కటిహార్ జిల్లా
బీహార్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
Remove ads
బీహార్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో కటిహార్ జిల్లా (హిందీ:) ఒకటి. కటిహార్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.జిల్లా పూర్ణియా డివిజన్లో భాగం.
కటిహార్ జిల్లా
कटिहार जिलाضلع کٹہار | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | పూర్ణియా |
ముఖ్య పట్టణం | కటిహార్ |
మండలాలు | 17 |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | కటిహార్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,056 కి.మీ2 (1,180 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 30,68,149 |
• జనసాంద్రత | 1,000/కి.మీ2 (2,600/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 53.56 % |
• లింగ నిష్పత్తి | 916 |
ప్రధాన రహదార్లు | NH 31, NH 81 |
Website | అధికారిక జాలస్థలి |
1973లో పూర్ణియా జిల్లా నుండి కొంత భూభాగం వేరు చేసి కటిహార్ జిల్లాను రూపొందించారు.[1] ఆరంభంలో కతియార్ చౌదరీల ఆధిక్యతలో ఉండేది. చౌదరీలు కోసీ ప్రాంతంలో పెద్ద భూస్వాములుగా ఉండేవారు. చౌదరీ కుటుబానికి ఆద్యుడు " ఖాన్ బహద్దూర్ చౌదరి మొహమ్మద్ బక్ష్ " ఆయన ఆధీనంలో 126 వ్యవసాయ కుటుంబాలు ఉండేవి. ఆయన 1936లో మరణించాడు. ఆయనకుటుంబానికి కటిహార్‌లో 15,000 ఎకరాల భూమి, పూర్ణియాలో 8,500 ఎకరాల భూమి ఉండేది. ప్రస్తుతం ఆయన వారసులు చౌదరి తాజ్ మొహమ్మద్, చౌదరి మొహమ్మద్ అషరఫ్ ఇప్పటికీ భూస్వాములుగా ఉన్నారు. వారి హవేలీని తాజ్ దేహోరీ అంటారు. దేశవిభజనకు ముందు 1905లో కటిహార్ బెంగాల్ భూభాగంలో భాగంగా ఉండేది. విభజన తరువాత కటిహార్ బీహార్ రాష్ట్రంలో భాగం అయింది. బిహార్ రాష్ట్రంలో ఉన్నప్పటికీ సంస్కృతికంగా బెంగాల్‌తో సభంధం అధికంగా ఉంటుంది. జిల్లాలో దుర్గాపూజ ఘనంగా నిర్వహించబడుతుంది. "నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే"కు ఇది ఆరంభస్థానంగా ఉంది.
కటిహార్ జిల్లా వైశాల్యం 3057 చ.కి.మీ.[2] ఇది కెనడా దేశంలోని అకిమిష్కి ద్వీపం వౌశాల్యానికి సమానం.[3]
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో కటిహార్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[4] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]
కటిహార్ పార్లమెంటరీ నియోజకవర్గం :- తారిక్ అంవర్, నిఖిల్ కుమార్ చౌదరీ, యోనుయిస్ సలిం, ముఫ్తి మొహమ్మద్ సయ్యద్ (అపజయం). జిల్లా నుండి ప్రజలు స్వతంత్ర సమరంలో విస్తారంగా పాల్గొన్నారు. జిల్లాలోని ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు " అల్హజ్ అఝర్ అలి " ఙాపకార్ధం ఆయన నివసించిన గ్రామానికి ఆయన పేరు నిర్ణయించబడింది.
జిల్లాలో 3 ఉపవిభాగాలు ఉన్నాయి : కటిహార్, బర్సొయి , మనిహరి
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 3,068,149,[5] |
ఇది దాదాపు. | ఓమన్ దేశ జనసంఖ్యకు సమానం.[6] |
అమెరికాలోని. | లోవా నగర జనసంఖ్యకు సమం.[7] |
640 భారతదేశ జిల్లాలలో. | 117 వ స్థానంలో ఉంది.[5] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1004 [5] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 28.23%.[5] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 916:1000 [5] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 53.56%.[5] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
ప్రజలు | ముస్లిములు అధికంగా ఉన్నారు.[5] |
భాష | బెంగాలీ, సుర్జాపురి, బర్సొలి (బెంగాలి స్థానిక భాష) |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.