కొలెస్టరాల్‌ లేదా కొలెస్టరోల్ (ఆంగ్లం Cholesterol) అనేది మన శరీరాలలో ఉండే ఒక రకం కావరం (lipid) లేదా ఒక రకం కొవ్వు (fat) పదార్థం. శాస్త్రీయ భాష మాట్లాడేటప్పుడు కొవ్వు (fat) కీ కావరం (lipid) కీ అర్ధంలో రవ్వంత తేడా ఉంది; కాని సాధారణంగా ప్రజలు ఈ తేడాని గుర్తించరు. ఇంగ్లీషులో ఈ cholesterol మాట చివర '-ol' శబ్దం గమనార్హం. రసాయన శాస్త్రంలో పేరు చివర '-ol' శబ్దం వచ్చే పదార్ధాలన్నీ ఆల్కహాలు (alcohol) జాతికి చెందినవని అర్ధం చేసుకోవాలి. ఇది ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఇంగ్లీషులో రాసినప్పుడు cholesterol అని రాసి, పలికినప్పుడు 'కొలెస్టరోల్‌' అని పలకాలి. కాని మన చెవికి 'కొలెస్టరోల్‌' కీ 'కొలెస్టరాల్' కీ మధ్య ఉన్న తేడా బాగా పట్టదు. అందుకని 'కొలెస్టరాల్' అని నిర్లక్ష్యంగా అనెస్తాం. వచ్చిన చిక్కు ఏమిటంటే రసాయన శాస్త్రంలో పేరు చివర '-al' శబ్దం వచ్చే పదార్ధాలన్నీ ఆల్డిహైడులు (aldehydes) అని మరొక జాతికి చెందినవి. ఇంగ్లీషు స్పెల్లింగులో ఈ తేడా గమనించి తీరాలి. తెలుగులో శాస్త్రం చదవటం, రాయటం అలవాటు అయిన రోజున ఈ తేడా మనం కూడా గమనించవలసి వస్తుంది.

త్వరిత వాస్తవాలు పేర్లు, గుర్తింపు విషయాలు ...
కొలెస్టరాల్
Thumb
Thumb
పేర్లు
IUPAC నామము
(3β)-​cholest-​5-​en-​3-​ol
ఇతర పేర్లు
(10R,​13R)-​10,​13-​dimethyl-​17-​(6-​methylheptan-​2-​yl)-​2,​3,​4,​7,​8,​9,​11,​12,​14,​15,​16,​17-​dodecahydro-​1H-​cyclopenta​[a]phenanthren-​3-​ol
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [57-88-5]
పబ్ కెమ్ 5997
SMILES O[C@@H]4C/C3=C/C[C@@H]1[C@H](CC[C@]2([C@H]1CC[C@@H]2[C@H](C)CCCC(C)C)C)[C@@]3(C)CC4
  • InChI=1/C27H46O/c1-18(2)7-6-8-19(3)23-11-12-24-22-10-9-20-17-21(28)13-15-26(20,4)25(22)14-16-27(23,24)5/h9,18-19,21-25,28H,6-8,10-17H2,1-5H3/t19-,21+,22+,23-,24+,25+,26+,27-/m1/s1

ధర్మములు
C27H46O
మోలార్ ద్రవ్యరాశి 386.65 g/mol
స్వరూపం white crystalline powder[1]
సాంద్రత 1.052 g/cm3
ద్రవీభవన స్థానం 148–150 °C[1]
బాష్పీభవన స్థానం 360 °C (decomposes)
నీటిలో ద్రావణీయత
0.095 mg/L (30 °C)
ద్రావణీయత soluble in acetone, benzene, chloroform, ethanol, ether, hexane, isopropyl myristate, methanol
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references
మూసివేయి

ఇంతకీ కొలెస్టరోల్‌ కావరమా? ఆల్కహాలా? కొలెస్టరోల్‌ (cholesterol) అన్నది స్టీరాయిడ్‌ (steroid) అన్న పదార్ధమూ, ఆల్కహాల్‌ (alcohol) అన్న పదార్ధమూ కలియగా వచ్చిన స్టీరాయిడ్‌ + ఆల్కహాల్‌ = స్టీరాల్‌ (sterol).

పేరు వెనక గాధ

ఇంగ్లీషులో కొలెస్టరోల్ అన్న పేరు ఎలా వచ్చిందో తెలిస్తే అవసరం వెంబడి దీనికి తెలుగులో పేరు పెట్టుకోవచ్చు. కనీసం ఇంగ్లీషులో ఈ పేరు ఎలా వచ్చిందో తెలిస్తే శాస్త్రజ్ఞులు పేర్లు ఎలా పెడతారో అర్ధం అవుతుంది. గ్రీకు భాషలో 'కోలె' (chole) అంటే పైత్యరసం లేదా పిత్తరసం (bile), స్టీరోస్‌ (stereos) అంటే ఘన పదార్థం. పేరు చివర '-ol' అనే తోక ఈ పదార్థం ఆల్కహాల్‌ జాతికి చెందింది అని చెబుతోంది. మొదట్లో, 1769లో పిత్తాశయం (gall bladder) లో ఉండే పైత్యపు బెడ్డలు (gall stones) లో ఈ పదార్ధాన్ని చూసేరు. పైత్యరసం కాలేయంలో తయారయి పిత్తాశయంలో నిల్వ ఉంటుంది. అప్పుడప్పుడు ఇది బెడ్డలుగా మారుతుంది. ఈ బెడ్డలలో కనిపించింది కదా అని మొదట్లో దీనికి 'కొలెస్టరీన్‌' అని పేరు పెట్టేరు. నెమ్మది మీద ఇది ఆల్కహోల్‌ జాతి పదార్థం అని అర్ధం అవగానే దీని పేరు, అంతర్జాతీయ ఒప్పందానికి అనుకూలంగా, 'కొలెస్టరోల్‌' అని మార్చేరు. ఈ కథనాన్ని దృష్టిలో పెట్టుకుని కొలెస్టరోల్‌ని తెలుగులో పిత్తఘృతోల్‌ అనొచ్చు. పిత్త = కోలె, ఘృత = నెయ్యి (ఘన రూపంలో ఉండే ఒక కొవ్వు పదార్థం), ఓల్‌ = ఆల్కహోల్‌. కాని మనందరికీ ఆల్కహాల్‌ అనటం అలవాటయిపోయింది కనుకనున్నూ, -ఓల్‌ శబ్దంతో అంతం అయే మాట్ మరొకటి ప్రస్తుతానికి పోటీగా లేదు కనుకనున్నూ మనం ఇటు పైన ఆల్కహాలు, కొలెస్టరాలు, పిత్తఘృతాలు అని -ఆల్‌ శబ్దంతో అంతం అయే మాటలనే వాడుదాం.

మన శరీరంలో కోలెస్టరాల్

అన్ని ప్రాణులకు కొలెస్ట్లరాల్ ఆవశ్యకమైనది కనుక దానిని సాధారణ పదార్ధాల నుండి మన శరీరం తయారు చేసుకుంటుంది. ఒక సగటు వ్యక్తి (68 కిలోలు లేదా 150 పౌన్లు బరువున్న వ్యక్తి) శరీరంలో రోజుకు 1 గ్రాము (1,000 మిల్లిగ్రాములు) కొలెస్ట్లరాల్ తయారవుతుంది. మొత్తం శరీరంలో సుమారు 35 గ్రాములు ఉంటుంది. సామంతమైన పాశ్చాత్య దేశాల ఆహారపు అలవాట్లు ఉన్న సమాజాలలో రోజువారీ ఆహారంలో 200–300 మిల్లిగ్రాములు కోలెస్టరాల్ ఉంటుంది. మనం తినే ఆహారంలో కొలెస్టరాల్ ఎక్కువ ఉంటే మన శరీరంలో దాని పరిమాణాన్ని అదుపుచేయటానికి, శరీరం తక్కువ మోతాదులో దానిని తయారుచేస్తుంది.

కొలెస్టరాల్‌ స్వభావం

కొలెస్టరాల్‌ అనేది సర్వసాధారణంగా జంతుజాతి కణజాలం (tissue) లోని కణకవచం (cell membrane) లో కనిపించే ఒక కావరం (lipid) . జంతువుల రక్తం లోని రసి (plasma) ద్వారా ఇది ఒక చోటు నుండి మరొక చోటుకి రవాణా అవుతుంది. జంతువుల శరీరాలు సహజ ప్రక్రియల ద్వారా ఈ కొలెస్టరాల్ ఉత్పత్తి చేస్తాయి; కనుక జంతు సంబంధమైన పదార్ధాలు తిన్నప్పుడు ఈ కొలెస్టరాల్‌ మనకి ఆహారం ద్వారా కూడా లభ్యం అవుతుంది.

కొలెస్టరాల్‌ రక్తంలో కరగదు కనుక పాలల్లో వెన్నపూసలాంటి కావరప్రాణ్యాలు (lipoproteins) సహాయంతో ఒక చోట నుండి మరొక చోటికి రవాణా చెయ్యబడుతుంది. ఈ కావరప్రాణ్యాలు చిన్న చిన్న గోళాకారపు పూసలలా రక్తంలో తేలియాడుతూ ఉంటాయి. బల్లిగుడ్లలో ఆవగింజ మాదిరి ఈ పూసల మధ్య నీటిలో కరగని కొవ్వులు, కొలెస్టరాల్‌ దాగొని కావరప్రాణ్యాలతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఈ కావరప్రాణ్యాలు రకరకాల పరిమాణాలలో, రకరకాల పేర్లతో ఉంటాయి. పెద్ద సైజు నుండి చిన్న సైజుకి వెళుతూ ఉంటే వాటిలో కొన్ని పేర్లు: కనిష్ఠ సాంద్రత కావరప్రాణ్యాలు (very low density lipoproteins or VLDL), మధ్యే సాంద్రత కావరప్రాణ్యాలు (intermediate density lipoproteins or IDL), తక్కువ సాంద్రత కావరప్రాణ్యాలు (low density lipoproteins or LDL), ఎక్కువ సాంద్రత కావరప్రాణ్యాలు (high density lopoproteins or HDL) . రక్తంలో ఎక్కువ సాంద్రత కావరప్రాణ్యాలు తక్కువగానూ, తక్కువ సాంద్రత కావరప్రాణ్యాలు ఎక్కువగానూ ఉంటే గుండెజబ్బూ, రక్తనాళాల జబ్బూ వస్తుందని ఉటంకింఛే సిద్ధాంతాన్ని కావర సిద్ధాంతం (lipid theory) అంటారు. ఈ పరిస్థితిలో రక్తనాళాలు గట్టిపడటం, పూడుకుపోవటం (atherosclerosis) జరుగుతుంది. ఇలా పూడుకుపోవటమనేది గుండెకాయకి రక్తం సరఫరా చేసే నాళాల్లో జరిగితే గుండెలోని కణజాలం చచ్చిపోతుంది. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో myocardial infarction అనిన్నీ, సామాన్యుల భాషలో heart attack అనిన్నీ, తెలుగులో గుండెపోటు అనిన్నీ అంటారు.

ఆహార మూలాలు

కొలెస్టరాల్ లో జంతుసంబంధమైన కొవ్వులు, త్రిగ్లిసరైడ్లు (triglycerides), భాస్వరకావరాలు (ఫాస్ఫోలిపిడ్లు) ఉంటాయి. దాని ఫలితంగా, జంతువుల కొవ్వును కలిగిన అన్ని ఆహారాలు విభిన్న పరిధులలో కొలెస్ట్లరాల్ ను కలిగి ఉంటాయి.[2] జున్ను, గుడ్లు, గొడ్డు మాంసం, పంది మాంసం, కోడి మాంసం,, ష్రిమ్ప్ (ఒక రకమైన చేప) లు, కొలెస్టరాల్ ను అందించే ముఖ్య ఆహార పదార్ధాలు.[3] మానవుల చను పాలలో కూడా కొలెస్టరాల్ గణనీయ పరిమాణాలలో ఉంటుంది.[4]. వంట సమయంలో కలిపితే తప్పితే మామూలుగా మొక్కల నుండి వచ్చే ఆహారంలో కొలెస్టరాల్ ఉండదు.[3] అయినప్పటికీ, మొక్కల ఉత్పత్తులైన అవిసె, వేరుశెనగ గింజలలో ఫైటో స్టీరాల్ అని పిలవబడే కొలెస్టరాల్ వంటి పదార్ధాలు ఉంటాయి. అవి రక్తంలో ఉండే సీరం కొలెస్టరాల్ స్థాయిలను తగ్గించటానికి సహాయపడేవిగా సూచించబడ్డాయి.[5]

రక్తంలో ఉన్న కొలెస్టరాల్ మట్టాన్ని నిర్ధారించడానికి తిన్న ఆహారంలో ఉన్న కోలెస్టరాల్ కంటే తిన్న మొత్తం కొవ్వు - ముఖ్యంగా సంతృప్త కొవ్వు, అనుప్రస్త కొవ్వు (trans fat) [6] - పెద్ద పాత్ర పోషిస్తాయి. నిండు శాతం కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులలో, జంతువుల కొవ్వులలో, వివిధ రకాల నూనె, చాక్లెట్లలో సంతృప్త కొవ్వు ఉంటుంది. అసంతృప్త కొవ్వుల పాక్షిక ఉదజనీకరణం నుండి అనుప్రస్త కొవ్వులు ఉత్పన్నమవుతాయి., ఇతర రకాల కొవ్వులకు విరుద్ధంగా, అనుప్రస్త కొవ్వులు ప్రకృతిలో ఎక్కువగా అగుపించవు. అవి ఆరోగ్యానికి కలుగజేసే ఇబ్బందుల కారణంగా ఆహారంలో అనుప్రస్త కొవ్వు ల వినియోగాన్ని తగ్గించాలని లేదా పూర్తిగా తొలగించాలన్న ప్రతిపాదనను పరిశోధనలు సమర్ధిస్తున్నాయి.[7]

ఇతర జీవన విధానాలను మార్చుకోవటంతో పాటు ఆహారంలో మార్పు రక్తపు కొలెస్టరాల్ ను తగ్గించటానికి సహాయపడుతుంది. జంతు ఉత్పత్తులను వదిలిపెట్టటం వల్ల, కేవలం ఆహార కొలెస్టరాల్ ను తగ్గించటం ద్వారానే కాకుండా ప్రధానంగా సంతృప్త కొవ్వును తక్కువగా తీసుకోవటం ద్వారా శరీరంలో కొలెస్టరాల్ స్థాయిలు తగ్గవచ్చు. ఆహారంలో మార్పు ద్వారా కొలెస్టరాల్ ను తగ్గించాలని కోరుకొనే వారు వారి రోజువారీ కేలరీ లలో 7% కన్నా తక్కువ సంతృప్త కొవ్వుల నుండి, 200 mg కన్నా తక్కువ కొలెస్టరాల్ ను రోజూ తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవాలి.[8]

వనరులు

  • V. Vemuri, "Cholesterol: The Good Villain," Science Reporter, pp 40–42, Jan 1994, CSIR, New Delhi.

బయటి లింకులు

ఉపప్రమాణాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.