కటిహార్
బీహార్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
కటిహార్ బీహార్ రాష్ట్రం, కటిహార్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. బీహార్ లోని పెద్ద నగరాల్లో కటిహార్ ఒకటి. తూర్పు భారతదేశం లోకెల్లా అత్యంత వ్యూహాత్మక రైల్వే జంక్షన్ కటిఒహార్‌లో ఉంది.
కటిహార్ | |
---|---|
నగరం | |
![]() కటిహార్ జంక్షన్ రైల్వే స్టేషను | |
Coordinates: 25.53°N 87.58°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
జిల్లా | కటిహార్ |
పట్టణ ప్రాంతం | కటిహార్ |
విస్తీర్ణం | |
• Total | 33 కి.మీ2 (13 చ. మై) |
Elevation | 20 మీ (70 అ.) |
జనాభా (2011) | |
• Total | 2,40,565 |
• Rank | 117 |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 854105 |
Vehicle registration | BR-39 |
లోక్‌సభ నియోజకవర్గం | కటిహార్ |
రవాణా
రోడ్లు
కటిహార్, బాగా అంతర్భూభాగంలో ఉన్న కారణంగా పొరుగున ఉన్న నగరాలకు బీహార్, ఇతర పొరుగు రాష్ట్రాలకూ సరైన రోడ్డు సౌకర్యాలు లేవు. చక్కటి జాతీయ రహదారి అయిన ఎన్‌హెచ్ 131A మాత్రమే దానిని పూర్నియాతో కలుపుతుంది. అక్కడి నుండి
ఎన్‌హెచ్ 27,
ఎన్‌హెచ్ 231,
ఎన్‌హెచ్ 31 లు అందుబాటులో ఉంటాయి..
జనాభా
2011 జనాభా లెక్కల ప్రకారం, కటిహార్ పట్టణ ప్రాంత జనాభా 2,40,565. [2] ఈ పట్టణ ప్రాంతంలో కటిహార్ (మునిసిపల్ కార్పొరేషన్ ప్లస్ శివార్లు), కటిహార్ రైల్వే కాలనీ (శివార్లు) ఉన్నాయి. [3] కటిహార్ మునిసిపల్ కార్పొరేషన్ మొత్తం జనాభా 2,25,982, వీరిలో 1,19,142 మంది పురుషులు, 1,06,840 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడీ లింగ నిష్పత్తి 897. ఆరేళ్ళ లోపు పిల్లలు 31,036 మంది. ఏడేళ్ళకు పైబడినవారిలో అక్షరాస్యత 79.87%. [4] 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా పరంగా భారతదేశంలోని మొదటి 200 నగరాల్లో కటిహార్,193 వ స్థానంలో ఉంది.
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.