From Wikipedia, the free encyclopedia
అల్లం నూనే ఒక ఆవశ్యక నూనె. అల్లం నూనెను ఆంగ్లంలో జింజరు ఆయిల్ అని హిందిలో అద్రక్కి తేల్ అంటారు. అల్లం అనేది నేలలో ఆడ్దంగా పెరిగే వేరు.తెలుగులో ప్రకందం అనికూడా అంటారు. ఆంగ్లంలో రైజోమ్ (Rhizome) అంటారు. అల్లం నూనె ఘాటైన వాసన రుకి కల్గిన నూనె.అల్లాన్ని మాసాలా దినుసుగా రుచికి, వాసనకు వంటల్లో ఉపయోగిస్తారు. అల్లం, అల్లం నూనె వలన పలు ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం నూనెను వైద్యపరంగా, ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. అలాగే మందులతయారి రంగులో ఉపయోగిస్తారు. అల్లం నూనెలో మోనో, సెస్కుయి టేర్పే నాయిడులు ఉన్నాయి. అందువలన ఘాటైన వాసన కారం రుచి కల్గి ఉంది. నూనెలో నెరల్, జెరానియెల్,1,8-సినేయోల్, జింజీ బెరేన్, బీటా-బిసబోలెన్,, బీటా సేసిక్యూ పెల్లాన్డ్రెన్ రసాయన సమ్మేళనాలను కలిగి ఉంది. ఆంతేకాదు బీటా పినేన్, కాంపేన్, లినలూల్, బోర్నియోల్, గామా టెర్పినోల్, నేరోల్.జెరానియోల్,, జెరానైల్ ఆసిటేటులను కూడా కల్గి ఉంది.అల్లం నూనె నొప్పులనివాఱిగా పనిచేయునని . అంతేకాక రక్త ప్రసరణను మెరుగు పరచును.ఆరోమా థెరపిస్టులు అల్లం నూనెను సూథింగు, వార్మింగు ఆయిల్ గా ఉపయోగిస్తారు.[1]
అల్లం | |
---|---|
Conservation status | |
Secure | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | Z. officinale |
Binomial name | |
Zingiber officinale Roscoe | |
అల్లం మొక్క ఒక ఓషది మొక్క.అల్లం మొక్క ఒక దుంప వేరు మొక్క.మొక్క యొక్క భూమిలో అడ్డంగా పెరుగు వేరునే (rhizome) అల్లంగా ఉపయోగిస్తారు.అల్లాన్ని పలువంటల్లో రుచికి, వాసనకు, ఆరోగ్యపరమైన ప్రయోజనాలకై ఉపయోగిస్తారు. అల్లం మొక్క జింజీబెరేజియే కుటుంబానికి చెందిన మొక్క. అల్లం మొక్క వృక్షశాస్త్ర నామం జింజిబర్ అఫిసినేల్ (Zingiber officinale).ఇది బహువార్షిక ఓషది మొక్క.మూడు నాలుగు అడుగుల ఎత్తువరకు పెరుగును.సన్నన్ని, పొడవైన ఈటె వంటి ఆకారపు పత్రాలు వుండును.తెలుపు లేదా పసుపు రంగు పూలను పుష్పించును.భూమిలోపల లావైన వేర్లుదుంపలా అభివృద్ధి చెంది వుండును.అల్లం వేరు పై చర్మం బ్రౌన్ రంగులో వుండును.అల్లం లోని లోపల కండ పసుపు రంగులో వుండును.కొన్ని సార్లు రకాన్ని బట్టి తెల్లగా లేదా ఎర్రగా కూడా వుండును.[1]
అల్లం జన్మ స్థానం తూర్పు ఆసియాలోని ఇండియా నుండి మలేసియా వరకు ఉన్న ప్రాంతాలు.కొన్ని వేల సంవత్సరాల క్రితమే, ముఖ్యంగా చైనా, ఇండియా, గ్రీకు దేశాల్లో అల్లం యొక్క విశిష్ట త గురించి వైద్యంలో, వంటల్లో ఉపయోగించారు. క్రీ, పూ 4వేల సంవత్సరాల నాటిదిగా భావించే సంస్కృత మహాభారతంలో అల్లం ఉపయోగించిన వంట ప్రస్తావన ఉంది.ఆయుర్వేద వైద్యంలో అల్లం మొక్కను ప్రముఖమైనదిగా పెర్కోన బడింది.[1]
అల్లం నూనె లేత పసుపు రంగులో వుండి, ఘాటైన వాసన, అల్లం రుచిని కల్గివున్నది.తాజా అల్లం నుండి ఉత్పత్తి చేసిన నూనె మంచి సువాన ఇచ్చును.[1]
అల్లం నూనెలో జింజీబెరెన్ అనే సమ్మేళన పదార్థం10-16% వరకు అల్లం మొక్క రకాన్ని బట్టి వుండును.అల్లం నూనెలో వుండు మరికొన్ని రసాయనాలు ఈ-సిట్రాల్, జెడ్ సిట్రాల్, కంపెన్,, ఓసిమేన్.ఈ-సిట్రాల్ 16%వరకు, జెడ్ సిట్రాల్ 8*9%వరకు, కంపెన్ 7-8%వరకు వుండును.[2] అల్లం నూనెలోని మరికొన్ని అరోమాటిక్ రసాయనాలైన ఆల్ఫా పినేన్, బీటా పినెన్, జెరానియోల్, బోరానియోల్, నేరాల్, జెరానైల్ ఆసిటేట్, సిట్రాల్, బీటా బిసబోలెమ్, లినలూల్, నేరోల్, గామా టేర్పెనియోల్ లను కల్గివున్నది.[3]
నూనె యొక్క భౌతిక గుణాలు[4]
వరుస సంఖ్య | గుణం | మితి |
1 | సాంద్రత25°Cవద్ద | 0.871గ్రా/సెం.మీ3 |
2 | వక్రీభవన సూచిక | 1.49 |
3 | బాష్పీభవన స్థానం | 254 °C |
4 | flaash point | 175 °F |
అల్లం నుండి నూనెను ఆవిరి స్వేదన క్రియ/స్టీము డిస్టిలేసను ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేస్తారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.