![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/ce/Flag_of_Iceland.svg/langte-640px-Flag_of_Iceland.svg.png&w=640&q=50)
ఐస్లాండ్
From Wikipedia, the free encyclopedia
ఐస్లాండ్ (ఆంగ్లం : The Republic of Iceland) [2] అధికారిక నామం ది రిపబ్లిక్ ఆఫ్ ఐస్లాండ్, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో గల ఒక ద్వీప దేశం.దేశం ఆగ్నేయప్రాంతంలో మూడింట రెండు వంతుల ప్రజలు నివసిస్తున్నారు.ఐరోపాలో జనసాధ్రత తక్కువగా ఉన్న దేశంగా గుర్తించబడుతుంది.[3] భౌగోళికంగా ఐస్లాండ్ అగ్నిపర్వతాలు చురుకుగా ఉన్నాయి.లోతట్టు మైదానప్రాంతంలో ఇసుక భూములు, లావా ప్రాంతాలు ఉన్నాయి.ఈ దేశం ఐరోపా ఖండంలోని ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో 1,03,000 చదరపు కిలోమీటర్లు విస్తరించిన ఒక చిన్న ద్వీపం. ఇప్పుడు (2009) దీని జనాభా 3,20,000 మంది. దీని దేశ రాజధాని రిక్జావిక్. ఈ నగర సమీపంలో దేశంలోని మూడింట రెండు వంతుల ప్రజలు నివసిస్తున్నారు.ఇక్కడ భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లు సర్వసాధారణం. ప్రపంచంలో జరిగిన అగ్నిపర్వతాల పేలుళ్ళలో మూడోవంతు ఇక్కడే జరిగాయి. ఈ ద్వీపకల్పంలో ప్రధానంగా ఇసుక, పర్వతాలు, మంచు ఖండాలు ఉన్నాయి. భూగర్భ వేడి, నీటి నుండి విద్యుత్‌ను ప్రధానంగా ఉత్పత్తి చేస్తున్నారు. మంచు ఖండాల నుంచి వచ్చే నదులు కూడా నిత్యం ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాల గుండా సముద్రంలో సంగమిస్తాయి. గల్ఫ్ జలప్రవాహాలు ఐస్లాండును వెచ్చగా ఉంచుతాయి.ఆర్కిటిక్ సర్కిల్ సమీపంలో ఉన్న ఉన్నతభూప్రాంతంగా ఉన్నందున వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది.ఉన్నతభూప్రాంతంగా సముద్రతీర ప్రాంతంగా ఉన్నందున వేసవి కాలం చల్లగా ఉంటుంది.ద్వీపసమూహంలో అధికభాగం " తండ్రా క్లైమేట్ " కలిగి ఉంటుంది.ఇది ధనిక దేశం. అందరూ ధనికులే. ఈ దేశ వాసుల తలసరి ఆదాయం ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. ఒకప్పుడు చేపలు పట్టడం ద్వారా 80 శాతం ఆదాయాన్ని సంపాదించేవారు. ఇప్పుడు ఇది 40 శాతానికి తగ్గింది. క్రమంగా ఇప్పుడు ఇతర పారిశ్రామికోత్పత్తులు కూడా కొనసాగుతున్నాయి.
Lýðveldið Ísland రిపబ్లిక్ ఆఫ్ ఐస్లాండ్ |
||||||
---|---|---|---|---|---|---|
|
||||||
నినాదం లేదు |
||||||
జాతీయగీతం |
||||||
![]() Location of Iceland (orange) in Europe (white)
|
||||||
రాజధాని అతి పెద్ద నగరం | రేకవిక్ 64°08′N 21°56′W | |||||
అధికార భాషలు | Icelandic (de facto) | |||||
జాతులు | 93% Icelandic, 7.0% (see demographics) |
|||||
ప్రజానామము | Icelander, Icelandic | |||||
ప్రభుత్వం | Parliamentary republic | |||||
- | President | Ólafur Ragnar Grímsson | ||||
- | Prime Minister | Jóhanna Sigurðardóttir | ||||
- | Althing President | Guðbjartur Hannesson | ||||
Independence | from Denmark | |||||
- | Home rule | 1 February 1904 | ||||
- | Sovereignty | 1 డిసెంబరు 1918 | ||||
- | గణతంత్రం | 17 జూన్ 1944 | ||||
- | జలాలు (%) | 2.7 | ||||
జనాభా | ||||||
- | 1 December 2008 అంచనా | 319,7561 (172nd) | ||||
- | December 1980 జన గణన | 229,187 | ||||
జీడీపీ (PPP) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $12.274 billion[1] (132nd) | ||||
- | తలసరి | $39,167[1] (5th) | ||||
జీడీపీ (nominal) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $20.228 billion[1] (93rd) | ||||
- | తలసరి | $64,547[1] (4th) | ||||
జినీ? (2005) | 25.0 2 (low) (4th) | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) | ![]() |
|||||
కరెన్సీ | Icelandic króna (ISK ) |
|||||
కాలాంశం | GMT (UTC+0) | |||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .is | |||||
కాలింగ్ కోడ్ | +354 | |||||
1 | "Statistics Iceland:Key figures". www.statice.is. 1 October 2002. | |||||
2 | "CIA - The World Factbook -- Field Listing - Distribution of family income - Gini index". United States Government. Archived from the original on 23 జూలై 2010. Retrieved 14 September 2008. |
నార్వే కెప్టెన్" ఇంగోల్ఫర్ ఆర్నార్సన్ " ద్వీపంలో మొట్టమొదటి శాశ్వత నివాసిగా మారినసమయంలో పురాతన వ్రాతప్రతులు ల్యాండ్నామబోక్ ఆధారంగా ఐస్‌ల్యాండ్ మానవ స్థావరం సా.శ. 874 లో మొదలైంది.[4]
తరువాతి శతాబ్దాల్లో నార్వేజియన్లు, కొంతవరకూ ఇతర స్కాండినేవియన్లు, ఐస్లాండ్కు వలసవెళ్లారు. వీరితో స్కాటిష్ మూలానికి చెందిన థ్రిల్లల్స్ను (అనగా బానిసలు లేదా సేవకులు) తీసుకువెళ్లారు. ఈ ద్వీపం అల్ట్రా-ఇండిపెండెంట్ కామన్వెల్త్గా ఆల్‌టైం క్రింద నిర్వహించబడింది. ఇక్కడ ప్రపంచంలో అత్యంత పురాతనమైన శాసనసభల సమావేశాలు జరిగాయి. పౌర కలహాలు తరువాత ఐస్లాండ్ 13 వ శతాబ్దంలో నార్వేజియన్ పాలనలో చేరింది. 1397 లో కాల్మర్ యూనియన్ స్థాపన తరువాతనార్వే, డెన్మార్క్, స్వీడన్ రాజ్యాలతో కలిపింది. ఐస్లాండ్ ఈ విధంగా యూనియన్ ఏకీకరణను అనుసరించింది. 1523 లో స్వీడన్ విభజన తర్వాత డానిష్ పాలనలోకి వచ్చింది. డానిష్ రాజ్యం లూథరనిజాన్ని 1550 లో బలవంతంగా ప్రవేశపెట్టినప్పటికీ ఐస్లాండ్ ఒక సుదూర పాక్షిక-కాలనీల భూభాగంగా ఉంది.డానిష్ వైదొలగిన తరువాత కూడా దీనిలో డానిష్ సంస్థలు, అంతర్గత నిర్మాణాలు స్పష్టంగా ఉన్నాయి. ఫ్రెంచ్ విప్లవం, నెపోలియన్ యుద్ధాల నేపథ్యంలో స్వాతంత్ర్యం కోసం ఐస్లాండ్ పోరాటం 1918 లో స్వాతంత్ర్యం సంపాదించింది. 1944 లో గణతంత్ర స్థాపన ప్రారంభమైంది. 20 వ శతాబ్దం వరకు ఐస్‌ల్యాండ్ ఎక్కువగా జీవనోపాధి కొరకు అధికంగా వ్యవసాయం, మత్స్యపరిశ్రమ మీద ఆధారపడింది. ఐరోపాలో పేదదేశంగా ఉన్న ఐస్లాండ్ రెండో ప్రపంచ యుద్ధం తరువాత చేపల పెంపకం, మార్షల్ ప్లాన్ సహాయంతో పారిశ్రామికీకరణ ద్వారా సంపదను తెచ్చిపెట్టింది. తరువాత ఐలాండ్ దేశంలో అత్యంత ధనిక, అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటిగా మారింది. 1994 లో యూరోపియన్ ఎకనామిక్ ఏరియాలో ఇది ఒక భాగంగా మారింది. ఇది ఆర్థిక రంగం, బయోటెక్నాలజీ, ఉత్పాదక రంగం వంటి రంగాలలో మరింత విభిన్నంగా ఉంది.
ఇతర ఒ.ఇ.సి.డి దేశాలతో పోలిస్తే ఐస్‌ల్యాండ్‌లో తక్కువ పన్నులు ఉన్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ఉంది.[5] ఇది ఒక నోర్డిక్ సాంఘిక సంక్షేమ వ్యవస్థను నిర్వహిస్తుంది. ఇది సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, పౌరుల కోసం తృతీయ విద్యను అందిస్తుంది.[6] ఆర్థిక రాజకీయ సాంఘిక స్థిరత్వం, సమానత్వంలో ఐస్లాండ్ అధిక స్థానంలో ఉంది. 2016 లో ఇది ఐక్యరాజ్యసమితి మానవ అభివృద్ధి సూచిక ద్వారా ప్రపంచంలోని 9 వ అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించబడింది. గ్లోబల్ పీస్ ఇండెక్స్‌లో మొదటి స్థానంలో ఉంది.[7] ఐస్లాండ్ దాదాపు పూర్తిగా పునరుత్పాదక శక్తి మీద నడుస్తుంది. కొనసాగుతున్న ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభం కారణంగా దేశం మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ క్రమంగా 2008 అక్టోబరులో విఫలమైంది. ఇది తీవ్ర మాంద్యం, గణనీయమైన రాజకీయ అశాంతి, ఇసేస్వేవ్ వివాదానికి, రాజధాని నియంత్రణల దారితీసింది. కొంత మంది బ్యాంకర్లకు జైలు శిక్ష విధించారు.[8] అప్పటి నుండి ఆర్థికవ్యవస్థ పర్యాటక రంగాల పెరుగుదలతో భారీగా రికవరీని పొందింది.[9][10][11]
ఐస్లాండ్ సంస్కృతి దేశం స్కాండినేవియన్ వారసత్వం మీద స్థాపించబడింది. ఎక్కువ ఐస్లాండ్ లు నార్స్, గేలిక్ సెటిలర్స్ వారసులు. ఐస్‌ల్యాండ్ ఉత్తర జర్మానిక్ భాష, ఓల్డ్ వెస్ట్ నోర్స్ నుంచి వచ్చారు, ఇది ఫారోస్, పశ్చిమ నార్వేజియన్ మాండలికాలకు దగ్గరి సంబంధం కలిగి ఉంది. దేశం సాంస్కృతిక వారసత్వం సాంప్రదాయ ఐస్‌ల్యాండ్ వంటకాలు, ఐస్లాండిక్ సాహిత్యం, మధ్యయుగ సాగాలను కలిగి ఉంటుంది. నాటో సభ్యదేశాలలో అతి తక్కువ జనసంఖ్య కలిగిన దేశం ఐస్లాండ్.నాటోలో స్వీయ సైన్యం లేని దేశం ఐస్లాండ్ దేశం మాత్రమే. తేలికగా సాయుధ సముద్రతీర గార్డు రక్షణదళం బాధ్యతలు నిర్వహిస్తారు.[12]