Remove ads

అల్లం ఒక చిన్న మొక్క వేరునుండి తయారవుతుంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఇది భారతదేశం, చైనా దేశాలలో చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని శతాబ్దాల నుంచీ చైనీయుల వైద్యంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది. కన్ఫ్యూషియస్ తన రచనల్లో దీనిగురించి ప్రస్తావించాడు. ఆసియా దేశాల్లో చేసే చాలా వంటకాల్లో ఇది విడదీయలేని భాగం. పచ్చళ్ళలోనూ, కూరల్లో వేసే మసాలా లోనూ దీన్ని విస్తృతంగా వాడుతారు. ఎండాకాలంలో వడకొట్టకుండా, అల్లాన్ని కరివేపాకు, మజ్జిగలతో కలిపి తీసుకుంటారు. చాలామందికి ప్రయాణాల్లో వాంతులు మహా ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని అల్లంతో అరికట్టవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అల్లం నోటి దుర్వాసనను పోగోడుతుంది. అల్లం నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాలను సంహరించి, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం అల్లానికి ఉంది. అల్లం ప్రభావం కాలేయం మీద ఉంటుంది. కొలెస్టరాల్ నియంత్రణలో మెరుగైన పాత్ర వహించేలా కాలేయాన్ని తయారు చేయడమే అల్లం నిర్వహించే పాత్ర. రక్త నాళాల్లో రక్తప్రవాహం మెరుగుపరుస్తుంది. నాళాలు మూసుకు పోవడం జరుగదు. కీళ్లవారు, ఆస్త్మాల నుండి ఉపశమనం అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అల్లం, చిటికెడు ఉప్పును భోజనానికి ముందుగానీ, తర్వాతగానీ తీసుకుంటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అల్లం మలబద్ధకాన్ని పోగొడుతుంది. సులభ విరోచనకారి కూడా. కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది.

త్వరిత వాస్తవాలు అల్లం, Conservation status ...
అల్లం
Thumb
Conservation status
Secure
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
Z. officinale
Binomial name
Zingiber officinale
Roscoe
మూసివేయి
Thumb
అల్లం
Thumb
అల్లం
Remove ads

లక్షణాలు

  1. ఈ మొక్క వార్షికంగా పెరుగుతుంది. ఇది ఒక హెర్బ్ నిత్యం ఒక మీటర్ పొడవు పెరుగుతుంది. కాండం ఇరుకుగా ఉండి ఆకుపచ్చ ఆకులు, పసుపు పువ్వులు కలిగి ఉంటాయి.అల్లం పసుపు పువ్వులు, తెలుపు, పింక్ రంగులు కలిగి ఉంటాయి.కాండం 3 నుండి 4 అడుగుల వరకు ఉంటుంది.ఎండిన నేలలో వొచ్చే ఎక్కువ పోషకాలను అందిస్తుంది. లేత అల్లం భూగర్భ చాలా తేలికపాటి రుచితో జ్యుసిగా, కండగా ఉంటుంది.ప్రౌఢ అల్లం భూగర్భ నుండి తీస్తారు దాదాపు పొడిగా ఉంటుంది.
  2. కొమ్మువంటి భూగర్భ కాండంతో పెరిగే గుల్మము.
  3. దీర్ఘవృత్తాకార-భల్లాకార సరళ పత్రాలు.
  4. కంకి పుష్పవిన్యాసంలో అమరిన పసుపు రంగు పుష్పాలు. శొంఠి ఏండ పెట్టిన అల్లాన్ని శొంఠి అంటారు. పచ్చి శొంఠిని పొడి చేసి కొన్ని వంటలలో వాడుతారు. నేతిలో వేయించి పొడి చేసిన శొంఠిని ఒక మందుగా ఉపయోగిస్తారు.
Remove ads

అల్లం ఉపయోగాలు:

  • మొదటి ముద్దగా అన్నంలో శొంఠిని పలుచగా కలిపి నేతితో తింటే, అజీర్తి పోతుందని నమ్మకం
  • బాలింతరాలుకు శరీరము గట్టి పడేందుకు, వేడి కలిగేందుకు శొంఠిని విస్తృతంగా వాడుతారు
  • ఆయుర్వేద మందులలో ఇది ఎక్కువ కనిపిస్తుంది.
  • అల్లం మంచి యాంటి ఆక్షిడెంట్ గా పనిచేస్తుంది .
  • రక్త శుద్ధికి తోడ్పడుతుంది .
  • రక్తం రక్త నాళాలలో గడ్డకట్టనీయకుండా సహాయపడుతుంది .
  • అల్లం కొన్ని వారాలపాటు వాడితే .. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి .
  • అల్లం వల్ల కడుపులో పూత (అల్సరు) ఏర్పడదు .
  • అల్లము నోటి దుర్వాసనను పోగొడుతుంది . . నోటిలో చేరిన ప్రమాదక బ్యక్టీరియల్ను సంహరించి, దంటాలను ఆరోగ్యముగా ఉంచుతుంచి .
  • అల్లం నుండిఅల్లం నూనెను తయారు చేస్తారు.
  • మధుమేహం రోగుల్లో ఇన్సులిన్ వ్యవస్థ మెరుగుపడేందుకు అల్లం ఉపయోగపడుతుంది. అయితే, దీన్ని మీరు డైట్‌గా తీసుకోవాలంటే వైద్యుల సూచన తీసుకోండి.
Remove ads

అల్లం ఆవశ్యక నూనెలోని రసాయన సమ్మేళనాలు

అల్లం నుండి స్టీమ్ స్వేదన ప్రక్రియ ద్వారా ఆవశ్యక నూనెలు అనే అస్థిర నూనె(అనగా తక్కువ ఉష్ణోగ్రత వద్దనే వాయువుగా మారే నూనెలు)ను సంగ్రహిస్తారు.సాధారణంగా అల్లం ఆవశ్యక నూనె టెర్పెనాయిడుల ను, ఆల్కహాల్ లను ఎక్కువ కల్గి వున్నది.అల్లంనూనెలో వున్న టెర్పినాయిడులలో ఆల్ఫా- టెర్పినేన్,ఆల్ఫా-టె ర్పినోయిల్, 4-టె ర్పినోయిల్, టెర్పినోలెన్ , ఇంకా గామా టెర్పినోలెన్ వున్నాయి. అలాగే ఆల్కహాల్లకు సంబంధించి నెరోల్.ట్రాన్స్-నెరోలీడోల్, 4-ఐసోప్రోపయిల్ బెంజైల్ ఆల్కహాల్ ,3,7 -డై మిథైల్ ఓక్టా -1,6-డైన్ -3-వల్ ,మరియు 3,7 -డై మిథైల్ ఓక్ట్ -6-ఎన్-1-ఎన్ -3-ఒల్ వంటి 15 మించిన ఆల్కహాల్ లు అల్లం నూనెలో వున్నవి.[1]

Remove ads

షుగర్ నియంత్రణ

షుగర్ జబ్బు దీర్ఘకాల అనారోగ్యసమస్యలు తెస్తుంది. అటువంటి షుగర్ జబ్బు నియంత్రణ చేఅయగలిగిన శక్తివంతమైన ఔషధము -అల్లము అని సిడ్నీవిశ్వవిద్యాలయం పరిశోధనా ఫ్లితాలు వెళ్ళడించాయి. అల్లము నుండి తీసిన రసాన్ని, అల్లం ముద్దగా నూరి అందించిన వారిలో రక్తములోని చెక్కెరలు కండరాలకు చేరే ప్రక్రియ వేగవంతం అవడము గమనించారు . ఇటుంటి ప్రక్రియ శరీరములో సహజముగా జరగాలంటే ఇన్సులిన్‌ అనే హార్మోను అవసరము . ఇన్సులిన్‌ లేకున్నా అల్లం రసము రక్తములో చెక్కెరలను కండరాలకు చేర్చడం గమనించిన పరిశోధకులు అల్లం ఎలా పనిచేస్తుందో వివరించే పనిలో పడ్డారు .

అల్లం ఒక చిన్న మొక్క. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఇది భారతదేశం, చైనా దేశాలలో చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని శతాబ్దాల నుంచి చైనీయుల వైద్యంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది. కన్ఫ్యూషియస్ తన రచనల్లో దీని గురించి ప్రస్తావించాడు. ఆసియా దేశాల్లో చేసే చాలా వంటకాల్లో ఇది విడదీయలేని భాగం. పచ్చళ్ళలోనూ, కూరల్లో వేసే మసాలా లోనూ దీన్ని విస్తృతంగా వాడుతారు. ఎండాకాలంలో వడదెబ్బ కొట్టకుండా, అల్లాన్ని కరివేపాకు, మజ్జిగలతో కలిపి తీసుకుంటారు.

Remove ads

లక్షణాలు

  • కొమ్మువంటి భూగర్భ కాండంతో పెరిగే గుల్మము.
  • దీర్ఘవృత్తాకార-భల్లాకార సరళ పత్రాలు.
  • కంకి పుష్పవిన్యాసంలో అమరిన పసుపు రంగు పుష్పాలు.

శొంఠి

ఏండ పెట్టిన అల్లాన్ని శొంఠి అంటారు. పచ్చి శొంఠిని పొడి చేసి కొన్ని వంటలలో వాడుతారు. నేతిలో వేయించి పొడి చేసిన శొంఠిని ఒక మందుగా ఉపయోగిస్తారు.

  • మొదటి ముద్దగా అన్నంలో శొంఠిని పలుచగా కలిపి నేతితో తింటే, అజీర్తి పోతుందని నమ్మకం
  • బాలింతరాలుకు శరీరము గట్టి పడేందుకు, వేడి కలిగేందుకు శొంఠిని విస్తృతంగా వాడుతారు
  • పసి పిల్లలకు అజీర్ణం తగ్గేందుకు చాలా తక్కువ మోతాదులో దీనిని వాడుతారు.
  • ఆయుర్వేద మందులలో ఇది ఎక్కువ కనిపిస్తుంది.

ఔషధముగా

Thumb
అల్లం చట్నీ

ఇది ఆకలిని పెంచుతుంది.జీర్ణ రసాలు ఊరడాన్ని ప్రేరేపిస్తుంది.ఆకలి తక్కువగా ఉన్నవారు చిన్న అల్లం ముక్కకు ఉప్పు అద్ది దాన్ని నమిలితే ఆకలి పుట్టును.

  • అల్లం ప్రయాణంలో ఉన్నపుడు కలిగే వికారాన్ని తగ్గిస్తుంది.
  • కొన్ని వేల సంవత్సరాలనుండి అల్లాన్ని జలుబు, ఫ్లూ చికిత్స కోసము వాడుతున్నారు.
  • అల్లం టీ తగడము వలన అజీర్తి తగ్గుతుంది.[2]
  • అల్లం పొడి అండాశయ క్యాన్సర్ కణాల్లో కణ మరణాన్ని ప్రేరేపిస్తుంది.
  • అల్లం తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • మిన్నెసోటా విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం అల్లం కొలరెక్టల్ క్యాన్సర్ కణాలు వృద్ధిని తగ్గిస్తుంది. అందువలన ఇది పెద్దప్రేగు క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది.
  • గర్భిణీ స్త్రీలలో తలతిరుగడం, వికారము, వాంతులు ఎక్కువగా ఉంటాయి. అల్లం తినడము వలన బాగా ఉపశమనం కలుగుతుంది.[3]
Remove ads

సాగు

అల్లం పంటకు తేమతో కూడిన వేడి వాతావరణం అవసరం. దీని సాగుకు బరువైన బంకమట్టి నేలలు, రాతి నేలలు పనికిరావు, మురుగునీటి పారుదల చాలా అవసరం. అల్లం ఏప్రిల్ నెలాఖరు నుంచి మే నెల మొదటి పక్షం వరకు నాటవచ్చు. ఏజెన్సీలో ఎక్కువగా పండించే వాటిల్లో నర్సీపట్నం, తుని స్థానిక రకాలున్నాయి. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పరిశోధనలు జరిపిన అధిక దిగుబడులనిచ్చే అల్లం రకాలను ఏజన్సీ రైతులు పండిస్తున్నారు.

కొన్ని విశేషాలు

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.

Remove ads