ్ RajaతమిళA. P. Nagarajanఈ చిత్ర నిర్మాణ సమయంలో వాణి గణపతిని కలుసుకొని ప్రేమలో పడి తరువాత ఆమెను వివాహం చేసుకున్నాడు [12]
1975 యవ్వనం మురిపించింది (తంగత్తిలే వైరమ్) KumarతమిళK. Sornam
1975 భలేరాజా (పట్టికాట్టు రాజా) MaheshతమిళK. Shanmugam
1975 నాన్ నిన్నె ప్రేమిక్కున్ను SureshమలయాళK. S. Gopalakrishnan
1975 మాలై సూడవా తమిళC. V. Rajendran
1975 అపూర్వ రాగంగళ్ Prasannaతమిళకైలాసం బాలచందర్ [16]
1975 తిరువోణమ్ Prem KumarమలయాళSreekumaran Thampi [12]
1975 మట్టొరు సీతా మలయాళP. Bhaskaran [12]
1975 రాసలీల మలయాళN. Sankaran Nair [12]
1975 అందాలరాజా (అంతరంగమ్) Kaanthanతమిళముక్తా శ్రీనివాసన్
1976 అప్పూపన్ BabumonమలయాళP. Bhaskaran
1976 అగ్ని పుష్పమ్ SomuమలయాళJeassy
1976 మన్మధ లీల (మన్మద లీలై) Madhuతమిళకైలాసం బాలచందర్ [17]
1976 అంతులేని కథ Arunతెలుగుకైలాసం బాలచందర్Cameo appearance [18]
1976 సమస్సియ మలయాళK. Thankappan
1976 స్విమ్మింగ్ పూల్ మలయాళJ. Sasikumar
1976 అరుతు మలయాళRavi
1976 సత్యమ్ KumaranతమిళS. A. Kannan
1976 మరో ప్రేమకథ (ఒరు ఊదాప్పూ కణ్ సిమిట్టు గిరదు) Raviతమిళఎస్. పి. ముత్తురామన్ [19]
1976 ఉణర్చిగళ్ SelvamతమిళR. C. Sakthi [20]
1976 కుట్టువమ్ సిత్షయుమ్ మలయాళM. Masthan
1976 కుమార విజయమ్ KumarతమిళA. Jagannathan [21]
1976 కళ్యాణ జ్యోతి (ఇదయ మలర్) Mohanతమిళజెమినీ గణేశన్
1976 కొండరాజు కోయపిల్ల (పొన్ని) MaranమలయాళThoppil Bhasi [22]
1976 Nee Ente Lahari మలయాళP. G. Viswambharan [12]
1976 మూన్రు ముడిచ్చు Balajiతమిళకైలాసం బాలచందర్ [23]
1976 మోగమ్ ముప్పదు వ్రుషమ్ RameshతమిళS. P. Muthuraman
1976 లలిత BaluతమిళValampuri Somanathan [12]
1977 ఆయినా Prem Kapoorహిందీకైలాసం బాలచందర్Cameo appearance in the song "Ho Jaaye Jab Dil Se Dil Takraaye" [11]
1977 ఉయర్న్దవర్‌గళ్ AarumugamతమిళT. N. Balu [24]
1977 శివతాండవమ్ మలయాళN. Sankaran Nair [25]
1977 ఆశీర్వాదమ్ మలయాళI. V. Sasi
1977 అవర్గళ్ Janardhan (Johnny)తమిళకైలాసం బాలచందర్ [26]
[27]
1977 మదుర సొప్పనమ్ మలయాళM. Krishnan Nair
1977 శ్రీ దేవి VenugopalమలయాళN. Sankaran Nair
1977 ఉన్నై సుట్రుమ్ ఉలగమ్ RajaతమిళG. Subramanya Reddiar [12]
1977 కబిత GopalబెంగాలిBharat Shamsher [28]
1977 ఆష్త మాంగల్యమ్ మలయాళP. Gopikumar
1977 నిరకుడమ్ DevanమలయాళA. Bhimsingh
1977 పార్వతి మళ్ళీ పుట్టింది (ఓర్ మగళ్ మరిక్కుమో) Chandrasekharanమలయాళకె. ఎస్. సేతుమాధవన్
1977 16 Vayathinile Gopalakrishnan (Chappani) తమిళ P. Bharathiraja [29]
1977 ఆడు పులి ఆట్టమ్ MadanతమిళS. P. Muthuraman [30]
[12]
1977 ఆనందం పరమానందం BabuమలయాళI. V. Sasi
1977 నామ్ పిరంద మణ్ RanjithతమిళA. Vincent [31]
1977 కోకిల Vijaykumarకన్నడBalu Mahendraకన్నడంలో మొదటి చిత్రం [32]
1977 సత్యవంతుడు (సత్యవాన్ సావిత్రి) SathyavanమలయాళP. G. Viswambharan
1977 ఆద్యపాదమ్ మలయాళAdoor Bhasi
1978 Avalude Ravukal మలయాళ I. V. Sasi Cameo appearance [33]
1978 నిళల్ నిజమాగిరదు Sanjeeviతమిళకైలాసం బాలచందర్
1978 Sakka Podu Podu Raja తమిళS. P. MuthuramanCameo appearance [34]
1978 మదనోత్సవమ్ RajuమలయాళN. Sankaran Nairdubbed into Hindi as Dil Ka Sathi Dil [12]
1978 అమర ప్రేమ Rajuతెలుగుతాతినేని రామారావుRemake of మదనోత్సవమ్. Most of scene reshot and used some scenes dubbed in original version.
1978 Kaathirunna Nimisham RajuమలయాళBaby [12]
1978 Aval Viswasthayayirunnu AntoమలయాళJeassyGuest appearance
1978 Anumodhanam మలయాళI. V. Sasi [12]
1978 మరో చరిత్ర Baluతెలుగుకైలాసం బాలచందర్ [35]
1978 ఇళమై ఊంజలాడు గిరదు PrabhuతమిళC. V. Sridhar [36]
1978 చట్టమ్ ఎన్ కైయ్యిల్ Babu & RathinamతమిళT. N. Balu
1978 వయసు పిలిచింది RajaతెలుగుC. V. Sridhar [37]
1978 తప్పిట తల Amrit Lalకన్నడకైలాసం బాలచందర్Cameo appearance [38]
1978 Padakuthira మలయాళP. G Vasudevan [12]
1978 వయానధన్ తంబన్ Vayanadan ThambanమలయాళA. Vincent
1978 అవళ్ అప్పడిదాన్ ArunతమిళC. Rudhraiya [39]
1978 ఎర్ర గులాబీలు DileepతమిళP. Bharathiraja [40]
1978 పట్నం పిల్ల (మనిదరిల్ ఇత్తని నిరంగళా) VeluతమిళR. C. Sakthi [12]
1978 తప్పు తాళంగళ్ Amrit Lalతమిళకైలాసం బాలచందర్Cameo appearance [12]
[38]
1978 ఏట్టా RamuమలయాళI. V. Sasi [12]
1979 సొమ్మొకడిది సోకొకడిది Rangadu & Shekarతెలుగుసింగీతం శ్రీనివాసరావు(తెలుగులో మొదటి ద్వి-పాత్రాభినయం) తమిళంలో "ఇరు నిలవుగల్ "గా విడుదల చేశారు. dubbed into Tamil as Iru Nilavugal [12]
1979 సిగపుక్కల్ మూక్కుథి తమిళValampuri Somanathan
1979 నాగ మోహిని (నీయా!) KamalతమిళDurai
1979 అలవుదీనుమ్ అల్బుత వెలక్కుమ్ Alauddinమలయాళ / తమిళI. V. SasiMultiple-language version- Simultaneously made in Tamil as అలా ఉధ్ధీనుమ్ అర్పుద విలక్కుమ్ [41]
1979 పాటగాడు (థాయిల్లమల్ నాన్ ఇల్ల్ య్) RajaతమిళR. Thyagarajan [41]
1979 నినైత్తాలే ఇనిక్కుమ్ Chandruతమిళకైలాసం బాలచందర్Multiple-language version - Bilingual film ప్యార్ తరనా (ఇది 80 లో నిర్మించబడిన తమిళ చిత్రం నినైత్తాలే ఇనిక్కుమ్ యొక్క డబ్బింగ్ హిందీ చిత్రం) [42]
1979 అందమైన అనుభవం Chandruతెలుగుకైలాసం బాలచందర్ [42]
1979 ఇది కథ కాదు Janardhanతెలుగుకైలాసం బాలచందర్ [18]
1979 Nool Veli Kamal Haasanతమిళకైలాసం బాలచందర్Guest appearance as himself
Multiple-language version - Simultaneously filmed in Telugu as గుప్పెడు మనసు
[43]
1979 కళ్యాణ రాముడు (కళ్యాణరమన్) Raman & KalyanamతమిళG. N. Rangarajan [44]
1979 Pasi Kamal HaasanతమిళDuraiGuest appearance as himself [45]
1979 గుప్పెడు మనసు Kamal Haasanతెలుగుకైలాసం బాలచందర్Guest appearance as himself
Simultaneously filmed in Tamil as Nool Veli
[46]
1979 మంగల వాథియమ్ తమిళK. Shankar [12]
1979 నీల మలర్గల్ ChandranతమిళKrishnan Panju
1979 అళియాద కోలన్గల్ GowrishankarతమిళBalu MahendraGuest appearance [12]
1980 ప్రేమ పిచ్చి (ఉల్లాస పరవైగళ్) RaviతమిళC. V. Rajendran(దో దిల్ దివానే - hindi)
1980 గురు GuruతమిళI. V. Sasi
1980 వరుమైయిన్ నిరమ్ సివప్పు Ranganతమిళకైలాసం బాలచందర్Simultaneously filmed in Telugu as ఆకలి రాజ్యం [47]
1980 మరియ మై డార్లింగ్ Raghuకన్నడDuraiMultiple-language version (Bilingual film) [12]
[48]
1980తమిళ
1980 Saranam Ayyappa తమిళDasarathanGuest appearance [49]
1980 నట్చత్త్రిరమ్ Kamal HaasanతమిళDasari Narayana RaoGuest appearance
1981 తిల్లు ముల్లు Charu Haasanతమిళకైలాసం బాలచందర్Guest appearance [50]
1981 ఆకలి రాజ్యం J. Ranga Raoతెలుగుకైలాసం బాలచందర్Simultaneously filmed in Tamil as వరుమైయిన్ నిరమ్ సివప్పు [51]
1981 మీండుమ్ కోకిలా ManianతమిళG. N. Rangarajan
1981 Ram Lakshman RamతమిళR. Thyagarajan [12]
1981 అమావాస్య చంద్రుడు (రాజ పార్వై) (ఎ)(a) RaghuతమిళSingeetam Srinivasa Rao(100th film)
Simultaneously filmed in Telugu as అమావాస్య చంద్రుడు
[44]
[51]
1981 ఏక్ దుజే కేలియే Vasuహిందీకైలాసం బాలచందర్ [52]
1981 రంగూన్ రాజా (కడల్ మీన్‌గళ్) Selvanayagam & RajanతమిళG. N. Rangarajan [12]
1981 సవాల్ P. P. RajaతమిళR. Krishnamoorthy [53]
1981 అందగాడు (1982 సినిమా) (శంకరలాల్) Dharmalingam & MohanతమిళT. N. BaluSimultaneously filmed in Telugu as అందగాడు [12]
1981 టిక్ టిక్ టిక్ DilipతమిళP. Bharathiraja [53]
1981 చిలిపి చిన్నోడు (ఎల్లామ్ ఇన్బమయమ్) VeluతమిళG. N. Rangarajan [44]
1982 వాళ్వే మాయమ్ RajaతమిళR. Krishnamoorthy [54]
1982 అంది వెయిలిలే Ponnu మలయాళRadhakrishnanDubbed Tamil as Ponmaalai Pozhudhu [55]
1982 వసంత కోకిల (మూన్రామ్ పిరై) Srinivasan (Seenu)తమిళBalu Mahendraఇది హిందీలో సద్మా గా పునర్నిర్మించబడింది. [44]
[56]
1982 Neethi Devan Mayakkam Military officer తమిళ Bapu Simultaneously shot in Telugu as Edi Dharmam Edi Nyayam [57]
1982 Maattuvin Chattangale మలయాళK. G. RajasekharanSpecial appearance in the song "Maattuvin Chattangale" [12]
[58]
1982 సిమ్లా స్పెషల్ GopuతమిళMuktha Srinivasan
1982 సనమ్ తేరీ కసమ్ Sunil SharmaహిందీNarendra Bediపాడగన్ (ఇది 90 లలో నిర్మించబడిన హిందీ చిత్రం తనమ్ మేరీ కసమ్ యొక్క తమిళ డబ్బింగ్ చిత్రం) [59]
1982 సకల కళా వల్లవన్ VeluతమిళS. P. Muthuraman
1982 ఎళమ్ రాత్తిరి మలయాళKrishnakumar
1982 రాణీ తేనీ MillerతమిళG. N. RangarajanCameo appearance [60]
1982 ఎహ్ తో కమాల్ హోగయా Ratan Chander & Ajay Saxenaహిందీతాతినేని రామారావు(హిందీలో మొదటి ద్విపాత్రాభినయం) (హిందీ)ఇది పునర్నిర్మించబడిన "చట్టమ్ ఎన్ కైయ్యిల్ "యొక్క హిందీ చిత్రం. [61]
1982 పగడ్సై పన్నిరెండు AnandతమిళDhamodharan. N
1982 అగ్ని సాక్షి Kamal Haasanతమిళకైలాసం బాలచందర్Guest appearance [62]
1983 జరాసీ జిందగీ (Zara Si Zindagi) Rakesh Kumar Shastriహిందీకైలాసం బాలచందర్ [60]
1983 ఉరువంగళ్ మారలామ్ Kamal HaasanతమిళS. V. RamananGuest appearance
1983 చట్టం RajaతమిళK. Vijayanస్నేహ బంధం (మలయాళం)
1983 సాగర సంగమం Balakrishnaతెలుగుకె.విశ్వనాథ్సలంగై ఒలి - Tamil [63]
[16]
1983 సద్మ Somuహిందీబాలు మహేంద్ర [64]
1983 పొయ్‌క్కాల్ కుదిరై Kamal Haasanతమిళకైలాసం బాలచందర్Cameo appearance [60]
1983 బెనకియల్లి అరళింద హువు కన్నడకైలాసం బాలచందర్Special appearance in the song "Munde Banni" [65]
[66]
1983 జల్సారాయుడు (తూంగాదె తంబి తూంగాదే) డబుల్ రోల్ తమిళ ఎస్ పి ముత్తురామన్ [67]
1984 ఎహ్ దేష్ Mathurహిందీతాతినేని రామారావుGuest role [60]
1984 ఏక్ నయీ పహేలీ Sandeepహిందీకైలాసం బాలచందర్ [68]
1984 యాద్ గార్ RajnathహిందీDasari Narayana Rao [60]
1984 రాజ్ తిలక్ SurajహిందీRajkumar Kohli [69]
1984 ఎనక్కుళ్ ఒరువన్ Madhan & UpendhraతమిళS. P. Muthuraman125th Film [16]
1984 కరిష్మా SunnyహిందీI. V. Sasi [60]
1985 ఖైదీ వేటా David & ShankarతమిళP. Bharathirajaఒరు కైదియిన్ డైరీ - తమిళ [44]
1985 కాక్కి చట్టై MuraliతమిళRajasekhar [60]
1985 అంద ఒరు నిమిడమ్ KumarతమిళMajor Sundarrajan [60]
1985 ఉయర్న్ద ఉళ్ళమ్ AnandhతమిళS. P. Muthuraman [60]
1985 సాగర్ RajaహిందీRamesh Sippy [70]
[71]
1985 గిరఫ్తార్ Kishan Kumar KhannaహిందీPrayag Raaj [60]
[72]
1985 మంగమ్మా శపధం Ashok & RajaతమిళK. Vijayan [60]
1985 జపానిల్ కల్యాణ రామన్ Kalyanam & RamanతమిళS. P. Muthuraman [73]
1985 దేఖా ప్యార్ తుమ్హారా VishalహిందీVirendra Sharma [60]
1986 విక్రమ్ (a) VikramతమిళRajasekhar [74]
1986 స్వాతిముత్యం SivaiahతెలుగుK. Viswanath(సిప్పికుళ్ ముత్తు-తమిళ) ఇది అనిల్ కపూర్ నాయకుడుగా హిందీలోఈశ్వర్గా పునర్నిర్మించ బడింది. [75]
1986 అందరికంటే ఘనుడు (నానుమ్ ఒరు తొళిలాళి) BharathతమిళC. V. Sridhar [60]
1986 మనకణక్కు తమిళR. C. SakthiGuest appearance as film director [53]
1986 ఒక రాధ – ఇద్దరు కృష్ణులు KrishnaతెలుగుA. Kodandarami Reddy [60]
1986 డాన్స్‌మాష్టర్ (పున్నగై మన్నన్ -తమిళ) Sethu,
Chaplin Chellappa
తమిళకైలాసం బాలచందర్ [44]
1987 కాదల్ పరిసు MohanతమిళA. Jagannathan [76]
[60]
1987 వ్రతం BaluమలయాళI. V. Sasi [60]
1987 కడమై కణ్ణియమ్ కట్టుబాటు (ఎ) Kamal HaasanతమిళSanthana BharathiGuest appearance [60]
1987 పేర్ చొల్లుమ్ పిళ్ళై Ramuతమిళఎస్.పి.ముత్తురామన్ [76]
[60]
1987 పుష్పక విమానం "Unemployed graduate"(Silent film)Singeetam Srinivasa RaoAlso known as Pushpak and Pesum Padam [77]
[23]
1987 నాయకుడు Sakthivelu (Velu Naicker) తమిళ Mani Ratnam [78][79]
1988 డైసీ JamesమలయాళPratap K. PothenExtended Cameo [80]
1988 పోలీస్ డైరీ(సూర సంహారం) PandiyanతమిళChitra Lakshmanan [76]
[81]
1988 ఉన్నాల్ ముడియుం తంబి Udhayamoorthyతమిళకైలాసం బాలచందర్ [60]
[82]
1988 సత్య (ఎ) SathyamurthyతమిళSuresh Krissna [44]
1989 అపూర్వ సహోదరులు(ఎ) Sethupathi, Appadurai & Raja తమిళ సింగీతం శ్రీనివాసరావు [44]
1989 చాణిక్యన్ JohnsonమలయాళT. K. Rajeev Kumar [83]
1989 వెట్రి విళా VetrivelతమిళPrathap Pothan [76]
[60]
1989 ఇంద్రుడు చంద్రుడు G. K. Rayudu & ChandruతెలుగుSuresh Krissnaఇది తమిళంలో ఇంద్రన్ చంద్రన్ గా పునర్నిర్మించబడి హిందీలో మేయర్ సాబ్ గా డబ్బింగ్ చేసి విడుదల చేశారు [84][85]
1990 మైఖేల్ మదన కామరాజు (1990) Michael,
Madhanagopal,
Kameshwaran,
Subramaniam Raju
తమిళ సింగీతం శ్రీనివాసరావు [86]
[87]
1991 గుణ GunasekharanతమిళSanthana Bharathi [88]
1992 సింగారవేలన్ SingaravelanతమిళR. V. Udayakumar [89]
1992 క్షత్రియ పుత్రుడు (ఎ) ShakthivelతమిళBharathan [90]
1993 మహరాసన్ VadiveluతమిళG. N. Rangarajan [60]
1993 కళైంజన్ IndrajithతమిళG. B. Vijay [76]
[60]
1994 మహా నది (బి) KrishnaswamyతమిళSanthana Bharathi [91]
1994 ఆడవాళ్లకు మాత్రం (మగలీర్ మట్టుమ్) (ఎ) తమిళసింగీతం శ్రీనివాసరావుGuest appearance [92]
1994 ప్రొఫెసర్ విశ్వం SelvamతమిళK. S. Sethumadhavan [93]
[94]
1995 సతీ లీలావతి (ఎ) ShakthivelతమిళBalu Mahendra [95]
1995 శుభసంకల్పం DasuతెలుగుK. Viswanath [96]
1995 ద్రోహి (కురుదిపునల్) (ఎ) Adhi NarayananతమిళP. C. SreeramSimultaneously shot in Telugu as Drohi [44]
1996 భారతీయుడు Senapathy & ChandraboseతమిళS. Shankar [97]
1996 భామనే సత్యభామనే Pandian
(Avvai Shanmugi)
తమిళK. S. Ravikumarఇది హిందీలో చాచీ 420గా తిరిగి చిత్రించ బడింది [97]
1997 చాచి 420 (ఎ) (బి) (సి) Jaiprakash Paswan
(Lakshmi Godbhole)
హిందీKamal Haasan [98]
1998 కాధలా కాధలా Ramalingamతమిళసింగీతం శ్రీనివాసరావు [99]
2000 హే రామ్ Saket Ramతమిళ, హిందీKamal Haasan [100]
2000 తెనాలి Thenali SomanతమిళK. S. Ravikumar [101]
2001 అభయ్గా (అలవంధన్) Vijay Kumar & Nandha Kumarతమిళ, హిందీSuresh Krissna [102]
2002 పమ్మళ్ కె. సంబంధం Pammal Kalyana SambandhamతమిళT. S. B. K. Moulee [103]
2002 పంచతంత్రం (2002) RamachandramurthyతమిళK. S. Ravikumar [76]
[104]
2003 అన్బే శివం NallasivamతమిళSundar. C [105]
2003 Nala Damayanthi Kamal Haasan తమిళ T. S. B. K. Moulee Guest appearance as himself [106]
2004 పోతురాజుగా (విరుమాండి) VirumaandiతమిళKamal Haasan [107]
2004 వసూల్ రాజా MBBS RajaramanతమిళSaran [108]
2005 ముంబాయి ఎక్స్ ప్రెస్ అవినాష్తమిళ, హిందీసింగీతం శ్రీనివాసరావుఏక కాలంలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందింది
2005 రమ షమ బమ Dr. Shyam Sajjanకన్నడరమేష్ అరవింద్Extended Cameo. [109]
2006 రాఘవన్గా (వెట్టీయాడు విలైయాడు) DCP RaghavanతమిళGautham Menon [110]
2008 దశావతారం Govindarajan Ramaswamy,
Rangarajan Nambi,
Christian Fletcher,
Balram Naidu,
Krishnaveni,
Vincent Poovaragan,
Khalifulla Khan,
Avatar Singh,
Shinghen Narahashi,
George W. Bush
తమిళK. S. Ravikumarఏక కాలంలో తమిళ, తెలుగు, హిందీ,ఇంగ్లీష్ బాషలలో రూపొందించబడి 2008 జూన్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడింది. [97]
2009 Unnaipol Oruvan "Common man"తమిళChakri Toleti [111]
[112]
2009 ఈనాడు "Common man"తెలుగు Chakri Toleti ఏక కాలంలో తమిళ, తెలుగు బాషలలో రూపొందించబడి 2009 సెప్టెంబరు 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడింది. [113]
2010 Four Friends Kamal HaasanమలయాళSaji SurendranGuest appearance as himself [114]
2010 మన్మధన్ అంబు Raja MannarతమిళK. S. Ravikumar [115]
2013 విశ్వరూపం Wisam Ahmed KashmiriతమిళKamal HaasanBilingual film (ఏకకాలంలో తమిళం, తెలుగు, హిందీలలో తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడింది.) [116]
2013 Vishwaroop Wisam Ahmed Kashmiriహిందీ Kamal Haasan [117]
2015 ఉత్తమ విలన్ Manoranjanతమిళరమేష్ అరవింద్ [118]
2015 పాపనాశం Suyambulingam తమిళ Jeethu Joseph [119]
2015 Thoongaa Vanam C. K. DiwakarతమిళRajesh SelvaBilingual film (ఏక కాలంలో తమిళ తెలుగు బాషలలో రూపొందించబడి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడింది.) [120]
2015 చీకటి రాజ్యం C. K. DiwakarTelugu Rajesh Selva [121]
2016 Meen Kuzhambum Mann Paanaiyum Swami తమిళ Amudeshver Guest appearance [122]
2018 విశ్వరూపం II Wisam Ahmed Kashmiri తమిళం Kamal Haasan Bilingual film (ఏకకాలంలో తమిళం, తెలుగు, హిందీలలో తయారు చేసి 10 ఆగస్టు 2018 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడింది.)
2018 Vishwaroop II Wisam Ahmed Kashmiri హిందీ Kamal Haasan
2021 Indian 2 Senapathy, ChandraboseతమిళS. ShankarFilming [123]
2021 విక్రమ్ తమిళం లోకేష్ కనగరాజ్Filming [124]
మూసివేయి

నిర్మాత గా

  • పై చిత్రాలలో (ఎ) గా గుర్తుంచ బడినవాటికి కమల్ హాసన్ నిర్మాత.

రచయిత గా

  • 1999 - బీవీ నెం.1 (హిందీ) పాటలు
  • 1997 - విరాసత్ (హిందీ) పాటలు
  • అంతే కాకుండా పై చిత్రాలలో (బి) గా చూపించ బడినవి కమల్ హాసన్ చే రచించబడినవి.

దర్శకుడి గా

  • పైన (సి) గా రాసిన చిత్రాలు కమల్ హాసన్ చే దర్శకత్వం ఛేయబడినవి.
  • 2000 - హే రామ్
  • 2004 - విరుమాండి
  • 2013- విశ్వరూపం

ఇతర విభాగాల్లో

  • 2006 - పుదు పేట్టై (నేపథ్య గాయకుడు)
  • 2004 - ముంబై ఎక్స్ ప్రెస్ (నేపథ్య గాయకుడు)
  • 2004 - వసూల్ రాజా ఎమ్. బి. బి. ఎస్. (నేపథ్య గాయకుడు)
  • 2003 - అన్బే శివం (నేపథ్య గాయకుడు)
  • 2003 - నల దమయంతి (నిర్మాత, నేపథ్య గాయకుడు)
  • 2000 - హే రామ్ (నృత్య దర్శకుడు, పాటల రచయిత, నేపథ్య గాయకుడు)
  • 1998 - చాచీ 420 (నేపథ్య గాయకుడు)
  • 1996 - ఉల్లాసం (నేపథ్య గాయకుడు)
  • 1996 - అవ్వై షణ్ముగి (నేపథ్య గాయకుడు)
  • 1995 - సతి లీలావతి (నేపథ్య గాయకుడు)
  • 1992 - దేవర్ మగన్ (నేపథ్య గాయకుడు)
  • 1987 - నాయగన్ (నేపథ్య గాయకుడు)
  • 1985 - ఒక రాధ - ఇద్దరు కృష్ణులు (నేపథ్య గాయకుడు)
  • 1982- ఓ మానే మానే (నేపథ్య గాయకుడు)
  • 1981- శంకర్ లాల్ (నేపథ్య గాయకుడు)
  • 1975 - అంధరాగం (నేపథ్య గాయకుడు)
  • 1974 - ఆయినా (నృత్య సహాయకుడు)

ఇవి కూడ చూడండి

మూలాలు

వెలుపలి లింకులు

ఇతర మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.

Remove ads