From Wikipedia, the free encyclopedia
నమాజ్, (అరబ్బీ : صلاة ) (పర్షియన్, ఉర్దూలో : نماز ) (అరబ్బీ:صلوة) ఇస్లాంలో భక్తులు అల్లాహ్ ముందు మోకరిల్లి చేసే ప్రార్థన. ప్రతిదినం 5 సమయాలలో చేసే నమాజ్ ప్రతి ముస్లిం కచ్చితంగా పాటించవలసిన నియమం. ఇస్లామీయ ఐదు మూలస్థంభాలలో ఇది ఒకటి. నమాజ్ ను అరబ్బీలో "సలాహ్" అని అంటారు. ఇదే పదాన్ని పర్షియనులు, ఉర్దూ మాట్లాడేవారు "సలాత్" అని పలుకుతారు. పర్షియన్ భాషలో "నమాజ్" అని అంటారు. పర్షియన్ భాషాపదమైన "నమాజ్"నే భారత ఉపఖండంలో కూడా వాడుతారు.
|
అల్లాహ్ యొక్క ఉపాసన కొరకు ఖచ్చితంగా పాటించవలసిన నమాజ్ కొరకు క్రింది మూడు విషయాలు దృష్టిలో వుంచుకోవాలి :[2]
నమాజ్ ఆచరించడానికి ఆరు మూల విషయాలు గుర్తుంచుకోవాలి :[2]
ప్రార్థనా స్థలి పరిశుభ్రంగా వుండాలి. ఒకవేళ గాయాల కారణంగా శరీరం నుండి రక్తము ప్రవహిస్తూ వుంటే నమాజ్ ఆచరించరాదు. స్త్రీలు తమ ఋతుకాలములో నామాజ్ ఆచరించరాదు. అలాగే స్త్రీలు బిడ్డల ప్రసవించిన తరువాత ఒక నియమిత కాలం, ఉదాహరణ 40 రోజులవరకు నమాజ్ ఆచరించరాదు. ముహమ్మద్ ప్రవక్త ఈ విధంగా సెలవిచ్చారు "స్త్రీలు తమ ఋతుక్రమకాలంలోనూ, ప్రసవించిన తరువాత కొద్ది కాలం కొరకునూ నమాజు గాని ఉపవాసవ్రతంగానీ ఆచరించరాదు. "[7][8][9]
నమాజ్ ఆచరించదలచినవారు, శుచి శుభ్రత పాటిస్తూ, స్నానమాచరించి వుండవలెను.
వజూ అంటే నమాజుకు ముందు ముఖం, చేతులు, కాళ్లు శుభ్రపరచుకోటం.
కుళాయి వద్ద వజూ చేసేటప్పుడు నీరు వృథా కాకుండా నివారించేందుకు ఆటోమేటిక్ సెన్సర్లు, బేసిన్లతో ఒక యంత్రాన్ని కూడా రూపొందించారు. ఈ యంత్రంలో వజూ చేసే ముందు చదివే దువా (ప్రార్థన) కూడా రికార్డు చేసి ఉంచారు. వజూ చేసే ముందు ఈ యంత్రం నుంచి దువా వినిపిస్తుంది. ఈ యంత్రం ద్వారా ఒక్కొక్కరు వజూ చేయడానికి కేవలం 1.3 లీటర్ల నీరు సరిపోతుంది. హజ్ సమయంలో మక్కాలో 20 లక్షల మంది వజూ చేసుకోడానికి రోజుకు 5 కోట్ల లీటర్ల నీరు అవసరం. అదే ఈ యంత్రాన్ని వాడితే రోజుకు 4 కోట్ల లీటర్ల నీరు ఆదా అవుతుంది.[10]
ఇఖామా అంటే శ్రద్ధా భక్తులతో ప్రార్థనకోసం వరుసలుగా నిలబడటం అని అర్ధం. అజాన్ పలుకులు రెండు సార్లు ఇఖామా పలుకులు ఒకసారి పలకమని ప్రవక్త చెప్పారు (బుఖారీ 1:581) ఇఖామా విన్నప్పుడు తొందరపడకుండా ప్రశాంతంగా చేయగలిగినంత ప్రార్థన చేయండి (బుఖారీ 1:609) నుండి వెలికితీశారు.
పేరు | సమయం (వక్త్) | ఫర్జ్ కు ముందు ఐచ్ఛికం1 | విధిగా ఆచరించు నమాజ్ | ఫర్జ్ కు తరువాత ఐచ్ఛికం1 | ||
---|---|---|---|---|---|---|
సున్నీ | షియా | సున్నీ | షియా | |||
ఫజ్ర్ (فجر) | సూర్యోదయానికి 10-15 నిముషాలు ముందు ఆచరించే నమాజ్ |
2 రకాత్లు సున్నత్-ఎ-ముఅక్కదహ్2 |
2 రకాత్లు 2 | 2 రకాత్లు 1 | — | 2 రకాత్లు 1,3,7 |
జుహ్ర్ (ظهر) | మధ్యాహ్న సమయం | 4 రకాతులు సున్నత్-ఎ-ముఅక్కదహ్2 |
4 రకాతులు | 4 రకాతులు4 | 2 రకాతులు సున్నత్-ఎ-ముఅక్కదహ్2 |
8 రకాతులు 1,3,7 |
అస్ర్ (عصر) | సాయంకాల సమయం5&6 | 4 రకాత్లు సున్నత్-ఎ-గైర్-ముఅక్కదహ్ |
4 రకాత్లు | 4 రకాత్లు | - | 8 రకాత్లు 1,3,7 |
మగ్రిబ్ (مغرب) | సూర్యాస్తమయ సమయం వెనువెంటనే | 2 రకాత్లు సున్నత్-ఎ-గైర్-ముఅక్కదహ్ |
3 రకాత్లు | 3 రకాత్లు | 2 రకాత్లు సున్నత్-ఎ-ముఅక్కదహ్2 | 2 రకాత్లు 1,3,7 |
ఇషా (عشاء) | సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు అర్ధరాత్రి తరువాత ఇషా నమాజ్ చదవడం 'మక్రూహ్'6 |
4 రకాత్లు సున్నత్-ఎ-గైర్-ముఅక్కదహ్ |
4 రకాత్లు | 4 రకాత్లు | 2 రకాత్లు సున్నత్-ఎ-ముఅక్కదహ్, 2 3 రకాత్లు విత్ర్ |
2 రకాత్లు 1,3,7 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.