వెస్టిండీస్ పురుషుల క్రికెట్ జట్టు కరీబియన్ ప్రాంతంలో ప్రధానంగా ఇంగ్లీష్ మాట్లాడే దేశాలు, భూభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పురుషుల క్రికెట్ జట్టు. దీన్ని క్రికెట్ వెస్టిండీస్ నిర్వహిస్తుంది. ఈ జట్టును ది విండీస్ అని కూడా అంటారు.[10] ఈ మిశ్రమ జట్టులోని ఆటగాళ్లను పదిహేను కరేబియన్ దేశ-రాజ్యాలు, భూభాగాల నుండి ఎంపిక చేస్తారు. 2022 నవంబరు 26 నాటికి, వెస్టిండీస్ క్రికెట్ జట్టు అధికారిక ICC ర్యాంకింగ్స్‌లో టెస్ట్‌లలో ఎనిమిదో స్థానంలోను, వన్డేలలో పది, T20I లలో ఏడవ స్థానంలోనూ ఉంది.[11]
త్వరిత వాస్తవాలు మారుపేరు, అసోసియేషన్ ...
వెస్టిండీస్ |
మారుపేరు | విండీస్ |
---|
అసోసియేషన్ | క్రికెట్ వెస్టిండీస్ |
---|
|
టెస్టు కెప్టెన్ | క్రేగ్ బ్రాత్‌వైట్ |
---|
ఒన్ డే కెప్టెన్ | షాయ్ హోప్ |
---|
Tట్వంటీ I కెప్టెన్ | రోవ్‌మన్ పొవెల్ |
---|
కోచ్ | ఆండ్రె కోలీ (టెస్టులు) దారెన్ సమీ (పరిమిత ఓవర్లు)[1] |
---|
|
టెస్టు హోదా పొందినది | 1928 |
---|
|
ICC హోదా | Full Member (1926) |
---|
ICC ప్రాంతం | ఐసిసి అమెరికాస్ |
---|
ఐసిసి ర్యాంకులు |
ప్రస్తుత[2] |
అత్యుత్తమ |
---|
టెస్టులు |
8th |
మొదటి (1964 జనవరి 1) |
---|
వన్డే |
10వ |
మొదటి (1 June 1981) |
---|
టి20ఐ |
7వ |
1st (2016 జనవరి 10)[3] |
---|
|
|
మొదటి టెస్టు | v. ఇంగ్లాండు లార్డ్స్, లండన్; 1928 జూన్ 23-26 |
---|
చివరి టెస్టు | v. భారతదేశం క్వీన్స్‌పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్; 2023 జూలై 20-24 |
---|
టెస్టులు |
ఆడినవి |
గెలిచినవి/ఓడినవి |
---|
మొత్తం[4] |
573 |
182/209 (181 డ్రాలు, 1 టై) |
---|
ఈ ఏడు[5] |
6 |
1/3 (2 డ్రాలు) |
---|
|
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో పోటీ | 2 (first in 2019–2021 ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్) |
---|
అత్యుత్తమ ఫలితం | 8వ స్థానం (2019–2021 ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్, 2021–2023 ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్) |
---|
|
తొలి వన్డే | v. ఇంగ్లాండు హెండింగ్లే క్రికెట్ గ్రౌండ్, లీడ్స్; 1973 సెప్టెంబరు 5 |
---|
చివరి వన్డే | v. భారతదేశం at బ్రయన్ లారా క్రికెట్ అకాడమీ, శాన్ ఫెర్నాండో; 2023 ఆగస్టు 1 |
---|
వన్డేలు |
ఆడినవి |
గెలిచినవి/ఓడినవి |
---|
మొత్తం[6] |
867 |
418/408 (11 టైలు, 30 ఫలితం తేలనివి) |
---|
ఈ ఏడు[7] |
15 |
8/6 (1 టై, 0 ఫలితం తేలనివి) |
---|
|
పాల్గొన్న ప్రపంచ కప్‌లు | 12 (first in 1975) |
---|
అత్యుత్తమ ఫలితం | ఛాంపియన్లు (1975, 1979) |
---|
ఐసిసి ప్రపంచ కప్ క్వాలిఫయరులో పోటీ | 2 (first in 2018 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫయర్) |
---|
అత్యుత్తమ ఫలితం | రన్నరప్ (2018 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫయర్) |
---|
|
తొలి టి20ఐ | v. న్యూజీలాండ్ ఈడెన్ పార్క్, ఆక్లండ్; 2006 ఫిబ్రవరి 16 |
---|
చివరి టి20ఐ | v. భారతదేశం సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్, లాడర్‌హిల్; 2023 ఆగస్టు 13 |
---|
టి20ఐలు |
ఆడినవి |
గెలిచినవి/ఓడినవి |
---|
మొత్తం[8] |
184 |
76/95 (3 టైలు, 10 ఫలితం తేలనివి) |
---|
ఈ ఏడు[9] |
8 |
5/3 (0 టైలు, 0 ఫలితం తేలనివి) |
---|
|
ఐసిసి టి20 ప్రపంచ కప్ లో పోటీ | 8 (first in 2007 ఐసిసి ప్రపంచ ట్వంటీ20) |
---|
అత్యుత్తమ ఫలితం | ఛాంపియన్లు (2012 ఐసిసి ప్రపంచ ట్వంటీ20, 2016 ఐసిసి ప్రపంచ ట్వంటీ20) |
---|
|
|
|
As of 2023 ఆగస్టు 12 |
మూసివేయి
1970ల చివరి నుండి 1990ల ప్రారంభం వరకు, వెస్టిండీస్ జట్టు టెస్టులు, వన్డే ఇంటర్నేషనల్ రెండింటిలోనూ ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠంగా ఉండేది. వెస్టిండీస్ నుండి ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లుగా పరిగణించబడుతున్న అనేక మంది క్రికెటర్లు వచ్చారు. వీరిలో గార్ఫీల్డ్ సోబర్స్, లాన్స్ గిబ్స్, జార్జ్ హెడ్లీ, బ్రియాన్ లారా, వివియన్ రిచర్డ్స్, క్లైవ్ లాయిడ్, మాల్కం మార్షల్, ఆల్విన్ కల్లిచరణ్, ఆండీ రాబర్ట్స్, రోహన్ కన్హై, ఫ్రాంక్ వోరెల్, గోర్డాన్ గ్రీనిడ్జ్, క్లైడ్ వాల్కాట్, ఎవర్టన్ వీక్స్, కర్ట్లీ ఆంబ్రోస్, డెస్మండ్ హేన్స్, మైఖేల్ హోల్డింగ్, కోర్ట్నీ వాల్ష్, శివనారాయణ్ చందర్‌పాల్, జోయెల్ గార్నర్, వెస్ హాల్ మొదలైనవారు ఉన్నారు. వీళ్ళందరికీ ICC క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు లభించింది.[12][13]
వెస్టిండీస్ ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్‌ను రెండుసార్లు (1975, 1979, ప్రుడెన్షియల్ కప్), ఐసిసి టి 20 ప్రపంచ కప్‌ను రెండుసార్లు (2012,2016, వరల్డ్ ట్వంటీ 20గా మార్చినప్పుడు), ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని ఒకసారి (2004), ICC అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ ఒకసారి (2016),,క్రికెట్ ప్రపంచ కప్ (1983), అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ (2004), ICC ఛాంపియన్స్ ట్రోఫీ (2006)లో కూడా రన్నరప్‌గా నిలిచింది. వెస్టిండీస్ వరుసగా మూడు ప్రపంచ కప్ ఫైనల్స్‌లో (1975, 1979,1983) ఆడింది. వెంటవెంటనే ప్రపంచ కప్‌లను గెలుచుకున్న మొదటి జట్టు (1975, 1979). ఈ రెండు రికార్డులను ఆస్ట్రేలియా అధిగమించింది. ఆస్ట్రేలియా వరుసగా 4 ప్రపంచ కప్ ఫైనల్స్‌లో (1996, 1999, 2003, 2007) ఆడి, మూడింటిని (1999, 2003, 2007) గెలుచుకుంది.